iDreamPost

ఐపీఎల్ 2021: ఏ జట్టుకి అవకాశాలు ఎలా ఉన్నాయి..?

ఐపీఎల్ 2021: ఏ జట్టుకి అవకాశాలు ఎలా ఉన్నాయి..?

క్రికెట్ ప్రపంచంలోనే ఖరీదైన లీగ్ గా మారిన ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభమయ్యింది. కరోనా కారణంగా ఈసారి ఆరు నెలల వ్యవధిలోనే రెండో సీజన్ రావడం విశేషం. క్రికెట్ అభిమానులకు ముఖ్యంగా బెట్టింగ్ రాయుళ్లకు రాబోయే 50 రోజుల పాటు పండగగా దీన్ని చెప్పవచ్చు. ఈసారి కూడా కరోనా కారణంగా గత సీజన్ మాదిరిగానే ప్రేక్షకులు లేకుండానే నిర్వహించబోతున్నారు. గత సీజన్ యూఏఈలో నిర్వహించగా ఈసారి ఇండియాలో నిర్వహిస్తున్నారు. ముంబై, చెన్నై, కోల్ కతా, అహ్మదాబాద్, డిల్లీ వేదికలుగా ఈ మ్యాచులన్నీ జరగబోతున్నారు.

టీముల బలాబలాలు:-

ముంబై ఇండియాన్స్:

ఇప్పటికే ఐదు సార్లు ఈ టోర్నీ గెలుచుకుంది. గడిచిన రెండు సీజన్లలోనే విజేతగా ఉంది. ప్రస్తుతం టీ20లలో బలమైన జట్టుగా కనిపిస్తోంది. ఇంగ్లీష్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ వర్ణించినట్టుగా టీమిండియాతో సమానమైన బలం ఎంఐకి ఉంది. టీమిండియా తరుపున ఇటీవల రాణించిన ఆటగాళ్లు ఈ జట్టులో సగం మంది ఉన్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ మోస్ట్ సక్సెస్ ఫుల్ సారధిగా ఉన్నాడు. అంతేగాకుండా మిడిలార్డర్, ఆల్ రౌండర్ల బలం ఈ జట్టుని ఈసారి కూడా టాప్ లో తీసుకొస్తుందనే ఆశాభావం యాజమాన్యంలో ఉంది. బుమ్రా వంటి బౌలర్ ఉండడంతో జట్టు గట్టి ఆశలతోనే సాగుతోంది. ఈ సారి కూడా ఖచ్చితంగా ప్లే ఆఫ్ కి చేరడం దాదాపు ఖాయం.

ఢిల్లీ క్యాపిటల్స్ :

గత సీజన్ లోనే తొలిసారిగా ఫైనల్ వరకూ వచ్చింది. ఈసారి సారధి గాయాలు పాలుకావడంతో శ్రేయస్ అయ్యర్ స్థానంలో రిషభ్ పంత్ కి కెప్టెన్సీ కట్టబెట్టారు. సీనియర్లు, జూనియర్లతో సమతూకంగా కనిపిస్తోంది. అయితే పెద్దగా అనుభవం లేని పంత్ కెప్టెన్ గా ఏమేరకు జట్టుని నడిపించగలడదన్నది ప్రశ్నార్థకం. గత ఏడాది పర్పుల్ క్యాప్ విజేత రబాడా కొంత ఆలశ్యంగా జట్టులో చేరాడు. మరోసారి అలాంటి పెర్మార్మెన్స్ ను యాజమాన్యం ఆశిస్తోంది. శిఖర్ ధావన్, పృథ్వీషాలలో ఒకరు సెట్ అయినా ఓపెనింగ్ భాగస్వామ్యం అదిరిపోతుంది. విదేశీ ఆటగాళ్లతో పాటు అశ్విన్, రహానే వంటి అనుభవజ్ఞులు అందుబాటులో ఉండడంతో మరోసారి ప్లే ఆఫ్ కి చేరుతుందనే విశ్వాసం కనిపిస్తోంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

ఏటా ఈసారి కంప్ మనదే అంటూ రంగంలో దిగడం, చివరకు ఒట్టి చేతులతో వెనక్కి రావడం ఆనవాయితీగా ఉంది. బ్యాటింగ్ లో ధీటుగా కనిపించే ఆర్సీబీకి తిరుగులేదు. కానీ బౌలింగ్ మాత్రం కొంత ఆందోళనకరంగా ఉంటుంది. దేశీయ బౌలర్లు సిరాజ్, సైనీ , చాహాల్ జట్టుని ఏమేరకు గట్టెక్కిస్తారో చూడాలి. వారు రాణిస్తే ఆర్సీబీ ఆశలు పండుతాయి. యువ, సీనియర్ ఆటగాళ్లతో పాటుగా ఈసారి జట్టులో చేరిన మ్యాక్స్ వెల్ కూడా తోడు కావడంతో ఆర్సీబీ కూడా గట్టి విశ్వాసంతో బరిలో ఉంది. కింగ్ కోహ్లీ, ఏబీడీతో పాటుగా మ్యాక్స్ వెల్ కూడా వీరంగం చేస్తే బాల్స్ గాల్లోనే ఉంటాయి. టార్గెట్ ని కాపాడుకోవడంలో అవకాశాలు ఉంటాయి. మొత్తంగతా ప్లే ఆఫ్ కి చేరవచ్చని భావిస్తున్నారు.

సన్ రైజర్స్ హైదరాబాద్:

గత ఏడాది కన్నా ఈసారి పూర్తి బలంతో ఉంది. గాయాల నుంచి కోలుకున్న కెప్టెన్ వార్నర్, కివీస్ సారధి కేన్ విలయమ్సన్ తో పాటుగా ఇటీవల ఫుల్ పామ్ లో ఉన్న బెయిర్ స్ట్రో ఈ టీమ్ కి బలం అందరికీ మించి బలహీనంగా కనిపించిన బౌలింగ్ విభాగాన్ని భువనేశ్వర్ బలోపేతం చేయడంతో మరోసారి ఐపీఎల్ విజేతగా నిలవాలనే ధృఢ విశ్వాసంతో ఎస్ ఆర్ హెచ్ ఉంది. ఈ జట్టు కూడా టైటిల్ రేసులో ముందుంటుందని చెప్పవచ్చు.

కోల్ కతా నైట్ రైడర్స్:

భయంకరమైన ఆటగాళ్ల బలం ఉన్నప్పటికీ గత ఏడాది పేలవ ప్రదర్శనతో ఈజట్టు రేసులో లేకుండా పోయింది. ముఖ్యంగా కెప్టెన్సీ సమస్య వెంటాడింది. ఈసారి మాత్రం సీజన్ ప్రారంభం నుంచి మోర్గాన్ కే కెప్టెన్సీ అప్పగించారు. ఇక శుభ్ మన్ గిల్, ప్రసిద్ కృష్ణ వంటి దేశీయ యంగ్ స్టార్స్ తో పాటుగా రసెల్, నరేన్ , కమ్మిన్స్ వంటి వారితో పాటుగా షకీబుల్ హసన్ కూడా రాణిస్తే ఈ జట్టు భీకరంగా మారుతుంది. ప్లే ఆఫ్ ఆశలు పెట్టుకోలగిన మరో జట్టు ఇది.

చెన్నై సూపర్ కింగ్స్:

ఒకనాడు ఫుల్ ఫామ్ తో ఉన్న ఆటగాళ్లతో టాప్ లో కనిపించిన ఈ జట్టు ఇప్పుడు అంతా వెటరన్ ఆటగాళ్లతో నిండిపోతోంది. ధోనీ, ఊతప్ప, డుప్లెసిస్ వంటి సీనియర్లున్నారు. రాయుడు, జడేజా, శార్తూల్ ఠాకూర్ తో పాటుగా సామ్ కరన్ వంటి రీసెంట్ స్టార్లు కూడా ఉండడం ఈ జట్టు ప్రధాన బలం, అయితే బ్యాటింగ్ లో రైనా రాక జట్టుకి తోడ్పడితే సరే గానీ లేదంటే జట్టు కూర్పు కూడా సమస్య అవుతుంది. ప్లే ఆఫ్ కి ఈసారి కూడా చేరాలంటే చాలా కష్టపడాలి. గత ఏడాది ప్లే ఆఫ్ ఆశలు లేకుండా వెనుదిరిగింది.

పంజాబ్ కింగ్స్:

జట్టు పేరు మార్చుకున్న ఈ ప్రీతి జింటా టీమ్ ఈసారి కూడా ప్లే ఆఫ్ కి చేరాలంటే చాలా శ్రమించాల్సిందే. కే ఎల్ రాహుల్ సారధ్యంలోని జట్టు గత ఏడాది కొన్ని సంచలన విజయాలు నమోదు చేసింది. కానీ ఆ తర్వాత చతికిల పడిపోయింది. ఈసారి కూడా ఏమేరకు ప్రభావం చూపగలదన్నది సందేహమే జట్టులో బౌలింగ్ విభాగం ప్రధాన సమస్య.

రాజస్తాన్ రాయల్స్ :

తొలి సీజన్ లో ఛాంపియన్ గా నిలిచి ఈ జట్టు ఆ తర్వాత సత్తా చాటలేకపోతోంది. నిరుడు కూడా అదే తంతు. కొత్త కెప్టెన్ గా శ్యామ్ సన్ వచ్చాడు. బెన్ స్ట్రెక్స్, బట్లర్ వంటి ఇంగ్లీష్ ఆటగాళ్లున్నప్పటికీ మిడిలార్డర్ లో పెద్దగా సామర్థ్యం కనిపించడం లేదు. బౌలింగ్ కూడా జోఫ్రా ఆర్చర్ గాయపడడిన ఆర్ ఆర్ జట్టు ఆశలపై నీళ్లు జల్లింది. ఈ జట్టు కూడా ప్లే ఆఫ్ ఆశలు నిలవాలంటే చాలా కష్టపడాలి.

వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ లో కొత్త జట్టు చేరబోతున్న తరుణంలో ఈసారి టాప్ 4గా నిలిచేది ఎవరు. ఛాంపియన్ ఎవరు అన్నది చర్చనీయాంశమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి