iDreamPost

IPL 2024: ఆ బ్యాటర్ కోసం SRH ఎన్ని కోట్లయినా ఖర్చు పెడుతుందంటున్న పఠాన్!

  • Author singhj Published - 12:54 PM, Fri - 8 December 23

ఐపీఎల్‌ మినీ వేలంలో ఒక బ్యాటర్ కోసం ఎస్​ఆర్​హెచ్​ ఎన్ని కోట్లయినా ఖర్చు పెడుతుందన్నాడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.

ఐపీఎల్‌ మినీ వేలంలో ఒక బ్యాటర్ కోసం ఎస్​ఆర్​హెచ్​ ఎన్ని కోట్లయినా ఖర్చు పెడుతుందన్నాడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.

  • Author singhj Published - 12:54 PM, Fri - 8 December 23
IPL 2024: ఆ బ్యాటర్ కోసం SRH ఎన్ని కోట్లయినా ఖర్చు పెడుతుందంటున్న పఠాన్!

రీసెంట్​గా ముగిసిన 5 టీ20ల సిరీస్​లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా.. నెక్స్ట్ సౌతాఫ్రికాతో సిరీస్​కు సిద్ధమైపోయింది. ఇప్పటికే భారత జట్టు సఫారీ గడ్డపై ల్యాండ్ అయిపోయింది. అయితే ఈ సిరీస్ కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పైనే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు. ఐపీఎల్-2024 మొదలవ్వడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. కానీ మెగా లీగ్​కు సంబంధించిన మినీ వేలం త్వరలో జరగనుంది. దీంతో ఈసారి ఆక్షన్​లో ఏయే ప్లేయర్లను ఏయే ఫ్రాంచైజీలు దక్కించుకుంటాయి? అనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. రీసెంట్​గా ఆటగాళ్ల రిటెన్షన్ కూడా ముగిసిన సంగతి తెలసిందే. దీంతో క్రికెటర్ల ట్రేడింగ్ విండోకు డిసెంబర్ 12వ తేదీన తెరపడనుంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. అలాగే తమకు భారంగా మారిన వారిని వదులుకున్నాయి. తద్వారా వేలానికి ముందు కొంత డబ్బులను కూడా సమకూర్చుకున్నాయి.

మినీ ఆక్షన్ కోసం ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలు అన్నీ తమ ప్రణాళికల్ని రెడీ చేసుకుంటున్నాయి. టీమ్ కాంబినేషన్​లో సెట్ అయ్యే ప్లేయర్లు, తమ అవసరాలకు తగ్గట్లు ఆడగలిగే వారిపై ఓ కన్నేశాయి. ఎలాగైనా వారిని దక్కించుకునేందుకు ప్రయత్నించనున్నాయి. ఈసారి కొందరు స్టార్ ఆటగాళ్లు ఆక్షన్​లో పాల్గొననుండటంతో వాళ్ల కోసం ఫ్రాంచైజీల మధ్య భారీ పోటీ తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో మినీ వేలంపై టీమిండియా మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వన్డే వరల్డ్ కప్​లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర కోసం భారీ పోటీ తప్పదని అన్నాడు. అతడి కోసం చాలా ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉందన్నాడు. మరీ ముఖ్యంగా సన్​రైజర్స్ హైదరాబాద్ రచిన్ కోసం పెద్ద మొత్తంలో డబ్బుల్ని ఖర్చు చేసేలా కనిపిస్తోందని పఠాన్ అన్నాడు. ఎస్​ఆర్​హెచ్​​ టీమ్​ కొన్ని విషయాల్లో బాగుందని.. కానీ ఆ జట్టులో వికెట్లు తీయగల సత్తా ఉన్న స్నిన్నర్ల కొరత ఉందన్నాడు పఠాన్.

క్వాలిటీ స్పిన్​తో వికెట్లు తీస్తూ బ్యాటింగ్​లో కూడా సత్తా చాటే ఆటగాడు ఎస్​ఆర్​హెచ్​లో లేడన్నాడు పఠాన్. గతంలో ఆదిల్ రషీద్ రూపంలో ఒక స్పిన్ ఆల్​రౌండర్​ను తీసుకున్నప్పటికీ ఆ సమస్యను తీర్చలేకపోవడంతో అతడ్ని ఫ్రాంచైజీ వదులుకుందున్నాడు. టీమ్​లోకి ఇప్పటికే మయాంక్ మార్కండేయ లాంటి బెటర్ స్పిన్నర్ ఉన్నాడని.. కానీ అతడి కంటే మరింత మెరుగ్గా బౌలింగ్ చేసే ప్లేయర్ సన్​రైజర్స్​కు అవసరమని పఠాన్ తెలిపాడు. వాషింగ్టన్ సుందర్, మార్కో యాన్సెన్ రూపంలో స్పిన్, పేస్ ఆల్​రౌండర్స్ ఆక్షన్​లో ఉన్నారని చెప్పాడు. అయితే వీళ్ల కంటే కూడా రచిన్ రవీంద్రను తీసుకుంటే ఎస్​ఆర్​హెచ్​ బౌలింగ్ విభాగం మరింత బలోపేతం అవుతుందన్నాడు. రచిన్ వస్తే సన్​రైజర్స్ ఓపెనింగ్ సమస్య కూడా తీరుతుందన్నాడు పఠాన్. ఒక్క ప్లేయర్​తో ఇన్ని సమస్యలు తీరే ఛాన్స్ ఉంది కాబట్టే అతడి కోసం ఎస్​ఆర్​హెచ్​ ఎన్ని కోట్లు అయినా పెడుతుందని పేర్కొన్నాడు. మరి.. రచిన్ రవీంద్ర ఎస్​ఆర్​హెచ్​లోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IPL ఫ్రాంచైజీలపై గుజరాత్ టైటాన్స్ CEO సీరియస్.. తప్పు చేస్తున్నారంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి