iDreamPost

కాసులు కురిపిస్తున్న లీగ్ లు – ఒక్కో ఐపీఎల్ మ్యాచ్ విలువ 117 కోట్లు

కాసులు కురిపిస్తున్న లీగ్ లు – ఒక్కో ఐపీఎల్ మ్యాచ్ విలువ 117 కోట్లు

ఏ ఆటలోనైనా ఉన్నత స్థానానికి చేరాలంటే ప్రతిభతో పాటు ఏళ్ళనాటి కృషి అవసరం. ఒక్కసారి సుడి తిరిగితే ఇక ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు ఆటగాళ్ళు. ఈ మాట క్రికెట్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ వంటి ఆటలకు సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు అంతర్జాతీయ లీగ్ లతో పోటీ పడుతూ టాప్2గా నిలిచింది ఐపీఎల్.

ఐపీఎల్, నేషనల్ ఫుట్ బాల్ లీగ్, మేజర్ లీగ్ బేస్ బాల్ వంటి లీగ్ లు ప్రతి ఏటా రికార్డు వ్యూవర్ షిప్ ను దక్కించుకుంటాయి. అలా మీడియా హక్కుల రూపంలో కోట్లు వచ్చి పడతున్నాయి. అందుకే ఆటగాళ్ళకు సైతం భారీ నగదు అందుతోంది. ప్రపంచంలో కాసులు కురిపించే క్రీడా పోటీల గురించి తెలుసుకుందాం రండి.

 

  1. నేషనల్ ఫుట్ బాల్ లీగ్

ప్రపంచంలోని అత్యున్నత ఫుట్ బాల్ లీగ్ లలో నేషనల్ ఫుట్ బాల్ లీగ్ ఒకటి. ఇది ప్రతి ఏడు 18 వారాల పాటు కొనసాగుతుంది. ఒక్కో ఆటకు సుమారు 36 మిలియన్ డాలర్లు.. అంటే 281 కోట్లు వస్తాయి.

 

  1. ఇండియన్ ప్రీమియర్ లీగ్

ప్రపంచంలో ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ లీగ్ లతో సమానంగా డబ్బులు వచ్చే ఏకైక క్రికెట్ టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. 2022-2027 సంవత్సరాల వరకు కేవలం మీడియా హక్కులే 48,000 కోట్లకు అమ్ముడయ్యాయంటే, ఆ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐపీఎల్ ఒక్క మ్యాచ్ విలువ 117 కోట్లు పలుకుతోంది.

 

  1. ఇంగ్లీష్ ప్రీయమర్ లీగ్

ప్రపంచంలో అత్యధికంగా వీక్షించే ఫుట్ బాల్ లీగ్ గా ఇంగ్లీష్ ఫుట్ బాల్ లీగ్ కు పేరుంది. 20 క్లబ్బులు పోటీ పడే ఈ లీగ్ లో ఒక్కో జట్టు 38 మ్యాచ్ లు ఆడుతుంది. ఒక్కో ఆట ద్వారా లీగ్ కు 87 కోట్లు వచ్చి పడతాయి.

 

  1. మేజర్ బేస్ బాల్ లీగ్

ఇది ప్రపంచంలోనే పురతానమైన ప్రొఫెషనల్ లీగ్. ఇందులో 30 జట్లు పాల్గొంటాయి. నేషనల్ లీగ్, అమెరికన్ లీగ్ రెండూ కలిసి పోటీ పడే ఈ టోర్నమెంట్లో ఒక్కో వైపు నుంచి 15 జట్లు తలపడతాయి. ప్రతి ఆట ద్వారా మీడియా హక్కుల రూపంలో 76 కోట్ల వస్తాయి.

 

  1. నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్

ఈ లీగ్ లోని ప్రతి మ్యాచ్ ద్వారా 16 కోట్లు వస్తాయి. 1946లో ఈ లీగ్ ను న్యూయార్క్ లో ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యధిక పారితోషకం తీసుకునే అథ్లెట్లుగా ఈ లీగ్ ఆటగాళ్ళకు గుర్తింపు ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి