iDreamPost

వీడియో: ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. RCB క్యాంపులో చేరిన కోహ్లీ!

  • Published Mar 18, 2024 | 5:50 PMUpdated Mar 18, 2024 | 5:50 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు గుడ్ న్యూస్. కింగ్ కోహ్లీ కోసం ఎదురు చూస్తున్న వారు ఇక రిలాక్స్ అయిపోయిండి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు గుడ్ న్యూస్. కింగ్ కోహ్లీ కోసం ఎదురు చూస్తున్న వారు ఇక రిలాక్స్ అయిపోయిండి.

  • Published Mar 18, 2024 | 5:50 PMUpdated Mar 18, 2024 | 5:50 PM
వీడియో: ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. RCB క్యాంపులో చేరిన కోహ్లీ!

ఆ టీమ్ ప్లేయర్లు, ఈ టీమ్ ప్లేయర్లు .. ఇలా అందరూ వచ్చేశారు. వాళ్లు అభిమానించే జట్టులోని ఆటగాళ్లు కూడా ఇప్పటికే టీమ్​తో కలిశారు. కానీ తాము ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే, ఇష్టపడే, ఆరాధ్య క్రికెటర్ మాత్రం ఎంతకీ రావడం లేదు. కొడుకు పుట్టడంతో లండన్​లో ఉన్న ఆ స్టార్ ఎప్పుడు టీమ్​తో జాయిన్ అవుతాడా? అని అభిమానులు ఎదురు చూడసాగారు. ఎంతకీ రాకపోవడంతో ఆలస్యం అవడంతో అతడు సీజన్​లోని ఆరంభ మ్యాచులకు దూరమవుతాడంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. దీంతో వారు మరింత ఆందోళన చెందారు. అయితే ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఫుల్​స్టాప్ పెట్టాడా క్రికెటర్. మనం మాట్లాడుకుంటోంది మరెవరి గురించో కాదు.. ఆర్సీబీ అభిమానులు, వాళ్ల ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించే. అవును, ఎట్టకేలకు ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్. కోహ్లీ దాదాపు రెండు నెలల తర్వాత స్వదేశంలోకి అడుగుపెట్టాడు.

సతీమణి అనుష్క శర్మ డెలివరీ కారణంగా ఇన్నాళ్లూ లండన్​లో ఉండిపోయిన విరాట్ బెంగళూరుకు చేరుకున్నాడు. ఈ మేరకు కోహ్లీ ఎయిర్​పోర్ట్ నుంచి బయటకు వస్తున్న ఫొటోలను ఐపీఎల్ బ్రాడ్​కాస్టర్స్ ట్విట్టర్​లో షేర్ చేశాయి. తాజాగా ఆర్​సీబీ క్యాంపులో చేరాడు కింగ్. ఇందులో భాగంగా అతడు ఫీల్డింగ్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ నెల 19వ తేదీన చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆర్​సీబీ అన్​బాక్స్ ఈవెంట్​లో విరాట్ కూడా పాల్గొననున్నాడు. అన్ని పుకార్లకు ఫుల్​స్టాప్ పెడుతూ కోహ్లీ బెంగళూరుకు చేరుకోవడం, ప్రాక్టీస్​లో బిజీ అయిపోవడంతో అతడి అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. కోహ్లీ ఈజ్ బ్యాక్ అని అంటున్నారు. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడేనని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక, ఈ సీజన్​లో బెంగళూరు టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ పరంగా వీక్​గా కనిపిస్తున్నా బ్యాటింగ్ మాత్రం దుర్బేధ్యంగా ఉంది. టీమ్​లో మంచి బ్యాటర్లు ఉన్నారు. అయితే ఎలాగైనా ట్రోఫీ నెగ్గాలన్న కసిలో ఉన్న ఆర్సీబీ మేనేజ్​మెంట్.. ఏకంగా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పొజిషన్​ను మార్చేసిందని వినికిడి. గత సీజన్​లో కెప్టెన్ డుప్లెసిస్​తో కలసి ఓపెనింగ్ చేశాడు కింగ్. కానీ ఈసారి మాత్రం అతడు వన్ డౌన్​లో బ్యాటింగ్ చేస్తాడని క్రికెట్ వర్గాల సమాచారం. కోహ్లీ ప్లేసులో స్టార్ ఆల్​రౌండర్ కామెరాన్ గ్రీన్ ఓపెనర్​గా దిగుతాడని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఆర్సీబీ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. కాబట్టి కోహ్లీ బ్యాటింగ్ పొజిషన్ ఏంటనేది చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగే సీజన్ ఆరంభ మ్యాచ్​లో తేలనుంది. మరి.. కోహ్లీని తిరిగి యాక్షన్​లో చూసేందుకు మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి