iDreamPost

చరిత్ర సృష్టించిన కోహ్లీ.. T20ల్లో ఏ భారత బ్యాటర్​కూ సాధ్యం కాని ఘనత!

  • Published Mar 26, 2024 | 8:32 AMUpdated Mar 26, 2024 | 8:32 AM

రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్​లో ఏ భారత బ్యాటర్​ వల్ల కూడా కానిది సాధించి చూపించాడు.

రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్​లో ఏ భారత బ్యాటర్​ వల్ల కూడా కానిది సాధించి చూపించాడు.

  • Published Mar 26, 2024 | 8:32 AMUpdated Mar 26, 2024 | 8:32 AM
చరిత్ర సృష్టించిన కోహ్లీ.. T20ల్లో ఏ భారత బ్యాటర్​కూ సాధ్యం కాని ఘనత!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బోణీ కొట్టింది. ఐపీఎల్-2024లో తొలి విజయాన్ని నమోదు చేసింది డుప్లెసిస్ సేన. సీఎస్​కే చేతిలో ఓడి నిరాశలో ఉన్న ఆర్సీబీ.. రెండో మ్యాచ్​లో పంజాబ్ కింగ్స్​ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన పంజాబ్ 20 ఓవర్లు ఆడి 176 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్​కు దిగిన బెంగళూరు ఇంకో 4 బంతులు ఉండగానే టార్గెట్​ను అందుకుంది. ఛేజింగ్​లో విరాట్ కోహ్లీ (77), దినేష్ కార్తీక్ (28 నాటౌట్) దుమ్మురేపారు. కోహ్లీ ఇన్నింగ్స్​ను నిలబెడితే.. కార్తీక్ మ్యాచ్​ను ఫినిష్ చేశాడు. విరాట్ గనుక ఓ ఎండ్​లో నిలబడకపోతే మ్యాచ్ ఎప్పుడో ముగిసిపోయేది. తన ఎక్స్​పీరియెన్స్​ మొత్తాన్ని బయటకు తీసిన కింగ్ బెంగళూరుకు విజయాన్ని అందించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచిన కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

రికార్డుల రారాజు విరాట్ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 క్రికెట్​లో ఇప్పటిదాకా ఏ భారత బ్యాటర్​కూ సాధ్యం కానిది తాను చేసి చూపించాడు. పంజాబ్​తో మ్యాచ్​లో హాఫ్ సెంచరీ పూర్తి చేయడం ద్వారా టీ20ల్లో 100 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేసిన బ్యాటర్​గా నిలిచాడు. పొట్టి ఫార్మాట్​లో ఓ ఇండియన్ బ్యాటర్ కూడా ఇలా వందసార్లకు పైగా 50 ప్లస్ స్కోర్లు చేయలేదు. ఈ అరుదైన రికార్డుతో పాటు ఇదే మ్యాచ్​లో మరికొన్ని ఘనతలు అందుకున్నాడు కోహ్లీ. పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో జానీ బెయిర్​స్టో ఇచ్చిన క్యాచ్​ను అందుకున్నాడు కింగ్. ఈ క్యాచ్ ద్వారా టీ20 క్రికెట్ హిస్టరీలో భారత తరఫున అత్యధిక క్యాచ్​లు పట్టిన ఫీల్డర్​గా కోహ్లీ నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా (172 క్యాచ్​లు) ఆల్​టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.

Kohli

టీ20ల్లో అత్యధిక క్యాచుల విషయంలో రైనాను అధిగమించిన కోహ్లీ ప్రస్తుతం 173 క్యాచ్​లతో ఫస్ట్ ప్లేస్​లో ఉన్నాడు. ఈ లిస్ట్​లో రోహిత్ శర్మ (167 క్యాచ్​లు) మూడో స్థానంలో ఉన్నాడు. మనీష్ పాండే (146 క్యాచ్​లు), సూర్యకుమార్ యాదవ్ (136 క్యాచ్​లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్​లో మరో రికార్డును కూడా కోహ్లీ తన పేరు మీద లిఖించుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్​లో 175 ప్లస్ స్కోర్లను ఛేజ్ చేసిన సమయాల్లో 50 ప్లస్ స్కోర్లు ఎక్కువ సార్లు బాదిన బ్యాటర్​గా విరాట్ నిలిచాడు. ఇలా ఒకే మ్యాచ్​తో పలు రికార్డులను నమోదు చేశాడు కింగ్. అలాగే ఒకే ఒక్క ఇన్నింగ్స్​తో ఆరెంజ్ క్యాప్​నూ అందుకున్నాడు. ఐపీఎల్​-2024లో కోహ్లీ (98 పరుగులు) లీడింగ్ రన్ స్కోరర్​గా ఉన్నాడు. అతడి తర్వాత ప్లేసుల్లో సామ్ కర్రన్ (86), సంజూ శాంసన్ (82), శిఖర్ ధావన్ (67), ఆండ్రీ రస్సెల్ (64) ఉన్నారు. మరి.. కోహ్లీ అరుదైన రికార్డులపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ కు గుడ్ న్యూస్! మెరుపు బౌలర్ ఎంట్రీ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి