iDreamPost

Hardik Pandya: వీడియో: గ్రౌండ్​లో హార్దిక్​పై ఓ రేంజ్​లో ట్రోలింగ్.. ఇది వింటే మళ్లీ బ్యాట్ పట్టడు!

  • Published Apr 23, 2024 | 8:33 PMUpdated Apr 23, 2024 | 8:33 PM

ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ట్రోలింగ్ ఆగడం లేదు. అభిమానులు మళ్లీ అతడి మీద విరుచుకుపడ్డారు. బ్యాటింగ్​కు వెళ్తున్న టైమ్​లో పాండ్యాను టార్గెట్ చేసుకున్నారు. ఆ కామెంట్స్ గనుక అతడు వింటే లైఫ్​లో మళ్లీ బ్యాట్ పట్టడు.

ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ట్రోలింగ్ ఆగడం లేదు. అభిమానులు మళ్లీ అతడి మీద విరుచుకుపడ్డారు. బ్యాటింగ్​కు వెళ్తున్న టైమ్​లో పాండ్యాను టార్గెట్ చేసుకున్నారు. ఆ కామెంట్స్ గనుక అతడు వింటే లైఫ్​లో మళ్లీ బ్యాట్ పట్టడు.

  • Published Apr 23, 2024 | 8:33 PMUpdated Apr 23, 2024 | 8:33 PM
Hardik Pandya: వీడియో: గ్రౌండ్​లో హార్దిక్​పై ఓ రేంజ్​లో ట్రోలింగ్.. ఇది వింటే మళ్లీ బ్యాట్ పట్టడు!

ఏనాడు గుజరాత్ టైటాన్స్​ను వదిలిపెట్టాడో అప్పటి నుంచి హార్దిక్​ పాండ్యాకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఎంచక్కా జీటీకి సారథిగా ఉంటూ తన ఆటేదో తాను ఆడుకునేవాడు. టీమ్ ఒకసారి ఛాంపియన్​గా, రెండోసారి రన్నరప్​గా నిలవడంతో అతడి కెరీర్ గ్రాఫ్​, ఇమేజ్, క్రేజ్ అంతా పెరిగాయి. అలాంటోడు అన్నీ వదిలేసి భారీ ఆఫర్ వచ్చిందంటూ ఎగురుకుంటూ ఎంఐలోకి ల్యాండ్ అయ్యాడు. టాప్ టీమ్ కెప్టెన్సీ ఆఫర్​ను కాదనలేక బాధ్యతలు స్వీకరించాడు. అంతే 5 కప్పులు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్​ను కెప్టెన్ చేయడం ఏంటని ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. హిట్​మ్యాన్​ను ఫ్రాంచైజీ అవమానించడంతో భరించలేక పాండ్యాపై మరింత కోపాన్ని పెంచుకున్నారు. ఐపీఎల్-2024 స్టార్టింగ్ నుంచి హార్దిక్ ఎక్కడ కనిపిస్తే అక్కడ అతడ్ని ఎగతాళి చేస్తున్నారు.

ముంబై మ్యాచుల సమయంలో అభిమానులు పాండ్యాను బూ.. అంటూ హేళన చేయడం కామన్ అయిపోయింది. ఆఖరికి ఎంఐ హోమ్ గ్రౌండ్ అయిన వాంఖడేలోనూ ఫ్యాన్స్ హార్దిక్​ను ఏడిపిస్తున్నారు. కెప్టెన్​గానే గాక బ్యాటర్, బౌలర్​గా ఫెయిలవ్వడంతో అతడిపై ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. రాజస్థాన్​తో ఆ టీమ్​ నిన్న మ్యాచ్ ఆడిన టైమ్​లోనూ ఇది రిపీట్ అయింది. ముంబై ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్​కు దిగే ముందు హార్దిక్ వామప్ చేస్తూ కనిపించాడు. చేత్తో బ్యాట్‌ పట్టుకొని ఎక్సర్​సైజ్​లు చేస్తూ బ్యాటింగ్​కు ప్రిపేర్ అయ్యాడు. దీంతో స్టాండ్స్​లో కూర్చున్న ఫ్యాన్స్ అతడ్ని టార్గెట్ చేసుకొని విమర్శలు చేశారు. ఇక్కడే ఆడతావా? గ్రౌండ్​లోకి దిగి ఏమైనా చేసేది ఉందా? బిల్డప్​లు ఆపేయ్ అంటూ ట్రోల్ చేశారు.

సగం ఐపీఎల్ అయిపోయింది, అయినా నీ బ్యాట్ నుంచి రన్స్ రావడం లేదంటూ హార్దిక్​ను కొందరు ఫ్యాన్స్ టీజ్ చేశారు. నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్ ఉందని, పిలిస్తే పలకవా అంటూ అతడితో ఆటాడుకున్నారు. నువ్వు ఇక్కడే ఆడుకో ఇక అంటూ అతడ్ని హేళన చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, రాజస్థాన్​తో మ్యాచ్​లో రెండు ఓవర్లు వేసిన పాండ్యా 21 పరుగులు ఇచ్చుకున్నాడు. అతడికి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. బ్యాటింగ్​లోనూ అతడు నిరాశపర్చాడు. 10 బంతులు ఆడి 10 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిపై విమర్శలు మరింత పెరిగాయి. కాగా, ఇప్పటిదాకా ఆడిన 8 మ్యాచుల్లో ఐదింట ఓడిన ఎంఐ.. మూడింట మాత్రమే నెగ్గింది. ప్లేఆఫ్స్​కు చేరుకోవాలంటే ఇక మీదట ఆడే ప్రతి మ్యాచ్ ఆ టీమ్​కు చావోరేవో కానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి