iDreamPost

డెబ్యూ మ్యాచ్​లోనే రికార్డు బ్రేక్! 156 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్.. ఎవరీ మయాంక్ యాదవ్?

  • Published Mar 31, 2024 | 11:40 AMUpdated Mar 31, 2024 | 11:52 AM

అరంగేట్ర మ్యాచ్​లోనే బుల్లెట్ వేగంతో బంతులు విసురుతూ అదరగొట్టాడు. ఒక్క స్పెల్​తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అసలు ఎవరీ మయాంక్ యాదవ్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

అరంగేట్ర మ్యాచ్​లోనే బుల్లెట్ వేగంతో బంతులు విసురుతూ అదరగొట్టాడు. ఒక్క స్పెల్​తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అసలు ఎవరీ మయాంక్ యాదవ్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 31, 2024 | 11:40 AMUpdated Mar 31, 2024 | 11:52 AM
డెబ్యూ మ్యాచ్​లోనే రికార్డు బ్రేక్! 156 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్.. ఎవరీ మయాంక్ యాదవ్?

క్రికెట్​లో పేస్ బౌలింగ్ అనగానే ఆస్ట్రేలియా, పాకిస్థాన్, సౌతాఫ్రికా టీమ్సే మొదటగా గుర్తుకొస్తాయి. ఆ జట్ల నుంచి ఎందరో అత్యుత్తమ పేసర్లు వచ్చి అంతర్జాతీయ క్రికెట్​లో ఓ వెలుగు వెలిగారు. ఒకప్పుడు వెస్టిండీస్ కూడా పేస్​గా అడ్డాగా ఉండేది. అయితే భారత్ మాత్రం స్పిన్​లో టాప్​గా ఉండేది. మన దేశం నుంచి దిగ్గజ స్పిన్నర్లు ఇంటర్నేషనల్ క్రికెట్​లో హవా నడిపించారు. అదే టైమ్​లో కపిల్ దేవ్, జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్ లాంటి వాళ్లు నిఖార్సయిన పేస్ బౌలింగ్​తో తమదైన ముద్ర వేశారు. ఇప్పుడు మహ్మద్ షమి, జస్​ప్రీత్ బుమ్రా కూడా వారి అడుగు జాడల్లోనే నడుస్తున్నారు. అయితే ఎంతమంది పేసర్లు వచ్చినా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు వేస్తూ భయపెట్టేవారు మన దగ్గర తక్కువే. కానీ ఆ లోటును తీర్చేందుకు తాను ఉన్నానని భరోసా ఇస్తున్నాడు మయాంక్ యాదవ్.

ఐపీఎల్-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో లక్నో సూపర్ జియాంట్స్ తరఫున బరిలోకి దిగి అదరగొట్టాడు మయాంక్. డెబ్యూ మ్యాచ్​లోనే గంటకు 150 కిలోమీటర్ల వేగానికి తగ్గకుండా నిలకడగా బంతులు సంధించాడు. ఒక బాల్ అయితే ఏకంగా 155.8 కిలోమీటర్ల వేగంతో వేసి అందర్నీ నివ్వెరపోయేలా చేశాడు. ఈ సీజన్​లో ఇదే ఫాస్టెస్ట్ బాల్ కావడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ స్పీడ్​స్టర్ బర్గర్ (153 కి.మీ) పేరిట ఉన్న రికార్డులను మయాంక్ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్​లో 4 ఓవర్లు వేసిన యాదవ్.. 27 పరుగులు ఇచ్చి కీలకమైన 3 వికెట్లు తీశాడు. 11 ఓవర్లకు 100 పరుగులతో పటిష్టంగా ఉన్న పంజాబ్ 178 పరుగులకు పరిమితమై ఓడిందంటే అది మయాంక్ వల్లేనని చెప్పాలి. బుల్లెట్ వేగంతో బంతులు విసిరిన అతడి బౌలింగ్​లో స్లోయెస్ట్ బాల్ 141 కిలోమీటర్ల వేగంతో వచ్చింది. దీన్ని బట్టే మయాంక్ స్పెల్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

Record breaking in the debut match!

ఎవరీ మయాంక్?

ఒక్క స్పెల్​తో ఓవర్​నైట్ స్టార్​గా మారిన మయాంక్ గురించి తెలుసుకునేందుకు అందరూ ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడు ఇంతకుముందు ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.. 21 ఏళ్ల మయాంక్ ఢిల్లీలో పుట్టాడు. అదే రాష్ట్రం తరఫున డొమెస్టిక్ క్రికెట్​లో ఆడుతూ వెలుగులోకి వచ్చాడు. రంజీ ట్రోఫీ-2022 సీజన్​లో మహారాష్ట్రలో మ్యాచ్​తో ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో అడుగుపెట్టిన యాదవ్.. అనంతరం లిస్ట్​-ఏ, టీ20 క్రికెట్​లో ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది దేవ్​ధర్ ట్రోఫీలో నార్త్​జోన్​ తరఫున ఆడుతూ 5 మ్యాచుల్లోనే 12 వికెట్లు పడగొట్టి హయ్యెస్ట్ జాయింట్ వికెట్ టేకర్​గా నిలిచాడు. ఇప్పటిదాకా మూడు ఫార్మాట్లలోనూ కలిపి 46 వికెట్లు తీశాడు. ఐపీఎల్-2023కి ముందు జరిగిన మెగా వేలంలో అతడ్ని రూ.20 లక్షల బేస్ ప్రైజ్​కు లక్నో దక్కించుకుంది. అయితే ఇంజ్యురీ కారణంగా గతేడాది అతడు ఆడలేకపోయాడు. దీంతో అతడి ప్లేస్​లో అర్పిత్ గులేరియాను తీసుకున్నారు. ఈసారి ఐపీఎల్​కు ముందు మినీ వేలంలో అతడ్ని లక్నో మళ్లీ సొంతం చేసుకుంది. మరి.. పంజాబ్​తో మ్యాచ్​లో మయాంక్ బౌలింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: IPLతో BCCI రియల్ గేమ్.. బోర్డు నుంచి ఇది ఎక్స్​పెక్ట్ చేయలేదు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి