iDreamPost

తక్కువ స్కోరు.. కాపాడుకున్న బెంగళూరు!

తక్కువ స్కోరు.. కాపాడుకున్న బెంగళూరు!

ఐపీఎల్ లో మంగళవారం ముంబై ఇండియన్స్, కలకత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ ను మళ్లీ రిప్లై చూసినట్లు గానే బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అనిపించింది. లక్ష్య ఛేదనలో కోల్కతా ఎలా తడబడిందో హైదరాబాద్ సైతం అదే పద్ధతి తో మ్యాచ్ను ప్రత్యర్థికి అప్పగించింది. లక్ష్యం సైతం దాదాపు మంగళవారం 152 అయితే, బుధవారం 150 కావడం యాదృచికం అనిపించింది.

బౌలింగ్ లో ఎంతో పటిష్టంగా కనిపించే సన్రైజర్స్ హైదరాబాద్ దానికి తగ్గట్టుగానే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్లో చాలా పొదుపుగా బౌలింగ్ చేసింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లను తొందరగానే అవుట్ చేసింది. కెప్టెన్ కోహ్లీ 34 రన్స్ చేసినా, దానిలో వేగం లేకపోవడంతో పెద్ద ఇబ్బంది అనిపించిలేదు. విధ్వంసక బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ సైతం రెండు పరుగులు చేసి అవుటయ్యాడు. పూర్తిగా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన హైదరాబాద్ చివరలో కాస్త పట్టు సడలించడం తో మ్యాక్స్వెల్ రూపంలో పరుగుల తుఫాన్ చుట్టు ముట్టింది. దీంతో బెంగళూరు ఆ మాత్రం స్కోర్ ఐన చేయగలిగింది. హైదరాబాదులోని దాదాపు అందరు బౌలర్లు మంచి ప్రదర్శన ఇచ్చారు.

150 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని తో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ చాలా సులభంగానే మ్యాచ్ గెలుస్తుందని అంతా భావించారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ వార్నర్ అర్థ సెంచరీ చేసి అవుటయ్యాడు. అయితే అతడి తర్వాత వచ్చిన ఏ బ్యాట్స్మెన్ నిలకడగా ఆడలేదు. మనీష్ పాండే, బెయిర్స్టో వంటి బ్యాట్స్మెన్లు కనీసం క్రీజ్లో నిలదొక్కుకుని ఉంటే హైదరాబాద్ గెలిచి ఉండేది. అయితే డేవిడ్ వార్నర్ తర్వాత వచ్చిన ఎవరు సరిగా స్కోర్ చేయక పోవడంతో పాటు, కనీసం చిన్న స్కోరును చేయించే ప్రయత్నం కూడా చేయలేదు అనిపించింది.

వికెట్లు ఒక్కొక్కటిగా పడుతున్నా సరే చివర్లో మాత్రం హోల్డర్, రషీద్ ఖాన్ లు కాస్త ఉత్కంఠగా బ్యాటింగ్ చేశారు. బెంగళూరు అభిమానులకు దాదాపు నిద్రపట్టని అంత పని చేశారు. రెండు ఓవర్లకు 26 పరుగులు చేయాల్సిన తరుణంలో ధాటిగా ఆడి, ఓవర్ కు 15 రన్స్ చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. దీంతో గట్టిగా ఆడుతున్న రషీద్ ఖాన్ విజయం వైపు హైదరాబాద్ లో నడిపిస్తారని అంతా భావించారు. అందులోనూ వరుసగా రెండు బంతులు నో బాల్స్ పడటంతో 4 బాల్స్ కు 8 డ్రమ్స్ కొడితే విజయం సాధించే అవకాశం హైదరాబాద్కు వచ్చింది. అయితే చివరి శ్రేణి బ్యాట్స్ మెన్లు నిలకడగా ఆడడంలో లోపం ఉండడం తో వరసగా హోల్డర్,రషీద్ ఖాన్, నదీం అవుట్ అయ్యారు. దీంతో బెంగళూరు వైపు విజయం మోగింది. వరుసగా రెండో మ్యాచ్లోనూ సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమి మూటగట్టుకుంది. వరుసగా మంగళ బుధవారాల్లో తక్కువ స్కోరు చేసిన జట్లు, బౌలింగ్ను నిలకడగా వేసి లక్ష్యాన్ని కాపాడుకొని విజయం సాధించడం విశేషం.

గురువారం రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి