iDreamPost

దుమ్మురేపిన ముంబై!

దుమ్మురేపిన ముంబై!

ముంబై ఇండియన్స్ ప్రతి ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ ను ఓడిపోయి, తర్వాత నుంచి బీభత్సంగా పుంజుకొని టైటిల్ ఎగరేసుకుపోవడం ఆనవాయితీగా వస్తోంది. మళ్ళీ అలాంటి ఆనవాయితీ నే ముంబై జట్టు కొనసాగించింది. మొదటి మ్యాచ్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయిన ముంబై రెండో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ను తక్కువ రన్స్కే కట్టడి చేసి అద్భుతం అనిపించింది. ముంబై జోరుకు కళ్లెం వేసే లా కోల్కతా నైట్ రైడర్స్ అన్నివిధాల ప్రయత్నించిన, ఫలితం మాత్రం రాక పోయింది.

ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లో చాలా బలంగా ఉంది. కృనాల్ పాండ్యా ఏడవ డౌన్ లో దిగే వరకు ఆ జట్టుకు బ్యాట్స్మెన్లు కొరత ఏమీ లేదు. ఒకరి వెళ్ళిన తర్వాత మరొకరు వచ్చి విధ్వంసం సృష్టించడం ముంబై ఇండియన్స్ కు చాలా సహజం. ఐపీఎల్ 20 21 సీజన్ లో మొదటి మ్యాచ్లో ఆర్సిబి చేతిలో ఓటమిపాలైన ముంబై రెండో మ్యాచ్లో కచ్చితంగా పుంజుకొని మంచి విజయం సాధిస్తుందని భావించిన వారికి ముంబై ఇండియన్స్ మంచి బహుమతి అందించిది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్కు ముంబైని ఆహ్వానించిన కోల్కతా నైట్ రైడర్స్ దానికి తగ్గట్టుగానే బౌలింగ్ ప్రణాళికాయుతంగా వేశారు. మహామహులు బ్యాట్స్మెన్లు గా ఉన్నప్పటికీ వారందరినీ ఒకరి తర్వాత ఒకరు మెల్ల మెల్లగా పెవిలియన్ కు పంపడం లో కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లు పూర్తి ఆధిపత్యం సాధించారు. ఫలితంగా పెద్ద స్కోర్లు సాధించకుండానే ముంబై ఇండియన్స్ టీం కేవలం 152 సాధారణ స్కోర్ చేసి ఆలౌట్ అవడం గమనార్హం. ముంబై ఇండియన్స్ గత మూడు సీజన్లలో ఆల్ ఔట్ అవ్వడం ఇదే తొలిసారి. కోల్కతా నైట్ రైడర్స్ మీద ఆల్ అవుట్ అవ్వడం ఇదే తొలిసారి. పూర్తి ఓవర్లు అయ్యేటప్పటికి ఆల్ అవుట్ అయిన ముంబై ఇండియన్స్ 152 రన్స్ సాధించి కోల్కతాకు 153 రన్స్ టార్గెట్ ఇచ్చింది .

తర్వాత స్వల్ప లక్ష్యాన్ని సాధించడానికి క్రీజులోకి వచ్చిన కోల్కతా నైట్రైడర్స్ బ్యాట్స్మెన్స్ సరైన ప్రతిభా చూపలేకపోయారు. ఒకరి తర్వాత ఒకరుగా పెవిలియన్ బాట పట్టారు. ఇన్నింగ్స్ ప్రారంభించడానికి వచ్చిన నితీష్ రానా తప్ప, మిగిలిన వారు ఎవ్వరూ కోల్కతా ఆదుకునేందుకు ఏ మాత్రం సహాయ పడలేదు. అతి తక్కువ స్కోరు ను చేధించేందుకు ఆపసోపాలు పడటం కనిపించింది. kolkata బ్యాటింగ్ మొత్తం చాలా బలంగా ఉన్నా సరే, ముంబై బౌలర్లు చాలా పొదుపుగా బౌలింగ్ వేయడంతో విజయానికి ఎక్కడ దగ్గరగా చేరుకోలేక కోల్కత నైట్రైడర్స్ సతమతం అయింది. ఆఖరికి బీభత్సమైన హిట్టర్ గా పేరొందిన ఆండ్రూ రస్సెల్ సైతం ఏమీ చేయలేక కేవలం సాధారణ బ్యాట్స్మెన్గా నాలుగు పరుగులు చేసి అవుటయ్యాడు. బౌలింగ్ ను పూర్తిగా కట్టుదిట్టం చేసిన ముంబై ఇండియన్స్ కోల్కతా ను ఏ దిశలో ముందుకు కదలకుండా గట్టిగా అడ్డుకుంది. ఫలితంగా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించ లేక కోల్కతా నైట్రైడర్స్ చతికిలబడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి