iDreamPost

దుమ్మురేపిన ముంబై ఇండియన్స్!

దుమ్మురేపిన ముంబై ఇండియన్స్!

ముంబై ఇండియన్స్ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. ఐదు మ్యాచ్లలో రెండు మ్యాచ్లను మాత్రమే గెలిచి, మూడు మ్యాచ్లు పరాజయం పాలైన ముంబైకి ఖచ్చితమైన విషయం కావాల్సిన తరుణంలో బ్యాటింగ్ బౌలింగ్ రెండు విభాగాలను అద్భుతంగా ఆడింది. ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మీద ముంబై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

టాస్ గెలిచి రాజస్థాన్ కు మొదట బ్యాటింగ్కు ఆహ్వానించాడు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ. ఇన్నింగ్స్ ధాటిగా మొదలుపెట్టిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ బట్లర్ బౌండరీల మోత మోగించాడు. బౌల్ట్, బుమ్రా బౌలింగ్ లో సైతం గట్టిగ ఆడాడు. బట్లర్ కు తోడుగా యశస్వి జైస్వాల్ సైతం నిలకడగా బౌండరీలు సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ మంచి స్కోరు అందుకుంటుంది అనిపించింది.32 బాల్స్ లో 41 రన్స్ చేసిన బట్లర్ ముందుకు వచ్చి షాట్ ఆడబోయి స్టంప్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెనువెంటనే మరో ఓపెనర్ జైస్వాల్ 20 బాల్స్ లో 32 కొట్టి అవుట్ అయ్యాడు. తర్వాత క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ కు తోడుగా కూడా చక్కగా ఆడటంతో రాజస్థాన్ స్కోరు ఈజీగా 200 దాటుతుందని భావించారు. సంజూ శాంసన్ 42 పరుగులు, శివమ్ దూబే 30 పరుగులు చేశారు.

డెత్ ఓవర్లలో అద్భుతంగా ప్రత్యర్థి జట్టును కట్టడి చేస్తారని పేరున ముంబై బౌలర్లు మరోసారి దాన్ని నిరూపించుకున్నారు. బౌల్ట్, బుమ్రా లు 16, 17,18,19 ఓవర్లు చక్కగా వేయడంతోపాటు రాజస్థాన్ బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో విజయవంతమయ్యారు. దీంతో స్కోరు నెమ్మదించింది. చివరి ఓవర్ను కౌంటర్ నెయిల్ కూడా చక్కగా వేయడంతో రాజస్థాన్లో బొంబాయి బౌలర్లు 171 వద్ద కట్టడి చేశారు.

172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఓపెనర్లు ఆ జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. ఇప్పటివరకు ఐపీఎల్లో ఏమాత్రం ఫాంలో లేని ముంబై ఇండియన్స్ వికెట్-కీపర్ డికాక్ మంచి ఫామ్ అందుకోవడంతో ముంబై ఇండియన్స్ కు మంచి విజయం లభించింది. 70 రన్స్ చేసిన డికాక్ నలువైపుల షార్ట్స్ ఆడుతూ చక్కగా తన పాత ఫామ్ ని అందుకున్నాడు. రోహిత్ శర్మ ప్రపోజ్ కోర్కె విలియం చేరిన తర్వాత వచ్చిన సూర్యకుమార్ సైతం 15 రన్స్ చేసి అవుట్ అయిన, డికాక్ మాత్రం తన పోరాటాన్ని ఆపలేదు. కోరును ఎక్కడ తడబడకుండా ముందుకు కదిలిస్తూ, ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. నాలుగో బ్యాట్స్మెన్గా బరిలోకి వచ్చిన కృనాల్ పాండ్యా చక్కగా డికాక్ కు సహకారం అందించడంతో లక్ష్యం వైపు ముంబై ఇండియన్స్ వడివడిగా దూసుకెళ్లింది. ఆఖరులో పొలార్డ్ ఓపెనర్ డికక్ కు తోడై తొమ్మిది బాల్స్ మిగిలి ఉండగానే విజయ లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ విజయంతో ముంబై 6 మ్యాచుల్లో మూడు మ్యాచ్లు నెగ్గి తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరోపక్క రాజస్థాన్ రాయల్స్ కచ్చితంగా గెలవాల్సిన తరుణంలో ముంబై ఇండియన్స్ కు మ్యాచ్ ను ఇచ్చి తన ప్లే ఆఫ్ ఆశలను మరింత క్లిష్టంగా మార్చుకుంది.

గురువారం రెండు మ్యాచ్లు జరిగాయి. రాత్రి 7.30 గంటలకు జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ ను, ఢిల్లీ క్యాపిటల్స్ ఢీకొంది. ఈ మ్యాచ్ కూడా మంచి రసవత్తరంగా సాగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ 154 పరుగులను చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి