iDreamPost

ఆడు పాడు.. విజిల్ పోడు!

ఆడు పాడు.. విజిల్ పోడు!

అదే ఓటమి.. అదే తీరు. సన్రైజర్స్ హైదరాబాద్ ఆటలో ఏ మార్పు కనిపించడం లేదు. బ్యాటింగ్లో బాగుంది అనుకున్న సమయంలో బౌలింగ్లో, బౌలింగ్లో అంతా బాగా కంట్రోల్ చేశారు అనుకున్న సమయంలో బ్యాటింగ్లో తడబాటు తప్పడం లేదు. ఫలితంగా ఐపీఎల్ సీజన్లో వరుస ఓటములతో సతమతమవుతోంది. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్ తో ఓటమి తర్వాత దాదాపుగా ప్లే యాప్ నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ పక్కకు తప్పుకున్న ట్లే. ఏక స్వదేశానికి పైన వున్న కెప్టెన్ వార్నర్ వెళ్ళిపోతే, ఇక టీ మరింత బలహీనం అవుతుంది అని చెప్పక తప్పదు. దీంతో వచ్చే మ్యాచ్లో సైతం హైదరాబాద్ ఇంత కంటే ఘోరమైన ఆటతీరు ప్రదర్శిస్తుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

మొదట టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. కచ్చితంగా కీలకమైన మ్యాచ్లో గెలిచి తీరాలన్న కసితో బ్యాటింగ్ మొదలుపెట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ ధాటిగా ఆడింది. ఓపెనర్ జానీ బెయిర్స్టో వెనువెంటనే అయిపోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే తో కెప్టెన్ డేవిడ్ వార్నర్ జాగ్రత్తగా ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వికెట్లు పడకుండా, స్కోరు వేగం పెరిగేలా జాగ్రత్తలు వహించాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో ఏమాత్రం ప్రభావం చూపని మనీష్ పాండే జాగ్రత్తగా ఆడుతూ బౌండరీ దాటిస్తూ ఫామ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అర్థ సెంచరీ సాధించిన మనీష్ పాండే ఛానళ్ల తర్వాత మంచి ఆటతీరుతో హైదరాబాద్ అభిమానులను ఆకట్టుకున్నాడు. డేవిడ్ వార్నర్ అవుటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన కెన్ విలియమ్సన్ హైదరాబాద్ అభిమానులకు బౌండరీల మోత ఏమిటో మరోసారి చూపించాడు. 18 ఓవర్లలో 138 స్వల్ప స్కోరు సాధించిన హైదరాబాద్ స్కోర్ ను పరిగెత్తించి డంలో కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ బాగా తోడ్పడింది. 19వ వేసిన ఠాగూర్ బౌలింగ్లో విలియంసన్ 20 రన్స్ సాధించడంతో చివరికి హైదరాబాద్ సన్రైజర్స్ 171 పరుగు లో మంచి స్కోరు సాధించగలిగింది. 10 బాల్స్ లోనే 26ఎస్10 బాల్స్ లోనే 26 రన్స్ సాధించిన కేన్ విలియమ్సన్ హైదరాబాద్ కు మంచి స్కోరు అందించాడు.

హైదరాబాద్ సన్రైజర్స్ బౌలింగ్లో చాలా అద్భుతంగా ఉంటుందని అంతా భావిస్తే దానికి వ్యతిరేకంగా ఈ మ్యాచ్లో జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు రూతు రాజ్ గైక్వాడ్, డు ప్లేసులు వికెట్ పడకుండా నే అద్భుతంగా ఆడారు. ఒకవైపు స్కోరును ఓవర్కు 10 రన్స్ తగ్గకుండా నే పరుగులు పెట్టిస్తోంది మరోవైపు బౌండరీల మోత మోగిస్తూ గైక్వాడ్ చెలరేగి ఆడాడు. హైదరాబాద్ బౌలర్లు ఎంత కష్ట పడిన వారికి వికెట్ దక్కలేదు. 44 బాల్స్ ఆడిన గైక్వాడ్ 75 రన్స్ చేశాడు. 38 బాల్స్ లో 53 సాధించిన డూప్లిసెస్ కూడా చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించాడు. 129 రన్స్ వరకు ఒక వికెట్ కూడా పడలేదు. ధాటిగా ఆడిన వృద్ధి రాజ్ గైక్వాడ్ అయిపోయిన వెంటనే బరిలోకి వచ్చిన మొయిన్ అలీ కూడా బాట్ గెలిపించడం తో స్కోర్ వేగం పుంజుకుంది. బాల్ టూ బాల్ కొట్టేలా స్కోర్ వచ్చింది. తర్వాత రషీద్ ఖాన్ బౌలింగ్ లో డూ ప్లేస్స్, మోయిన్ అలీ వరుసగా అయిపోవడంతో తర్వాత వచ్చిన సురేష్ రైనా రవీంద్ర జడేజాలు లక్ష్యం పూర్తి చేశారు. ఇంకా 9 బాల్స్ మిగిలి ఉండగానే లక్ష్యం పూర్తి చేసిన చెన్నై తన విజయాల జైత్రయాత్రను కొనసాగిస్తోంది.

గురువారం ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు ఉన్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ ను ఢీ కొంటుంది. అలాగే సాయంత్రం జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ తో పంజాబ్ కింగ్ తలపడనుంది. నాలుగు జట్లు పూర్తిగా వెనుకబడిన తరుణంలో అన్ని జట్లకు ఈ రెండు మ్యాచ్లు కీలకమే. దీంతో గురువారం మరింత క్రికెట్ మజా వస్తుందని భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి