iDreamPost

స్వల్ప స్కోర్ కేకేఆర్ విజేత!

స్వల్ప స్కోర్ కేకేఆర్ విజేత!

నాలుగు మ్యాచ్ల్లో వరుసగా ఓటముల తర్వాత కోల్కతా నైట్రైడర్స్ ఎట్టకేలకు ఒక విజయాన్ని సొంతం చేసుకుంది. బౌలింగ్లో పంజాబ్ ను కట్టడి చేయడంతో కేవలం 123 పరుగులు మాత్రమే పంజాబ్ చేయగలిగింది. పంజాబ్ బ్యాట్స్మెన్లు ఎవరు భారీ స్కోరు నమోదు చేయలేదు. వచ్చినవారు వచ్చినట్లుగానే అవుట్ కావడంతో పంజాబ్ స్కోర్ లో వేగం మందగించింది. కేకే ఆర్ బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో పంజాబ్ ఎక్కడ కోలుకోలేక పోయింది. ఆశలు పెట్టుకున్న పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్, హిట్టర్ క్రిస్ గేల్ వెనువెంటనే అవుట్ కావడంతో పంజాబ్ భారీ స్కోరు చేయలేకపోయింది. చివర్లో బౌలర్ క్రిస్ జోర్డెన్ దాటిగా ఆడి 25 రన్స్ చేయడంతో ఆ మాత్రం స్కోర్ అయినా పంజాబ్ సాధించాగలిగింది.

చాలా సులభమైన లక్ష్యాన్ని ఛేదించడానికి కోల్కత నైట్రైడర్స్ బ్యాట్స్మెన్లు అష్టకష్టాలు పడ్డారు. బ్యాటింగ్ లో బలం గా కనిపిస్తున్న కోల్కత నైట్ రైడర్స్ బ్యాట్స్ మాన్ కూతుర్నే కొట్టడానికి ఆపసోపాలు పడినట్లు కనిపించింది. మరోసారి కోల్కతా ఓపెనర్లు నితీష్ రానా శుభమాన్ గిల్ విఫలం అయ్యారు. వికెట్ డౌన్ లో రంగంలోకి దిగిన త్రిపాఠి కోల్కతాను ఆదుకున్నాడు. ఒకవైపు ధాటిగా ఆడుతూనే వికెట్ పడకుండా జాగ్రత్త లు తీసుకున్నారు. సునీల్ నరైన్ భారీ షాట్ కోసం ప్రయత్నించి అవుట్ కావడంతో 30 లోపు మూడు వికెట్లను కోల్కత్తా చేజార్చుకుంది. అయితే తర్వాత క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ జాగ్రత్తగా వికెట్ పడకుండా ఆడాడు. సింగిల్ తీస్తూ లక్ష్యం వైపు కదిలారు. మరో ఎండ్ లో ఉన్న త్రిపాఠి కూడా ఎక్కడ భారీ షాట్కు పోకుండా చాలా సున్నితంగా ఆడుతూ మెల్లగా ఒక్కో పరుగు తీసుకుంటూ చేదన వైపు వెళ్ళారు. 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద త్రిపాఠి అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన ఆండ్రూ రస్సెల్ కూడా వికెట్ కాపాడుకోవడానికే ఆడాడు. చివర్లో రసల్ అవుట్ కావడం తో అప్పటికే తక్కువ స్కోరు చేయాల్సి ఉన్న సమయంలో దినేష్ కార్తీక్ ఇయాన్ మోర్గాన్ లో ఆ పని పూర్తి చేశారు. మరో రెండు ఓవర్లు ఉండగానే లక్ష్యం చేరుకున్నారు. దీంతో గత రెండు మ్యాచ్ల్లోనూ విజయాలను దగ్గరకు వచ్చిన స్వీయ తప్పిదాలతో ఓటమిపాలైన కోల్కత నైట్ రైడర్స్ కు పంజాబ్ మ్యాచ్ విజయం మంచి ఆనందాన్ని ఇచ్చింది.

మంగళవారం నాటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఢీకొనాబోతుంది. వరుస విజయాలతో ఉన్న రెండు జట్లు ఈ మ్యాచ్లో పైచేయి సాధించేందుకు తాపత్రయపడతాయి. దీంతో పాటు పాయింట్స్ టేబుల్ లో పైన ఉండేందుకు ఇరు జట్లు కచ్చితంగా పోటీ పడతాయి. దీంతో మంగళవారం నాటి మ్యాచ్ కూడా రసవత్తరంగా సాగుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి