iDreamPost

జడేజా వన్ మ్యాన్ షో బెంగళూరుకు చెక్!

జడేజా వన్ మ్యాన్ షో బెంగళూరుకు చెక్!

అసలైన ఆల్ రౌండర్ అనే పదానికి అర్థం చెప్పేలా రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన చేయడంతో వరుస విజయాలతో దూసుకెళ్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయ ప్రస్థానానికి కళ్లెం పడింది. బ్యాటింగ్ లోనూ అటు బౌలింగ్ లో దుమ్మురేపిన రవీంద్ర జడేజా తన ఒంటి చేత్తో బెంగళూరు టీమ్ కు సవాల్ విసిరాడు. ఒక రకంగా చెప్పాలంటే రవీంద్ర జడేజా వెర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అన్నట్లుగా పోటీ సాగింది. ఎంతో అద్భుతంగా పోటాపోటీగా జరుగుతుందని భావించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆదివారం జరిగిన ఐపీఎల్ కోడూరు లో చెన్నై సూపర్ కింగ్స్ దే పైచేయి అయింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న ధోనీ సేన 191 రన్స్ భారీ స్కోరు చేసింది. దానిని చేధించలేక బెంగళూరు చతికిల పడింది.

టాస్ గెలిచిన చెన్నై ఓపెనర్లు రుతు రాజ్ గైక్వాడ్, డూ ప్లేస్సెస్ లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. రన్ రేట్ తగ్గకుండా వికెట్లు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆడారు. బెంగళూరు బౌలర్లకు వీరి భాగస్వామ్యం విడదీయడం చాలా కష్టంగా మారింది. ఏడవ వార్డులో రూతురాజ్ గైక్వాడ్ అవుట్ అయినప్పటికీ, డు ప్లేస్సిస్ మాత్రం మరో ఎండ్లో తన బ్యాటింగ్ అద్భుతంగా కొనసాగించాడు. లెంత్ బాల్లో మెల్లగా సింగల్ తీసుకుంటూ, ఏమైనా బాల్ గతి తప్పితే దాన్ని బౌండరీకి తరలించి ఆడాడు. అయితే అతడికి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నుంచి సహకారం అంతంతమాత్రంగానే అందింది. సురేష్ రైనా, అంబటి రాయుడు తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో చెన్నై కాస్త కష్టాల్లో పడినట్టు అనిపించింది. బెంగుళూరు బౌలర్లు సైతం వికెట్లు కోసం చూడకుండా బాల్స్ డాట్ చేసేందుకు ప్రయత్నించారు. 19 ఓవర్ల కు 152 రన్స్ ఉన్న చెన్నై స్కోరు ఐతే గీతే 160 165 మధ్యలో ముగిసిపోతుంది అని భావించారు. అందులోనూ చెన్నై వికెట్స్ తీసిన హర్షల్ చివరి ఓవర్ వేయడంతో ఇంకా తక్కువగానే స్కోర్ వెళ్తుందని అనుకున్నారు.

చివరి ఓవర్లో రవీంద్ర జడేజా విధ్వంసం సృష్టించాడు. ఏకంగా ఐదు సిక్సర్లు, ఒక ఫోర్ సాధించాడు. హర్షల్ వేసిన ప్రతి బంతిని బౌండరీ తరలించాలని ప్రధాన లక్ష్యంతో ఆడాడు. వరుసగా నాలుగు సిక్సర్లు వేయడంతో నో బాల్ పడింది. దీనిని సైతం ఫోర్ గా తరలించాడు. మొత్తంగా చివరి ఓవర్లో 3 7 రన్స్ సాధించిన జడేజా బెంగళూరుకు భారీ లక్ష్యాన్ని ముందు ఉంచాడు. 30 బాల్స్ లోనే 63 రన్స్ చేసిన రవీంద్ర జడేజా అద్భుతమైన బ్యాటింగ్తో చెన్నై మంచి స్కోర్ చేయగలిగింది.

192 రన్స్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనింగ్ దాటి గానే ప్రారంభించింది. మంచి ఫామ్లో ఉన్న ఓపెనర్ పడిక్కాల్ ఫోర్ల మోత మోగించడంతో బెంగళూరు మంచి ప్రారంభాన్ని అందుకుంది. 3 ఓవర్ల లో 40 స్కోర్ దాటింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏమీ ప్రభావం చూపకుండానే ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం బౌలింగ్లో రంగంలోకి దిగిన రవీంద్ర జడేజా మరోసారి బెంగళూరు మీద ప్రతాపం చూపించాడు. బాల్ తో మేజిక్ చేసాడు. బెంగళూరు ప్రధాన బలమైన ఏబీ డివిలియర్స్, మాక్స్వెల్ వంటి బ్యాట్స్మెన్లను వెనువెంటనే అవుట్ చేయడంతో బెంగళూరు మళ్లీ కోలుకోలేక పోయింది. వరుసగా వికెట్లు పడడం తో ఎం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడింది. 80 రన్స్ కే 6 వికెట్స్ పడిపోయిన తరుణంలో బెంగళూరు అపజయం ఖాయం అయింది. ఒక్కో వికెట్ తీసి బెంగళూరు ను చెన్నై బౌలర్లు కోలుకోలేని దెబ్బ తీయడంతో బెంగళూరు 122 రన్స్ కే ఆల్ అవుట్ అయింది. విజయాల పరంపరలో బెంగళూరుకు ఈ అపజయం కాస్త ఇబ్బంది కలిగించేది అయినా, దీని నుంచి పాట నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అప్పుడే బెంగుళూరు ముందుకు వెళ్ళగలదు.

రాత్రి 8 గంటలకు మొదలు కాబోయే ఐపీఎల్ మ్యాచ్ లో బలమైన ఢిల్లీ టీం లో సన్రైజర్స్ హైదరాబాద్ ఎదుర్కోబోతోంది. ముంబై లాంటి పటిష్టమైన టీంను మట్టికరిపించిన ఢిల్లీ హైదరాబాదులో కూడా ఓడించి తనకు తిరుగు లేదు అనేలా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. మరోపక్క ఐపీఎల్ లో వెనుకబడిన హైదరాబాద్ కచ్చితంగా విజయం సాధించి ధీటుగా సమాధానం చెప్పాలని అనుకుంటోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి