iDreamPost

కోల్కతా ను కట్టడి చేసి విజయాన్ని నమోదు చేసి!

కోల్కతా ను కట్టడి చేసి విజయాన్ని నమోదు చేసి!

ఐపీఎల్ మ్యాచ్లు గత మూడు రోజులుగా చప్పగా సాగుతున్నాయి. భారీ స్కోర్లు చేయక, కీలకమైన టీమ్ లు సైతం తక్కువ స్కోరుకే పరిమితం కావడంతో ఐపీఎల్లో మజా ఈసారి తగ్గిందనే చెప్పాలి. శనివారం కోల్కతా నైట్రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన కీలకమైన మ్యాచ్లలో మరోసారి అతి తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. ఎంతో అవసరమైన మ్యాచ్ను కోల్కతా నైట్రైడర్స్ చేజేతులా జారవిడిచింది. దీంతో వరుసగా నాలుగు మ్యాచ్లను కోల్కతా ఓడిపోయినట్లే అయింది.

మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అతడి నిర్ణయానికి తగినట్లుగా నమ్మకాన్ని నిలబెడుతూ రాజస్థాన్ బౌలర్లు చక్కని లైన్లతో బౌలింగ్ వేశారు. పిచ్ కూడా పూర్తిగా బౌలింగ్ కు అనుకూలించడంతో రాజస్థాన్ కు చెందిన ఇద్దరు లెఫ్ట్ అర్మ్ సీమర్లు చక్కగా బంతులు వేయడంతో పరుగులు తీయడం కోల్కతా బ్యాట్స్మెన్కు చాలా కష్టం అయింది. ఐదు ఓవర్ల వరకు కేవలం రెండంటే రెండే ఫోన్లు పడ్డాయి అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ కోల్కతా బ్యాట్స్మెన్ బలంగా ఆడేందుకు అవకాశం లేకుండా పోయింది. ఓపెనర్ గా వచ్చిన సుబామన్ గిల్ ఐపీఎల్ లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. శనివారం సైతం వెంటనే అవుట్ అయిపోయి పేవిలియన్ కు చేరాడు. తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాది గట్టిగా ఆడే ప్రయత్నం చేసినా బాల్స్ ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో రన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. మరోపక్క బ్యాట్స్మెన్లు ఒకరి తర్వాత ఒకరు అవుట్ అవ్వడం తో స్కోర్ మరింత నెమ్మదించింది. 15 ఓవర్ల వరకు కూడా స్కోరే 6 రన్ రేట్ అందుకోలేకపోయింది. ఐదవ వికెట్ గా వచ్చిన ఆండ్రూ రస్సెల్ సైతం ఒక సిక్స్ మాత్రమే కొత్తగాలిగాడు. రాజస్థాన్ ఎంతో ముచ్చటపడి సుమారు 16 కోట్ల పైగా వెచ్చించి కొనుగోలు చేసిన మోర్కెల్ నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్కు బహుమతి అందించాడు. చివరకు కోల్కతా నైట్రైడర్స్ 133 స్కోర్ మాత్రమే చేయగలిగింది.

134 రన్స్ చేయాల్సిన పరిస్థితుల్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ బాధ్యతాయుతంగా ఆడాడు. ఓపెనర్ గా వచ్చిన బట్లర్ కమ్మిన్స్ బౌలింగ్లో హుక్ షాట్ ఆడబోగా అతడికి బలమైన గాయం తగిలింది. ఓపెనర్ గా విఫలం అవుతున్న వోహరా ను పక్కన పెట్టిన రాజస్థాన్ అతడి స్థానంలో యశస్వి జైస్వాల్ ను ఎంచుకుంది. అతడు ప్రతి బాల్లో ఆడటానికి ప్రయత్నించడంతో పాటు ఉన్నంతసేపు చక్కని బౌండరీలతో ఆకట్టుకున్నాడు. 24 రన్స్ చేసిన యశస్వి జైస్వాల్ తర్వాత క్రీజులోకి వచ్చిన తేవతీయ అనవసర షాట్కు ప్రయత్నించి అవుటయ్యాడు. చివర్లో మిల్లర్ తో జత కలిసిన కెప్టెన్ చివర్లో మిల్లర్ తో జతకలిసిన కెప్టెన్ సంజూ శాంసన్ మెల్లగా ఆడుతూ ఒక్క పరుగు కూడ పెడుతూ లక్ష్యం వైపు వెళ్ళాడు. తక్కువ స్కోరు కావడంతో పాటు, లక్ష్యం కూడా చాలా చిన్నగా ఉండడంతో రాజస్థాన్ బ్యాట్స్మెన్ ఆచితూచి ఆడిన పెద్ద ఇబ్బంది అనిపించలేదు. మరో ఓవర్ వుండగానే లక్ష్యం సాధించారు.

ఆదివారం రెండు మ్యాచ్లు కీలకమైన మ్యాచ్లలో ఉన్నాయి. వరుస విజయాలతో ఉన్న బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొన పోతుంది. మంచి ఫామ్ లో కనిపిస్తున్న బెంగళూరులో ఈసారి కచ్చితంగా ఓడించాలనే గట్టి తలంపుతో ధోనీసేన ఉంది. అయితే ఈ ఐపీఎల్లో విజయాల జైత్రయాత్ర కొనసాగించాలని బెంగళూరు భావిస్తోంది. రాత్రి జరగబోయే మరో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ను సన్రైజర్స్ హైదరాబాద్ ఢీకొన్న బోతోంది. వరుస అపజయాలు తర్వాత చివరి మ్యాచ్ విజయంతో ముగింపు పొందిన హైదరాబాద్ మళ్లీ ఫామ్ లోకి రావాలంటే ఈ మ్యాచ్లో పటిష్టమైన ఢిల్లీ గెలిస్తే మళ్ళీ సత్తా చాట వచ్చని భావిస్తోంది. దీంతో ఆదివారం రెండు మ్యాచ్లు కీలకంగా జరగనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి