iDreamPost

బెంగళూరు ఓపెనర్లు బాదేశారు!

బెంగళూరు ఓపెనర్లు బాదేశారు!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీ ఈ సీజన్ మొత్తం భలే కలిసిచ్చినట్లే ఉంది. నిన్న మొన్నటి వరకు ఫామ్ లో లేని బ్యాట్స్ మాన్ సైతం ఇప్పుడు ఫామ్ లోకి వచ్చి దుమ్ము రేపుతున్నారు. మొన్నటి వరకు బౌలింగ్ బాగా బలహీనంగా కనిపించిన బెంగళూరు ఇప్పుడు ఆ విభాగంలోనూ అద్భుతమైన ప్రతిభ చూపుతోంది. గురువారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు బౌలింగ్లో, బ్యాటింగ్లో రాణించి వరుసగా నాలుగో విజయం అందుకుంది. టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లీ దాన్ని కూడా మర్చిపోయాడు. తర్వాత కామెంటేటర్స్ గుర్తు చేయడంతో మొదట బౌలింగ్ ఎంచుకుని, రాజస్థాన్ ను బాటింగ్ కు ఆహ్వానించాడు.

బాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆర్డర్ ను సిరాజ్ దెబ్బతిసాడు. విధ్వంసక బ్యాట్స్మెన్గా గుర్తింపు పొందిన బట్లర్ ను బౌల్డ్ చేయడంతో పాటు, రాజస్థాన్ కెప్టెన్ సంజు సంసన్ వికెట్ తీసి రాజస్థాన్ ను కోలుకోలేని విధంగా చేసాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లు నలుగురు వెనువెంటనే అవుట్ అయినా, మిడిల్ ఆర్డర్ లో వచ్చిన శివమ్ దూబే, పరాగ్ లు ఇన్నింగ్స్ చక్కదిద్దరు. వికెట్ కాపాడుకుంటూనే, మంచి షాట్ లు ఆడటంతో రాజస్థాన్ స్కోర్ పరుగులు తీసింది. 50 లోపే కీలక వికెట్స్ తీసినp ఆనందం బెంగళూరు కు లేకుండా పోయింది. ఇద్దరూ భారీ షాట్లు ఆడి రాజస్థాన్ కు మంచి స్కోరు అందించే ప్రయత్నం చేస్తున్నట్లు అనిపించింది. 12 ఓవర్లు లోనే స్కోర్ వంద దాటింది. అయితే ఒక అనుకోని షాట్కు ప్రయత్నించిన పరాగ్ అవుట్p కావడంతో ఆ తర్వాత పెద్ద పరుగులు చేయకుండానే శివమ్ దూబే కూడా అవుట్p అయ్యాడు. 46 రన్స్ చేసిన శివమ్ దూబే ఆట అందరినీ ఆకట్టుకుంది. అయితే వికెట్స్ పడటం తో కేవలం 177 రన్స్ చేసిన రాజస్థాన్ మంచి స్కోర్ బెంగళూరు ముందు ఉంచింది.

178 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఆ లక్ష్యం ఏమాత్రం సరిపోలేదు. బ్యాటింగ్లో ఎంతో పటిష్టంగా కనిపించిన బెంగళూరు టీం ఓపెనర్లు దేవదూత పాడిక్కల్, కెప్టెన్ విరాట్ కోహ్లీలు లక్ష్యం సాధించే దిశగా చాలా ధాటిగా ఆడాడు. వికెట్ వాడకుండానే లక్ష్యం సాధించేందుకు ప్రయత్నంచారు. నిన్న మొన్నటి వరకు ఫాంలో లేని ఓపెనర్ దేవదూత పడకల్ కూడా మళ్ళీ తన పాత ఫామ్ లోకి రావడం సగటు బెంగళూరు అభిమానిని ఆనందంలో నెట్టేసింది. రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. బెంగళూరు ఓపెనర్లు ఇద్దరు స్వేచ్ఛగా చాలా ధాటిగా ఆడుతున్న, వారిని నిలువరించే లైన లంచ్ బంతులు రాజస్థాన్ బౌలర్లు ఎవరు వేయలేకపోయారు. ఫలితంగా వికెట్ రావడమే చాలా కష్టమైంది. వికెట్ పడకుండానే పడిక్కాల్ 52 బాల్స్ లో 101 కొడితే కోహ్లీ అతడికి మంచి సహకారం అందించాడు. పడిక్కాల్ ఏకంగా 6 సిక్స్ లు వేసాడు. బెంగళూరు ఓపెనర్లు ఇద్దరూ ఆడుతూ పడుతూ కేవలం 17 ఓవర్ల లో లక్ష్యం చెందించారు.

శుక్రవారం పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయిన పంజాబ్ కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. అలాగే తన జైత్రయాత్రలో ఢిల్లీ చేతిలో అనూహ్య ఓటమి పాలైన ముంబై సైతం శుక్రవారం మ్యాచ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దీంతో ఈ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి