iDreamPost

బెంగళూరు భళా!

బెంగళూరు భళా!

బెంగళూరు కు ఈ ఐపీఎల్ అచ్చు వచ్చినట్లు కనిపిస్తోంది. అన్నీ మంచి శకునములే అన్నట్లు ఆ జట్టులోని అందరు బ్యాట్స్ మాన్ లు, బౌలర్లు సమిష్టిగా రాణిస్తున్నారు. ఫలితంగా వరుసగా మూడు మ్యాచ్ల్లోనూ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయకేతనం ఎగురవేసింది. ఆదివారం ఐపీఎల్ లో రెండు మ్యాచ్లు ఉన్నాయి. సాయంత్రం నాలుగు గంటలకు మొదలైన మ్యాచ్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కోల్కతా నైట్రైడర్స్ తలపడ్డాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్కతా నైట్ రైడర్స్ బెంగళూరు బాట్స్మన్ కు తలవంచింది. ఏకంగా 202 రన్స్ భారీ స్కోర్ చేసిన బెంగళూరు, బౌలింగ్లోనూ సత్తా చాటింది.

బెంగళూరు సమిష్టిగా రాణిస్తే ఎంతటి విధ్వంసం సృష్టించి కలుగుతుందో ఆదివారం మ్యాచ్ లో కనిపించింది. బెంగళూరు ప్రధాన బలం బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించడంతో పాటు… వారి బ్యాటింగ్లో ప్రధానమైన మాక్స్వెల్, ఎబి డివిలియర్స్ లు విధ్వంసం సృష్టించారు. గతంలో పంజాబ్ టీం లో ఉన్నప్పుడు, మొత్తం ఐపీఎల్ సిరీస్ లోనే 100 రన్స్ కూడా కొట్టని మ్యాక్స్వెల్ బెంగళూరు ఫ్రాంచైజీ మారగానే అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకోవడం విశేషం. 49 బాల్స్ లో 78 రన్స్ కొట్టి అహో అనిపించాడు. ఇక మాస్టర్ పీస్ ఎబి డివిలియర్స్ సైతం 34 బంతుల్లో 76 రన్స్ చేసి… చివరి ఓవర్లలో విధ్వంసం సృష్టించి బెంగళూరు స్కోరు 200 దాటించాడు.

బౌలింగ్లోనూ బెంగళూరు ఎక్కడ ప్రత్యర్థి అవకాశం ఇవ్వకుండా పటిష్టంగా బౌలింగ్ చేసింది. భారీ స్కోరును కలకత్తా చేదన చేసేందుకు కనీసం అవకాశం ఇవ్వకుండానే బెంగళూరు బౌలర్లు విరుచుకుపడ్డారు. మొదటి నుంచి కలకత్తా బ్యాట్స్మెన్లను బౌండరీలు సాధించకుండా ఫైనల్ ఎంత బౌలింగ్తో చక్కగా ఆకట్టుకున్నారు. కలకత్తా బ్యాట్స్మెన్లు ఎవరూ కనీసం 40 పరుగులు కూడా చేయకుండానే బెంగళూరు బౌలర్లు వెంటవెంటనే వికెట్లు తీశారు. చివర్లో ఆండ్రూ రస్సెల్ ధాటిగా ఆడతాడు అని భావించిన… అతడికి బాల్స్ ఏమాత్రం దొరక్కుండా వేయడంలో బెంగళూరు బౌలర్లు విజయం సాధించారు. 20 ఓవర్లలో 166 పరుగులు సాధించిన కోల్కతా నైట్ రైడర్స్ , విజయానికి చాలా దూరంలోనే ఆగిపోయింది. బెంగళూరు బౌలర్లు జెమి సన్, సుందర్.సి రాజులు అద్భుతమైన ప్రదర్శన చేసి బెంగళూరు విషయంలో తమ వంతు పాత్రను పోషించారు. వరుసగా మూడు విజయాలతో మంచి ఫామ్ లో కనిపిస్తున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఈసారి కచ్చితంగా ఐపీఎల్ ట్రోఫీ కొట్టాలనే కసితో ముందుకు దూసుకెళ్తున్న ట్లు కనిపిస్తోంది. ప్రతిసారి ఐపీఎల్ టోపీ విషయంలో చివరి వరకూ వచ్చి, అత్యంత బలమైన జట్టుగా ఉన్న బెంగళూరు ఈ సారి ఇటు బ్యాటింగ్లో లోనూ అటు బౌలింగ్ లోనూ సమిష్టిగా రాణించడం శుభపరిణామం అని చెప్పవచ్చు.

ఆదివారం ఎన్ని గంటలకు మొదలై మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఇరు జట్లకు ఎంతో కీలకమైన ఈ మ్యాచ్ లో ఉత్కంఠగా సాగుతుందని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి