iDreamPost

కొత్త సీజన్…కొత్త పేరు…కొత్త లోగోతో… ఐపీఎల్-2020 బరిలో ఆర్సీబీ

కొత్త సీజన్…కొత్త పేరు…కొత్త లోగోతో… ఐపీఎల్-2020 బరిలో ఆర్సీబీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదమూడవ సీజన్ ప్రారంభం కావడానికి కొన్ని వారాల ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రాంచైజీ పేరును “రాయల్ చాలెంజర్స్‌”గా మార్చి సరికొత్త లోగోను ఆవిష్కరించింది. సింహానికి తలపై కిరీటం పెట్టి ఉండే పాత లోగోను పూర్తిగా మార్చివేసింది. ఐపీఎల్ 13వ సీజన్‌ను పురస్కరించుకుని లోగో వీడియోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఆర్సీబీ “కొత్త దశాబ్దం, కొత్త ఆర్సీబీ,ఇది మా కొత్త లోగో’’ అని ట్వీట్ చేసింది.ఈ సందర్భంగా ఆర్సీబీ ఛైర్మన్‌ సంజీవ్‌ చురివాలా మాట్లాడుతూ ఆర్సీబీకి అండగా నిలుస్తున్న అభిమానులను ఉత్సాహపంచేందుకు లోగోలోని అంశాలను మార్చాం’’ అని పేర్కొన్నారు. 

ఆర్సీబీ మంగళవారం ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ లిమిటెడ్‌ (ముత్తూట్ బ్లూ) భాగస్వామ్యంతో మూడేళ్ల పాటు టైటిల్‌ స్పాన్సర్‌ ఒప్పందం కుదుర్చుకుంది. మరుసటి రోజే రీ-బ్రాండింగ్ చేయాలని భావించిన ఆర్సీబీ ఇన్‌స్టాగ్రమ్,ట్విట్టర్ తదితర సోషల్ మీడియా అధికారిక ఖాతాల్లోని ఫోటోలన్నిటినీ తొలగించింది.దీంతో ఆర్సీబీ ప్రొఫైల్‌ ఫోటోలతో పాటు పలు పోస్టులు కూడా డిలీటయ్యాయి.ఈ రీ-బ్రాండింగ్ గురించి ఫ్రాంచైజ్ నుంచి ముందస్తు సమాచారం లేని ఆటగాళ్లతో సహా కెప్టెన్ కోహ్లి విస్మయాన్ని వ్యక్తం చేశారు.

కొత్త లోగోతో ఆర్సీబీ అదృష్టం మారేనా?

ఇప్పటివరకు ముగిసిన 12 ఐపీఎల్ సీజన్లలో భారీ అంచనాలతో బరిలోకి దిగి టైటిల్ గెలవకపోవడం పరిపాటిగా మారింది. తొమ్మిదో సీజన్ ఐపీఎల్-2016 నందు ఆర్సీబీ ఉప్పల్ గ్రౌండ్లో జరిగిన ఫైనల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఆర్సీబీ జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం విశేషం. ఐపీఎల్-2016 తర్వాత ఆర్సీబీ జట్టు గత మూడు సీజన్లలో (2017, 2018,2019) వరసగా ప్లే ఆఫ్ స్థానం సంపాదించడంలో విఫలమైంది.దీంతో 2020లో టైటిల్ సాధించాలని కృతనిశ్చయంతో ఉన్న ఆర్సీబీ గత ఏడాది డిసెంబర్‌లో నిర్వహించిన వేలంలో ఆరోన్‌ ఫించ్‌, క్రిస్‌ మోరిస్‌,జోష్‌ ఫిలిప్‌, డేల్‌స్టెయిన్‌ వంటి ప్రతిభావంతులైన విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి