iDreamPost

ప్రతిఘటన సినిమా ఎలా జరిగింది…. ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ

ప్రతిఘటన సినిమా ఎలా జరిగింది.. ఇంట్రస్టింగ్ స్టోరీ. 1986లో సంచలన దర్శకుడు టి. క్రిష్ణ నిర్దేశకత్వంలో లేడీ అమితాబ్ విజయశాంత్ నటించిన ప్రతిఘటన సినిమా ఒక చరిత్రనే నెలకొల్పింది.

ప్రతిఘటన సినిమా ఎలా జరిగింది.. ఇంట్రస్టింగ్ స్టోరీ. 1986లో సంచలన దర్శకుడు టి. క్రిష్ణ నిర్దేశకత్వంలో లేడీ అమితాబ్ విజయశాంత్ నటించిన ప్రతిఘటన సినిమా ఒక చరిత్రనే నెలకొల్పింది.

ప్రతిఘటన సినిమా ఎలా జరిగింది…. ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ

1986లో సంచలన దర్శకుడు టి. క్రిష్ణ నిర్దేశకత్వంలో లేడీ అమితాబ్ విజయశాంత్ నటించిన ప్రతిఘటన సినిమా ఒక చరిత్రనే నెలకొల్పింది. అవార్డులు, రివార్డులు, రికార్డులు అన్నిటినీ సొంతం చేసుకున్న అత్యంత జనరంజకమైన చిత్రంగా ప్రతిఘటన సినిమా బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టింది.సుమారు ప్రతీ విభాగానికి నంది అవార్డు వచ్చిన తొలిచిత్రమేమో కూడా ఇది. దీనికి ముందే టి. క్రిష్ణ దర్శకత్వంలో లేడీ అమితాబ్ వందే మాతరం, దేవాలయం రెండు సినిమాలు చేశారు. 1985లో ప్రతిఘటన ప్రారంభమై, 86లో విడుదలయింది. ఎవ్వరూ ఊహించనంత హిట్. సూపర్ హిట్ సినిమాల్లో చేస్తున్నా ఒక కమర్షయల్లీ హిట్ హీరోయిన్ గా మాత్రమే స్థానాన్ని నిలబెట్టుకున్న ఆమెకు ప్రతిఘటన సినిమాతో గొప్ప నటిగా పేరుప్రతిష్టలు సొంతమయ్యాయి. దర్శకరచయితలకు, నిర్మాతలకు ఓ కొత్త పొద్దు పొడిచినట్టయింది. ఉత్తమనటిగా నంది అవార్డును కూడా విజయశాంతి గెలుచుకున్నారు. కాకపోతే ప్రతిఘటన చిత్రం విజయశాంతి చేయడమన్నది అంత సులభంగా జరగలేదు.

Prati ghatana movie story

ఇంతకు ముందు రెండు సినిమాలు చేసిన పరిచయం, అమె ప్రతిభ మీద నమ్మకంతో టి. క్రిష్ణ ప్రతిఘటనలో ఆమెనే కేస్ట్ చేయాలని పట్టుదలతో విజయశాంతికి కథ కూడా చెప్పారు. కథ అదిరిపోయింది. ఆమె కూడా చాలా టెంప్ట్ అయ్యారు. ఇటువంటి క్యారెక్టర్, అటువంటి సినిమాని చేయడం నటిగా తనకో సార్థకతగా భావించారు విజయశాంతి. కానీ, ఎలా చుట్టూ సినిమాలు. ఒక్క డేట్ కూడా ఫ్రీగా లేదు. మొత్తం కూరుకుపోయి ఉన్నారు. ఆరు షిప్టులు చేస్తూన్న బిజీయస్ట్ హీరోయిన్ గా ఆమెకు ఊపిరి సలపడం లేదు. కావాల్సిన డేట్సేమ్ టోటల్ గా వన్ మంత్. 30 రోజులు ఎట్టి పరిస్థితులలో కావాలి. ఒక్క పూట కూడా ఖాళీ లేదంటే ఏకంగా 30రోజులా….ఆమె కనీసం ఊహించను కూడా లేకపోయిన టఫ్ సిట్యువేషన్. అప్పుడు విజయశాంతి డేట్స్ మేనేజ్ మెంటు బాధ్యత వహిస్తున్న. ఈనాటి సుప్రసిద్ధ నిర్మాత ఎఎం రత్నం నిర్మాతలనందరినీ సంప్రదిస్తే, వారంతా ఏకమై యుద్ధం ప్రకటించారు.ఒక్కరోజు కూడా స్పేర్ చేయలేమని విరుచుకుపడ్డారు రత్నం మీద. ఏం చెయ్యాలి? సరే తాను అన్నగా పరిగణించిన టి. క్రిష్ణకి తన జటిలమైన పరిస్థితిని వెల్లడించారు విజయశాంతి. ఆయనేమో ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వే చేయాలి. నువ్వు చేస్తేనే పాత్ర పండుతుంది అని పట్టుక్కూర్చున్నారు. చివరికి ఎంత ప్రయత్నించినా కుదరడం లేదని, విజయశాంతి చేయలేనన్నా అని బాధపడుతూ చెప్పారు. అప్పుడు సుహాసినిని కూడా ఇష్టం లేకుండానే టి. క్రిష్ణ కలిశారు. ఆమె పరిస్థితి సైతం అదే ఇంచుమించు. పైగా సుహాసిని వ్యక్తిగతంగా భయపడిందిట కూడా ప్రతిఘటనలో ఝాన్సీ లాటి పవర్ ఫుల క్యారెక్టర్ చేయడానికి.

కొంత డేట్స్ ప్రాబ్లమ్, మరికొంత ఆ పాత్రంటే భయంతో సుహాసిని కూడా తప్పుకున్నారు. అంతే గోడకొ కొట్టిన బంతిలా టి. క్రిష్ణ మళ్ళీ విజయశాంతి ఇంటికే వచ్చేశారు. సుహాసిని కూడా చేయలేకపోయినందుకు ఆనందపడుతూ, విజయశాంతి దగ్గరే భైఠాయించారు. చివరికి విజయశాంతే స్వయంగా రంగంలోకి దిగి, నిర్మాతలందరినీ రిక్వెస్ట్ చేసి మొత్తం మీద ఆ ముప్ఫై రోజులు విజయశాంతి సాధించారు. ఆమెకు ఓ మంచి క్యారెక్టర్ పట్ల ఉన్న అంకితభావాన్ని అర్ధం చేసుకున్న నిర్మాతలందరూ కోపరేట్ చేశారు. ప్లానింగ్ ప్రకారం టి. క్రిష్ణ కరెక్టుగా 30 రోజుల్లో విజయశాంతి వర్క్ పూర్తి చేసి పంపించేశారు.అక్టోబర్ 11, 1985నాడు ప్రతిఘటన రిలీజ్. మొదటి షో నుంచే ధియేటర్లు బద్దలయ్యాయి. ఉషాకిరణ్ మూవీస్ కి బ్లాక్ బస్టర్ హిట్టే కాదు, మోస్ట్ ప్రిస్టీజియస్ హిట్ వచ్చింది. విజయశాంతి పేరు గొప్పనటిగా మారుమోగిపోయింది. ఆమె జీవితమే దాదాపుగా ప్రతిఘటనలో ఝాన్సీ పాత్రతో మారిపోయింది. నటిగా గొప్ప గౌరవాన్ని అందుకున్నారు. పేరు ప్రతిష్టలతో పాటు, పారితోషకాల స్థాయికూడా మారిపోయింది. సూపర్ స్టార్ విజయశాంతి అన్నపేరు కూడా స్థిరపడిపోయి, కర్తవ్యం లాంటి మరో బ్లాక్ బస్టర్ తో లేడీ అమితాబ్ గా ఎదిగారు. ఒసేయ్ రాములమ్మ లాటి సంచలనాత్మక విజయంతో ఆమె రాములక్కగా తెలంగాణ ప్రజల గుండెల్లో చెరిగిపోని, చెరపలేని స్థానాన్ని సంపాదించుకోవడానికి.. కూడా ప్రతిఘటన చిత్రమే ఆనాడు పాదు వేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి