iDreamPost

ఆసక్తిని రేపుతున్న అమిత్ షా పోస్టర్

ఆసక్తిని రేపుతున్న అమిత్ షా పోస్టర్

ఒకపక్క ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అత్యంత ఉత్కంఠ భరితంగా మొదలైనప్పటికీ సర్వ్ సంస్థలు చెప్పిన విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తూ ముచ్చటగా మూడోసారి సియం పీఠాన్ని కైవాసం చేసుకోవడం ఖాయమైంది. అయితే ఎన్నికల తుది ఫలితాలు రావడానికి కొద్ది గంటల ముందు ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ పార్టీ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా ఫోటోతో ఒక పోస్టర్ ప్రత్యక్షమయింది.

బిజెపి కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పోస్టర్‌ను చూసినవారికి ఎన్నికల ఫలితాలకు ముందే బీజేపీ ఢిల్లీలో తన ఓటమిని ముందే ఒప్పుకుందా ?? అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ పోస్టర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫొటో కూడా కనిపిస్తోంది. పోస్టర్ పై ఉన్న వ్యాఖ్యలు చూస్తే “విజయంతో మనం అహంకారులుగా మారకూడదు. పరాజయంతో మనం నిరాశకు గురి కాకూడదు” అని రాసివుంది.

ఇదిలా ఉండగా పోలింగ్ ముగిసిన రోజు నుండి ప్రముఖ సర్వే సంస్థలన్నీ ఢిల్లీలో AAP విజయం సాధిస్తుందని స్పష్టం చేసినప్పటికీ అందుకు భిన్నంగా బీజేపీ నేతలు మాత్రం తమ విజయం ఖాయమనే వ్యాఖ్యానాలు చేశారు. ఢిల్లీలో బీజేపీ ప్రచారానికి సారధ్యం వహించిన నేత మనోజ్ తివారీ తాము ఢిల్లీలో 55 సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంతకుముందు తివారీ తాము 48 సీట్లు గెలుస్తామని ట్వీట్ చేశారు. కాగా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని బీజేపీ నేతలు విజయ్ గోయల్ తదితరులు హనుమాన్ మందిరంలో పూజలు నిర్వహించారు. అయితే అనూహ్యంగా ఒక్కొక్క రౌండ్ ఫలితాలు వెల్లడయ్యేకొంది కేజ్రీవాల్ ఆధిక్యంలోకి దూసుకుపోతున్న సమయంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు ఇలాంటి పోస్టర్లు కనిపించడంతో కమల దళంలో చర్చనీయాంశమయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి