iDreamPost

అమరావతి లో అంతులేని కథ

అమరావతి లో అంతులేని కథ

రాజధాని అమరావతి లో చంద్రబాబు అండ్ కంపెనీ చేసిన భూ మాయ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా మరోసారి బట్టబయలైంది. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తన వాళ్లకు చెప్పి ఆ ప్రాంతం చుట్టు పక్కల వేల ఎకరాలు కారు చౌకగా కొనుగోలు చేసినట్లు రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వెల్లడిచారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ పేరుతో టిడిపి నేతలు సాగించిన అంతులేని అవినీతిని ఎండగట్టారు. శివరామకృష్ణన్‌ స్వయంగా తిరిగి సవివరమైన నివేదిక గత ప్రభుత్వానికి అందజేశారని, దాన్ని కనీసం పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు.

గుంటూరు, నూజివీడు ఇలా పలు ప్రాంతాల పేర్లు ప్రచారంలోకి తెచ్చి చంద్రబాబు, ఆయన సన్నిహితులు అమరావతి ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా కారుచౌకగా భూములు కొనుగోలు చేశారని చెప్పారు. 2014 జూన్‌ 1 నుంచి డిసెంబరు వరకు కేవలం ఆర్నెళ్ల వ్యవధిలో 4,070 ఎకరాలను చంద్రబాబు, ఆయన సన్నిహితులు కొనుగోలు చేశారని బుగ్గన తెలిపారు. ఇది ఇప్పటి వరకూ బయటపడిన లెక్కలు మాత్రమే ఇంకా ఎన్ని ఎకరాలు బయటపడతాయో?నని వ్యాఖ్యానించారు. ఎవరెవరు ఎంతెంత భూమి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా రాజధాని ప్రాంతంలో కొన్నారో వారి పేరు, ఎంత కొనుగోలు చేశారో అన్ని వివరాలతో సహా మంత్రి అసెంబ్లీ లో వెల్లడించారు.

ఇది టిడిపి నేతల భూ బాగోతం..

– లోకేష్‌ బినామీ కొల్లి శివరాం 47.39 ఎకరాలు కొన్నారు.

– నారా లోకేష్‌ మనుషులు గుమ్మడి సురేష్‌ 42.92 ఎకరాలు, బరసు శ్రీనివాసరావు 14.07 ఎకరాల ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూమి కొన్నారు.

– బాబు సొంత సంస్థ హెరిటేజ్‌ 14.22 ఎకరాలు కొనుగోలు చేసింది. మొత్తం 14.22 ఎకరాలు డైరెక్ట్‌గా హెరిటేజ్‌ఫుడ్స్‌ పేరు మీదే ఉన్నాయి.

– ఆవుల మునిశంకర్, రావూరు సాంబశివరావు, ప్రమీల అనే బినామీల పేరు మీద అప్పటి మంత్రి నారాయణ కొనుగోలు చేశారు. బంధువులు, తన దగ్గర పనిచేసే ఉద్యోగుల పేరుతో నారాయణ 55.27 ఎకరాల భూమి కొన్నారు.

– ప్రత్తిపాటి పుల్లారావు 38.84 ఎకరాలు బినామీ పేర్లతో కొన్నారు.

– పరిటాల సునీత కూతురు భర్త పేరు మీద భూమి కొనుగోలు చేశారు.

– రావెల కిషోర్‌ బాబు 40.85 ఎకరాలు మైత్రీ ఇన్‌ఫ్రా సంస్థ ద్వారా కొనుగోలు చేశారు.

– కొమ్మాలపాటి శ్రీధర్‌ 68.60 ఎకరాలను అభినందన హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట కొన్నారు.

– అప్పటి ఎమ్మెల్యే జీవీఎస్‌ ఆంజనేయులు 37.84 ఎకరాలు బినామీ పేరుతో కొన్నారు.

– పయ్యావుల కేశవ్‌ 15.30 ఎకరాలు పయ్యావుల శ్రీనివాసులు అండ్‌ వేం నరేందర్‌ రెడ్డి పేరుతో కొన్నారు.

– వేమూరు రవికుమార్‌ ప్రసాద్‌ 25.68 ఎకరాలు కొన్నారు. ఆయన నారా లోకేష్‌ వ్యాపార భాగస్వామి అని అందరికీ తెలుసు.

– లింగమనేని రమేష్‌ 351 ఎకరాలను సుజనా, ప్రశాంత్‌ పేరు మీద, ఇతర కంపెనీలు మీద కొనుగోలుచేశారు.

– యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్‌ యాదవ్‌ 7 ఎకరాలు కొనుగోలు చేశారు.

– కోడెల శివప్రసాద్‌ 17.13 ఎకరాలు శశి ఇన్‌ఫ్రా పేరు మీద కొన్నారు.

– ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి 13.50 ఎకరాలను ధూళిపాళ్ల వైష్ణవి, దేవురపుల్లయ్య పేర్లతో కొనుగోలు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి