iDreamPost

Salaar Vs Dunki: సలార్‌ వర్సెస్ డంకీ : థియేటర్ల విషయంలో అన్యాయం?

ప్రభాస్‌ హీరోగా నటించిన సలార్‌, షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటించిన డంకీ సినిమాలు ఒక్క రోజు తేడా తో క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. రెండు సినిమాలు కూడా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడమే లక్ష్యంగా విడుదల అవ్వబోతున్నాయి. అయితే థియేటర్ల కేటాయింపు విషయంలో సలార్‌కి అన్యాయం జరుగుతుందనే చర్చ మొదలైంది.

ప్రభాస్‌ హీరోగా నటించిన సలార్‌, షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటించిన డంకీ సినిమాలు ఒక్క రోజు తేడా తో క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. రెండు సినిమాలు కూడా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడమే లక్ష్యంగా విడుదల అవ్వబోతున్నాయి. అయితే థియేటర్ల కేటాయింపు విషయంలో సలార్‌కి అన్యాయం జరుగుతుందనే చర్చ మొదలైంది.

Salaar Vs Dunki: సలార్‌ వర్సెస్ డంకీ : థియేటర్ల విషయంలో అన్యాయం?

క్రిస్మస్ కానుకగా ఇండియన్‌ బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న చిత్రాలు సలార్ మరియు డంకీ. ఈ రెండు సినిమాల మధ్య ఉన్న పోటీ తారా స్థాయికి చేరింది. ఒక్క రోజు ముందు అంటే డిసెంబర్‌ 21న డంకీ సినిమా విడుదల అవ్వబోతూ ఉండగా, సలార్ డిసెంబర్ 22న విడుదల అవ్వబోతుంది. షారుఖ్ ఖాన్ గత చిత్రాలు పఠాన్ మరియు జవాన్ లు వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో తాజా చిత్రం డంకీ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇక కేజీఎఫ్ తో వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సలార్ రూపొందిన నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అంచనాలు అంతకు మించి అన్నట్లుగా ఉన్నాయి. రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్‌ తో రూపొందాయి, రెండు సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. అందుకే సినిమాలకు థియేటర్ల విషయంలో సమ న్యాయం పాటించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ సమ న్యాయం ఉత్తర భారతంలో అమలు అవుతున్నట్లుగా అనిపించడం లేదు.

షారుఖ్‌ ఖాన్‌ డంకీ సినిమాకు సౌత్‌ ఇండియాలో భారీ ఎత్తున థియేటర్లు లభించాయి. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లతో పాటు మల్టీ ప్లెక్స్ ల్లో కూడా మెజార్టీ సంఖ్య లో డంకీకి కేటాయించడం జరిగింది. సలార్‌కి ఏమాత్రం తగ్గకుండా సౌత్ ఇండియాలో డంకీ సినిమాకు భారీ ఎత్తున థియేటర్లను బయ్యర్లు, ఎగ్జిబిటర్స్ కేటాయించారు. కానీ ఉత్తర భారతంలో మాత్రం సలార్‌కి అన్యాయం జరుగుతోందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డంకీతో పోల్చితే సలార్‌కు చాలా తక్కువ థియేటర్లను బయ్యర్లు, ఎగ్జిబిటర్స్ కేటాయించారు అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట డంకీ సినిమా విడుదల అవ్వబోతుంది. కనుక సహజంగానే మొదటి రోజు భారీ ఎత్తున థియేటర్లు ఆ సినిమాకు కేటాయించడం జరుగుతుంది. అయితే తర్వాత రోజు కూడా డంకీ సినిమాను కొనసాగించే విధంగా థియేటర్ల యాజమాన్యాలతో ఒప్పందాలు జరిగాయి అంటూ వార్తలు వస్తున్నాయి. దాంతో సలార్‌కి ఉత్తర భారతంలో ఆశించిన స్థాయిలో థియేటర్లు లభించడం సాధ్యం కాదని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. అదే జరిగితే సలార్‌ కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సలార్‌ నిర్మాతలు ముందు నుంచే నార్త్‌ కు చెందిన బయ్యర్లు మరియు ఎగ్జిబ్యూటర్స్ తో ఎక్కువ సంఖ్య లో థియేటర్ల కోసం చర్చలు జరుపుతూ వచ్చారు. అయితే బాలీవుడ్‌ పై షారుఖ్ ఖాన్‌ మరియు ఆయన సన్నిహిత నిర్మాతల ఆధిపత్యం కొనసాగుతూ ఉంటుంది. పైగా షారుఖ్‌ గత రెండు చిత్రాలు కూడా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో డంకీ సినిమాకు ఎక్కువ శాతం థియేటర్లు కట్టబెట్టేందుకు తెర వెనుక కొందరు పావులు కదిపారు అంటూ ప్రచారం జరుగుతోంది. మొత్తానికి సౌత్‌ లో డంకీకి దక్కిన స్థాయిలో నార్త్‌ లో సలార్‌కి థియేటర్లు లభించక పోవడం కచ్చితంగా అన్యాయం అంటూ ప్రభాస్ అభిమానులు మరియు మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెండు సినిమాలకు కూడా ఉన్న ఆదరణ మరియు రెండు సినిమాల యొక్క బలాల ఆధారంగా థియేటర్ల సర్దుబాటు అవసరం, కానీ బాలీవుడ్ సినీ వర్గాల వారు అలా చేయలేదు అనేది ఆరోపణ. సలార్‌కి నార్త్‌ లో థియేటర్ల విషయంలో అన్యాయం అనే విషయమై మీ స్పందన ఏంటి?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి