iDreamPost

దేశంలో ముఖ్యమంత్రుల జీతాలు ఎంతో తెలుసా..!

దేశంలో ముఖ్యమంత్రుల జీతాలు ఎంతో తెలుసా..!

దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరికి జీతం ఎక్కువ? ఏ రాష్ట్ర సీఎంకు తక్కువ జీతం? వంటి వివరాలు చాలా మందికి తెలియదు. వీటి గురించి తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ చాలామందికి వీటి గురించి తెలియదు. ఒక్కసారి ఈ వేతనాల ల గురించి తెలుసుకుందామా?

మన దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంల కంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రే ఎక్కువ జీతాన్ని పొందుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు నెలకు రూ.4.10 లక్షల జీతం వస్తోంది. వీటితోపాటు హౌస్ అలవెన్స్, టెలిఫోన్ బిల్లులు, అంతరాష్ట్ర ప్రయాణ ఖర్చులు, వంటి అదనపు అలవెన్సులు కూడా ఉంటాయి.

జగన్ తీసుకునేది రూపాయి వేతనమే..

ఇక వాస్తవానికి అత్యధిక వేతనాలు తీసుకుంటున్న జాబితాలో నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉండాల్సింది. నిబంధనల ప్రకారం ఆయనకు నెలకు 3 లక్షల 35వేల రూపాయల జీతం లభిస్తుంది. కానీ రాష్ట్రం అప్పుల్లో ఉన్న కారణంగా నెలకు రూపాయి మాత్రమే జీతంగా తీసుకుంటానని జగన్ నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల అత్యల్ప మొత్తం జీతం పొందుతున్న సీఎంగా జగన్ చివరి స్థానంలో ఉన్నారు.

ఇప్పటి వరకు మాజీ సీఎం ఎన్టీఆర్ మాత్రమే రూపాయి వేతనం తీసుకునే వారని మనందరికి తెలుసు. కానీ అంతకుముందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రిగా పనిచేస్తూ ఒక్క రూపాయి తీసుకొని పనిచేశాడన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో రాకముందే గుల్బార్గాలో డాక్టర్ చదివారు. ఎంబీబీఎస్ చేసిన ఆయన పులివెందులలో తన తండ్రి పేరుమీదుగా 70 పడకల ఆస్పత్రి ప్రారంభించి ఉచిత వైద్యం అందించారు. రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకునేవారు. అప్పట్లో ఆయన్ని రూపాయి డాక్టరు అని కూడా అనే వారు. ఇక 1978లో వైఎస్ఆర్ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం నాటి అంజయ్య కేబినెట్‌లో వైద్యఆరోగ్యశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. నాడు రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకోవడంతో ముఖ్యంగా రాయలసీమ వ్యథను చూసి తాను మంత్రిగా ఒక్క రూపాయి మాత్రమే నామమాత్రపు వేతనం తీసుకుంటానని.. తన జీతాన్ని రాయలసీమ దుర్బిక్ష పరిస్థితులు తొలగించడానికి విరాళంగా తీసుకోవాలని సీఎంను కోరారు.

Also Read : జగన్‌ బాటలో బీజేపీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత అత్యధిక జీతం పొందుతున్న ముఖ్యమంత్రుల జాబితాలో ఢిల్లీ సీఎం రెండో స్థానంలో ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు నెలకు రూ.4 లక్షల జీతం లభిస్తోంది. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. ఆయనకు నెలకు 3లక్షల 65 వేల రూపాయల జీతం లభిస్తోంది. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మూడు లక్షల 40వేల రూపాయల జీతం లభిస్తోంది. అత్యధిక జీతం పొందుతున్న ముఖ్యమంత్రుల జాబితాలో ఆయన నాలుగో స్థానంలో ఉన్నారు. జీతంతోపాటు అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి నెలకు మూడు లక్షల 21వేల రూపాయల జీతం లభిస్తోంది. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ నెలకు 3లక్షల 10వేల రూపాయల జీతం లభిస్తోంది. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

హర్యాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నెలకు 2 లక్షల 88 వేల రూపాయలను జీతంగా తీసుకుంటున్నారు. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నెలకు 2లక్షల 72 వేల రూపాయలను జీతంగా తీసుకుంటున్నారు. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నెలకు రెండు లక్షల 55వేల రూపాయలను జీతంగా తీసుకుంటున్నారు. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నెలకు రెండు లక్షల 15 వేల రూపాయలను జీతంగా పొందుతున్నారు. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నెలకు రెండు లక్షల 10వేల రూపాయలను జీతంగా పొందుతున్నారు. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నెలకు రెండు లక్షల 5వేల రూపాయలను జీతంగా పొందుతున్నారు. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప నెలకు రెండు లక్షల రూపాయలను జీతంగా పొందుతున్నారు. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నెలకు లక్షా 85వేల రూపాయలను జీతంగా పొందుతున్నారు. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

Also Read : వలంటీర్‌ వ్యవస్థ శుద్ధ దండగని విష్ణుకుమార్‌ రాజుకు తెలియకపాయే వీర్రాజు గారు..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి