iDreamPost

AP రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ స్టేషన్లలో కూడా ఎక్స్ ప్రెస్ లు ఆగుతాయి!

  • Author Soma Sekhar Updated - 11:03 AM, Wed - 19 July 23
  • Author Soma Sekhar Updated - 11:03 AM, Wed - 19 July 23
AP రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ స్టేషన్లలో కూడా ఎక్స్ ప్రెస్ లు ఆగుతాయి!

భారతదేశంలో అతిపెద్ద రవాణా సంస్థ అయిన ఇండియన్ రైల్వేస్.. నిత్యం కొన్ని లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఇక ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త సంస్కరణలు తీసుకోస్తూనే ఉంది ఇండియన్ రైల్వేస్. తాజాగా ఏపీ ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పలు స్టేషన్లలో ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత కొంతకాలంగా రైళ్లకు హాల్ట్ లు ఇవ్వాలిని ప్రయాణికులు కోరుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఇప్పటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఆ రైళ్లు ఆగే స్టేషన్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏపీ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇండియన్ రైల్వేస్. సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను ఏపీలో మరో 9 రైల్వే స్టేషన్లలో ఆపాలని భారతీయ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. చాలా రోజులుగా ప్రయాణికుల నుంచి ఈ డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో.. ఇండియన్ రైల్వేస్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలోని నడికుడి, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, దువ్వాడ, బొబ్బిలి, కుప్పం, పీలేరు, సూళ్లూరుపేట, డోర్నకల్ రైల్వే స్టేషన్లలో పలు రైళ్లు ఆగనున్నాయి. ఈ రైళ్లలో ఎక్కువగా ఎక్స్ ప్రెస్ లు ఉండటం సంతోషకరమైన విషయం. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి, సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. మరిన్ని వివరాల కోసం సంబంధిత రైల్వే స్టేషన్లలోని ఎంక్వైరీ విభాగంలో సమాచారం తెలుసుకోవచ్చని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: పసిడి ప్రియులకు భారీ షాకిచ్చిన బంగారం ధర.. ఎంత పెరిగిందంటే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి