iDreamPost

మెడిసిన్ లేకుండానే షుగర్ కంట్రోల్ చేస్తా: భారత సంతతి CFO ప్రకటన!

CFO Announced He Reversed Type 2 Diabetes Without Medicine: భారత సంతతికి చెందిన సీఎఫ్పో చేసిన ప్రకటన ప్రపంచం మొత్తాన్ని విస్తుపోయేలా చేసింది. ఎలాంటి మెడిసిన్ వాడకుండా ఆయన టైప్ డయాబెటిస్ ని రివర్స్ చేశానంటూ ప్రకటించారు.

CFO Announced He Reversed Type 2 Diabetes Without Medicine: భారత సంతతికి చెందిన సీఎఫ్పో చేసిన ప్రకటన ప్రపంచం మొత్తాన్ని విస్తుపోయేలా చేసింది. ఎలాంటి మెడిసిన్ వాడకుండా ఆయన టైప్ డయాబెటిస్ ని రివర్స్ చేశానంటూ ప్రకటించారు.

మెడిసిన్ లేకుండానే షుగర్ కంట్రోల్ చేస్తా: భారత సంతతి CFO ప్రకటన!

ప్రస్తుతం అందరి జీవన విధానం మారిపోయింది. ఉరుకుల పరుగుల జీవనం కావడంతో ఎవరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే సమయం ఉండటం లేదు. అందుకే ఎంతో మందికి ప్రమాదకరమైన దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధి వస్తోంది. ఈ డయాబెటిస్ వచ్చింది అంటే బెంబేలెత్తి పోతారు. దానికి మందులు వాడటం తప్పితే మరో మార్గం ఉండదు అని ఫిక్స్ అయిపోతారు. అయితే ఒక వ్యక్తి మాత్రం షుగర్ వచ్చింది అని తెలియగానే భయపడలేదు. మందులు కూడా వాడలేదు. కానీ, తనకు వచ్చిన షుగర్ ని రివర్స్ చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయం ఇప్పుడు వరల్డ్ వైడ్ గా చర్చనీయాశం అయ్యింది. షుగర్ వ్యాధిని రివర్స్ చేయచ్చు అంటూ ఆయన ప్రకటించారు.

డయాబెటిస్ రాగానే మందులు వాడటం, జాగ్రత్తలు తీసుకోవడం తప్పితే దానిని రివర్స్ చేయడం సాధ్యం కాదు అంటారు. షుగర్ వ్యాధి వచ్చినవాళ్లు కూడా అదే నిజమని నమ్ముతారు. కానీ, హాంకాంగ్ లో ఉంటున్న భారత సంతతికి చెందిన CFO మాత్రం తనకు వచ్చిన షుగర్ వ్యాధిని మందులు వాడకుండా రివర్స్ చేశానని చెప్పారు. రవిచంద్ర అనే వ్యక్తి అమోలీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు 2015లో టైప్ 2 డయాబెటిస్ అటాక్ అయినట్లు గుర్తించారు. దానిని సహజసిద్ధంగా రివర్స్ చేసినట్లు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వూలో వెల్లడించారు. రవిచంద్ర చెప్పిన విషయాలు విని వైద్యులు కూడా విస్తుపోయారు.

తనకు డయాబెటిస్ అటాక్ అయినట్లు తెలిసిన వెంటనే వైద్యులను సంప్రదించగా మందులు వాడాలంటూ సలహా ఇచ్చారు. కానీ, రవిచంద్రకు మందులు వాడటం ఇష్టంలేదు. అందుకే సాధారణ పద్ధతిలోనే షుగర్ కు చెక్ పెట్టాలని భావించారు. వెంటనే తన జీవనశైలిని మార్చుకోవడం మాత్రమే కాకుండా.. రన్నింగ్ చేయడం ప్రారంభించారు. అలా వరుసగా 3 నెలలపాటు రన్నింగ్ చేశారు. ఆ తర్వాత మళ్లీ పరీక్షలు చేసుకోగా బ్లడ్ గ్లూకోజ్ సాధారణ స్థితికి వచ్చినట్లు తెలుసుకున్నారు. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. తనకు షుగర్ వచ్చిందని తెలిశాక రవిచంద్ర మారథాన్లలో పాల్గొనడం ప్రారంభించారు. అలా ఏకంగా 29 మారథాన్లలో రవిచంద్ర పాల్గొన్నారు. ఒక్క హాంకాంగ్ లోనే కాకుండా.. చైనా, తైవాన్, ఇండియాలో కూడా జరిగిన మారథాన్లలో పాల్గొన్నారు.

మొత్తం 12 మారథాన్లు, 5 హాఫ్ మారథాన్లు పూర్తి చేశారు. అంతేకాకుండా 10 కిలోమీటర్ల పరుగు పందేలు ఏడింటిలో పాల్గొన్నారు. 5 అల్ట్రా రన్స్ కూడా చేశారు. ఇవి మాత్రమే కాకుండా హాంకాంగ్ లో జరిగిన 100 కిలోమీటర్ల ఆక్స్ఫాం ట్రెయిల్ వాకర్ కూడా పూర్తి చేశారు. ఈ మారథాన్లలో పాల్గొనడం రవిచంద్రకు తన స్నేహితుడి స్ఫూర్తితో అలవాటు అయినట్లు చెప్పుకొచ్చారు. కానీ, ఒకానొక సమయంలో మారథాన్లు ఆపేశారు. కానీ, ఎప్పుడైతే షుగర్ వ్యాధి వచ్చిందని తెలిసిందో.. మళ్లీ పరుగు ప్రారంభించారు. ఇప్పుడు ఏకంగా వారంలో 6 రోజులు.. 9 కిలోమీటర్ల వరకు రన్నింగ్ చేస్తున్నారు. రవిచంద్ర ఇప్పటివరకు 20 వేల కిలోమీటర్లు పరుగెత్తినట్లు చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కువగా శాకాహార భోజనమే చేస్తానని చెప్పారు. ఎప్పుడో ఒకసారి చేపలు, చికెన్ తింటాన్నారు. షుగర్ వ్యాధి వచ్చిందని తెలియగానే డీలా పడిపోయి, మందుల మీద ఆధారపడే ఎంతో మందిలో రవిచంద్ర స్ఫూర్తి నింపినట్లు అయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి