iDreamPost

స్టార్ క్రికెటర్ దసరా సెలబ్రేషన్స్.. ఆయుధ పూజ అదిరింది!

  • Author singhj Published - 09:23 PM, Mon - 23 October 23

దేశం మొత్తం దసరా పండుగ సెలబ్రేషన్స్​లో మునిగిపోయింది. ఒక స్టార్ క్రికెటర్ కూడా దసరా ఫెస్టివల్​ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. అందరి కంటే డిఫరెంట్​గా అతను పండుగను జరుపుకున్నాడు. ఎవరా క్రికెటర్? అతనేం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

దేశం మొత్తం దసరా పండుగ సెలబ్రేషన్స్​లో మునిగిపోయింది. ఒక స్టార్ క్రికెటర్ కూడా దసరా ఫెస్టివల్​ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. అందరి కంటే డిఫరెంట్​గా అతను పండుగను జరుపుకున్నాడు. ఎవరా క్రికెటర్? అతనేం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Published - 09:23 PM, Mon - 23 October 23
స్టార్ క్రికెటర్ దసరా సెలబ్రేషన్స్.. ఆయుధ పూజ అదిరింది!

దేశవ్యాప్తంగా దసరా పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజలు శమి పూజ, అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆనందోత్సాహాల నడుమ ఫెస్టివల్​ను సెలబ్రేట్ చేసుకున్నారు. జమ్మి చెట్టుకు పూజ చేయడంతో పాటు వెహికిల్స్​కు, యంత్రాలు, పనిముట్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఒకర్నొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక స్టార్ క్రికెటర్ కూడా దసరా పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. అతడే టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్.

రిషబ్ పంత్.. టీమిండియా స్టార్ క్రికెటర్లలో ఒకడు. అద్భుతమైన బ్యాటింగ్​తో పాటు వికెట్ల వెనుక కీపింగ్​తోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో అతడి ఆటతీరు సూపర్బ్ అనే చెప్పాలి. వీరేంద్ర సెహ్వాగ్ మాదిరిగా లాంగ్ ఫార్మాట్​లో అటాకింగ్ గేమ్​తో ప్రత్యర్థులను భయపెడతాడు పంత్. మ్యాచ్ కండీషన్స్ ఎలా ఉన్నా దూకుడే మంత్రంగా అతడి బ్యాటింగ్ ఉంటుంది. దీనికి టీమ్ మేనేజ్​మెంట్ సపోర్ట్ ఇవ్వడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. టెస్టుల్లో తన ప్లేస్​ను పర్మినెంట్ చేసుకున్న పంత్.. క్రమక్రమంగా వన్డేలు, టీ20ల్లోనూ తన స్థానాన్ని పదిలం చేసుకోవడంపై ఫోకస్ చేశాడు. అయితే కెరీర్​ పీక్ టైమ్​లో ఉండగానే రిషబ్ పంత్​కు అనూహ్యంగా భారీ యాక్సిడెంట్ అయింది.

కారులో వేగంగా డ్రైవ్ చేస్తున్న పంత్ వెహికిల్ కంట్రోల్ కాకపోవడంతో రోడ్డు పక్కన ఉన్న డివైడర్​ను ఢీకొట్టాడు. భారీ గాయాలపాలైన పంత్​ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇంజ్యురీ నుంచి కోలుకున్న ఈ లెఫ్టాండర్.. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఫిట్​నెస్​ను ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటు బ్యాటింగ్, కీపింగ్ టెక్నిక్స్​ను మెరుగుపర్చుకోవడంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దసరా పండుగ సందర్భంగా ఈ స్టార్ క్రికెటర్ తన బ్యాట్​తో పాటు క్రికెట్ కిట్​ను అమ్మవారి ఫొటోల దగ్గర ఉంచి పూజ చేశాడు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పంత్.. ఆయుధ పూజ చేశానని తెలిపాడు. ఈ ఫొటో చూసిన నెటిజన్స్.. ఆయుధ పూజ ముగిసింది, త్వరలో కమ్​బ్యాక్ చేసి బ్యాట్ పవర్ చూపించు పంత్ అంటూ అతడ్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మరి.. పంత్ ఆయుధ పూజపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆ విషయంలో రోహిత్-కోహ్లీ మధ్య వాదన! ఏకంగా గ్రౌండ్​లోనే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి