iDreamPost

‘ఇండియన్ 2’పై అదిరిపోయే అప్​డేట్.. మరి ‘గేమ్ ఛేంజర్’ పరిస్థితేంటి?

  • Author singhj Updated - 12:00 PM, Fri - 3 November 23
  • Author singhj Updated - 12:00 PM, Fri - 3 November 23
‘ఇండియన్ 2’పై అదిరిపోయే అప్​డేట్.. మరి ‘గేమ్ ఛేంజర్’ పరిస్థితేంటి?

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా ‘ఇండియన్ 2’. ‘విక్రమ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కమల్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ ఎక్స్​పెక్టేషన్స్ ఉన్నాయి. కమల్-శంకర్ కలయికలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘భారతీయుడు’కు ఇది సీక్వెల్​గా తెరెకుక్కుతోంది. భారీ బడ్జెట్​తో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఎట్టకేలకు ఒక అప్​డేట్ వచ్చింది. సినిమాలో తన డబ్బింగ్ వర్క్​ను కమల్ స్టార్ట్ చేసేశారు. ఈ విషయాన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో అందించారు. ఆ వీడియోలో కమల్, శంకర్​లు కారు దిగి డబ్బింగ్ స్టూడియోలోకి వెళ్లడం, ఇద్దరూ మాట్లాడుకోవడం కనిపించింది.

కమల్ హాసన్ రిలీజ్ చేసిన వీడియోను బట్టి ‘ఇండియన్ 2’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్లు అర్థమవుతోంది. అయితే ఈ మూవీ విడుదల విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. కమల్ డబ్బింగ్ స్టార్ట్ చేయడాన్ని బట్టి షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందనే అనుకోవాలి. ‘ఇండియన్ 2’లో స్టార్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్​తో పాటు హీరో సిద్ధార్థ్, సముద్ర ఖని, గుల్షన్ గ్రోవర్, యోగ్​రాజ్ సింగ్, వెన్నెల కిషోర్, ప్రియా భవానీ శంకర్ లాంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ కంపోజర్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ‘భారతీయుడు’ సీక్వెల్​కు సీనియర్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘ఇండియన్ 2’ నుంచి సాలిడ్ అప్​డేట్ ఇవ్వడంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు సీరియస్ అవుతున్నారు.

అటు కమల్​తో ‘ఇండియన్ 2’ తీస్తూనే.. ఇటు చరణ్​తో ‘గేమ్ ఛేంజర్​’ను కూడా తెరకెక్కిస్తున్నారు శంకర్. ఏకకాలంలో రెండు ప్రాజెక్టులపై ఆయన పనిచేస్తున్నారు. అయితే కమల్ మూవీ నుంచి అప్​డేట్ ఇవ్వడం, ఎంత అడిగినా ‘గేమ్ ఛేంజర్’ విషయంలో రెస్పాన్స్ రాకపోవడంతో చెర్రీ ఫ్యాన్స్ శంకర్​పై ఫైర్ అవుతున్నారు. రెండేళ్లకు పైనే కావొస్తున్నా ఇప్పటిదాకా టైటిల్ అనౌన్స్​మెంట్, ఫస్ట్ లుక్ పోస్టర్ తప్పితే ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని వాపోతున్నారు. చివరికి ఎవరో యూనిట్ మెంబర్ ఓ పాటను లీక్ చేస్తే దాన్ని విని సంబురపడాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే ఆ సాంగ్ వైరల్ కాకుండా తొలగించడం వేరే సంగతి. ఒకవైపు ‘ఇండియన్ 2’ డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ మొదలైందనే వార్తల నడుమ.. ‘గేమ్​ ఛేంజర్’ షూటింగ్ ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియకపోవడంతో చెర్రీ ఫ్యాన్స్ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కమల్ ఓకే, చరణ్ మూవీ పరిస్థితి ఏంటని డైరెక్టర్​ శంకర్​ను అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. మరోవైపు ఆయనతో తీయబోయే సినిమా కోసం ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు వెయిటింగ్​లో ఉన్నారు. శంకర్ చిత్రం పూర్తయితే గానీ బుచ్చిబాబు సినిమాలో చెర్రీ జాయిన్ అయ్యేలా కనిపించడం లేదు. కానీ ‘గేమ్ ఛేంజర్’ షూట్ కంప్లీట్ అయ్యేందుకు మరో మూడ్నాలుగు నెలలు పడుతుందని టాలీవుడ్ టాక్. ఈ విషయంలో చరణ్, శంకర్​ల్లో ఎవరో ఒకరైనా ఫ్యాన్స్​కు క్లారిటీ ఇస్తారేమో చూడాలి. మరి.. ‘ఇండియన్ 2’ అప్​డేట్ ఇచ్చి.. చెర్రీ మూవీ విషయంలో ఏ అప్​డేట్ లేకపోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ప్రకాశ్ రాజ్‌ను పట్టుకుని ఏడ్చేసిన దిల్ రాజు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి