iDreamPost

VIDEO: క్లాసెన్ కోసం రోహిత్ మాస్టర్ ప్లాన్.. మాట తప్పి మంచి పనే చేశాడు!

  • Author singhj Published - 03:10 PM, Mon - 6 November 23

మాట ఇవ్వొద్దు.. ఇస్తే తప్పొద్దని పెద్దలు చెబుతుంటారు. కానీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఓ విషయంలో మాట ఇచ్చి తప్పాడు. అయితే అతడు మాట తప్పడమూ టీమ్​కు మంచే చేసింది.

మాట ఇవ్వొద్దు.. ఇస్తే తప్పొద్దని పెద్దలు చెబుతుంటారు. కానీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఓ విషయంలో మాట ఇచ్చి తప్పాడు. అయితే అతడు మాట తప్పడమూ టీమ్​కు మంచే చేసింది.

  • Author singhj Published - 03:10 PM, Mon - 6 November 23
VIDEO: క్లాసెన్ కోసం రోహిత్ మాస్టర్ ప్లాన్.. మాట తప్పి మంచి పనే చేశాడు!

వన్డే వరల్డ్ కప్​-2023లో టీమిండియా మరో విక్టరీ కొట్టింది. ఏడు విజయాలతో దూసుకెళ్తున్న భారత్.. ఆదివారం జరిగిన మ్యాచ్​లో సౌతాఫ్రికాను చిత్తు చేసి ఎనిమిదో విజయాన్ని అకౌంట్​లో వేసుకుంది. లీగ్ దశలో భారత్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. వచ్చే ఆదివారం నెదర్లాండ్స్​తో మ్యాచ్ వరకు రోహిత్ సేనకు వారం రోజుల రెస్ట్ దొరకనుంది. ఆఖరి మ్యాచ్​లో బుమ్రా, షమి, కోహ్లీ లాంటి కీలక ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రెస్ట్ ఇవ్వడం ద్వారా వర్క్ లోడ్ తగ్గించడం, నాకౌట్ మ్యాచ్​కు ఫ్రెష్​గా ఉంచాలనే ఆలోచనను టీమ్​ మేనేజ్​మెంట్ చేస్తోందని క్రికెట్ వర్గాల సమాచారం.

ఇక, ఈ వరల్డ్ కప్​లో రోహిత్ శర్మ భారత టీమ్​ను నడిపిస్తున్న తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. శుబ్​మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ లాంటి యంగ్​స్టర్స్ ఫెయిలైనా వారికి టీమ్​లో ఛాన్స్ ఫిక్స్ అని చెబుతూ మోటివేట్ చేస్తున్నాడు. అందుకే వాళ్లు మ్యాన్ విన్నింగ్ నాక్స్ ఆడుతున్నారు. బౌలర్లకు కూడా రన్స్ ఇచ్చినా ఫర్వాలేదు వికెట్లు కావాలంటూ ఎంకరేజ్ చేస్తున్నాడు. దాని ఎఫెక్ట్ ప్రతి మ్యాచ్​లోనూ కనిపిస్తోంది. టీమిండియా బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నారు. డీఆర్ఎస్ విషయంలోనైతే కీపర్ కేఎల్ రాహుల్​కు, బౌలర్లకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చానని గత మ్యాచ్​ తర్వాత రోహిత్ చెప్పుకొచ్చాడు.

డీఆర్ఎస్ విషయంలో తాను కలుగజేసుకోనని లంకతో మ్యాచ్ తర్వాత రోహిత్ అన్నాడు. కానీ హిట్​మ్యాన్ మాట తప్పాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్​లో హెన్రిచ్ క్లాసెన్ కోసం రోహిత్ మాస్టర్ ప్లాన్ వేశాడు. జడేజా బౌలింగ్​లో క్లాసెన్ షాట్ కొట్టబోయి మిస్సయ్యాడు. ఆ బాల్ కాస్తా అతడి ప్యాడ్స్​కు తగిలింది. దీనికి రివ్యూ తీసుకోవాలా? వద్దా? అని జడ్డూ కన్​ఫ్యూజ్ అయ్యాడు. కానీ పరిగెత్తుకుంటూ వచ్చిన రోహిత్ వెంటనే రివ్యూ తీసుకున్నాడు.

మెయిన్ బ్యాటర్లు అందరూ ఔటయ్యారని.. ఇతడ్ని కూడా పెవిలియన్​కు పంపేస్తే పనైపోతుందని రోహిత్ శర్మ చెప్పడం మైక్​లో వినిపించింది. హిట్​మ్యాన్ తీసుకున్న డీఆర్ఎస్​ సక్సెస్ అయింది. క్లాసెస్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో భారత ఫ్యాన్స్ రోహిత్​ను మెచ్చుకుంటున్నారు. హిట్​మ్యాన్ మాట తప్పినా మంచే జరిగిందని ప్రశంసిస్తున్నారు. అయితే రివ్యూ టైమ్​లో హిట్​మ్యాన్ ఓ బూతు పదం వాడటంపై కొందరు నెటిజన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి.. రోహిత్ మాట తప్పడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అంపైర్లకు కొత్త తలనొప్పి.. టీమిండియాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి