iDreamPost

Team India: ప్రయోగాలకు బలవుతున్న యంగ్​స్టర్స్.. ఇలాగైతే వరల్డ్ కప్ కష్టమే!

  • Published Dec 13, 2023 | 4:54 PMUpdated Dec 13, 2023 | 4:54 PM

రిజల్ట్ గురించి పక్కనబెడితే ప్రయోగాలు అనేది నిత్యం చేస్తూనే ఉండాలి. కానీ అవి ప్లేయర్ల మెంటల్ ఎబిలిటీని, కాన్ఫిడెన్స్​ను దెబ్బతీసేలా ఉండకూడదు. భారత టీమ్ మేనేజ్​మెంట్ చేస్తున్న ప్రయోగాలు బెడిసికొడుతున్నాయి.

రిజల్ట్ గురించి పక్కనబెడితే ప్రయోగాలు అనేది నిత్యం చేస్తూనే ఉండాలి. కానీ అవి ప్లేయర్ల మెంటల్ ఎబిలిటీని, కాన్ఫిడెన్స్​ను దెబ్బతీసేలా ఉండకూడదు. భారత టీమ్ మేనేజ్​మెంట్ చేస్తున్న ప్రయోగాలు బెడిసికొడుతున్నాయి.

  • Published Dec 13, 2023 | 4:54 PMUpdated Dec 13, 2023 | 4:54 PM
Team India: ప్రయోగాలకు బలవుతున్న యంగ్​స్టర్స్.. ఇలాగైతే వరల్డ్ కప్ కష్టమే!

ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ విక్టరీతో జోష్​లో ఉన్న టీమిండియా ఎన్నో ఆశలతో సౌతాఫ్రికా గడ్డ మీద అడుగుపెట్టింది. అయితే ప్రొటీస్​తో జరగాల్సిన మొదటి టీ20 వర్షం వల్ల రద్దయింది. డర్బన్​లో జరగాల్సిన ఈ మ్యాచ్​కు వరుణుడు అడ్డుతగిలాడు. రెండో టీ20కీ వాన ఆటంకం కలిగించింది. కానీ ఎట్టకేలకు డక్​వర్త్ లూయిస్ పద్ధతిలో పూర్తి చేసిన ఈ మ్యాచ్​లో భారత్ ఓడిపోయింది. సఫారీ సిరీస్​ను ఓటమితో మొదలుపెట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (56), రింకూ సింగ్ (68 నాటౌట్) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత ప్రొటీస్​ టార్గెట్​ను డక్​వర్త్ లూయిస్ పద్ధతిలో 15 ఓవర్లకు 152గా సవరించారు.

టీమిండియా నిర్దేశించిన టార్గెట్​ను సౌతాఫ్రికా 13.5 ఓవర్లలోనే అందుకుంది. ఒక దశలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో సఫారీ టీమ్ ఓడిపోతుందని అనిపించింది. కానీ డేవిడ్ మిల్లర్ (17), స్టబ్స్ (14 నాటౌట్) కూల్​గా బ్యాటింగ్ చేస్తూ టీమ్​ను టార్గెట్ దిశగా నడిపించారు. ఆఖర్లో మిల్లర్ ఔటైనా.. ఫెలుక్వాయో (10 నాటౌట్), స్టబ్స్ మిగిలిన పని పూర్తి చేశారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్​లో భారత టీమ్ కాంబినేషన్​పై విమర్శలు వస్తున్నాయి. జట్టు కూర్పుపై సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. ఎంతో టాలెంట్ ఉన్న రుతురాజ్ గైక్వాడ్ లాంటి వారిని టీమ్​లోకి తీసుకోకుండా ద్రవిడ్ అండ్ టీమ్ మేనేజ్​మెంట్ తప్పు చేసిందని అంటున్నారు. అనవసర ప్రయోగాలకు వెళ్లి యంగ్​స్టర్స్ కెరీర్​తో ఆడుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు.

రీసెంట్​గా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్​లో పేస్ ఆల్​రౌండర్ శివమ్ దూబే, స్పిన్ ఆల్​రౌండర్​ వాషింగ్టన్ సుందర్​ను స్క్వాడ్​లోకి తీసుకున్నారు. కానీ వాళ్లిద్దర్నీ ఒక్క మ్యాచ్​లో కూడా బరిలోకి దింపలేదు. అందులో నుంచి సుందర్​ను సౌతాఫ్రికా సిరీస్​కు తీసుకున్నారు. కానీ దూబేను మాత్రం సెలక్ట్ చేయలేదు. కంగారూలతో సిరీస్​లో అదరగొట్టిన మరో స్పిన్ ఆల్​రౌండర్ అక్షర్ పటేల్​ను కూడా సఫారీ టూర్​కు ఎంపిక చేయలేదు. మరోవైపు బాగా రాణిస్తున్న రుతురాజ్​ గైక్వాడ్​ను పక్కన పెట్టి సౌతాఫ్రికాతో రెండో టీ20లో శుబ్​మన్​ గిల్​ను ఆడించారు. ఆసీస్​తో టీ20 సిరీస్​లో రుతురాజ్ సెంచరీతో ఆకట్టుకున్నా అతడ్ని బెంచ్​కే పరిమితం చేస్తున్నారు. అతడి ప్లేసులో వచ్చిన గిల్ టీ20 ఇంటర్నేషనల్ రికార్డులు బాగోలేదు.

మరో టాలెంటెడ్ యంగ్​స్టర్ ఇషాన్ కిషాన్ విషయంలోనూ టీమ్ మేనేజ్​మెంట్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. తనకు వచ్చిన ప్రతి ఛాన్స్​ను సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తున్న ఇషాన్​ను సౌతాఫ్రికాతో సెకండ్ టీ20లో ఆడించలేదు. ప్రయోగాల పేరుతో ఇష్టం వచ్చినట్లు ప్లేయర్లను మార్చడం ఏంటనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. టీమ్ కాంబినేషన్ విషయంలో ఇలాగే వ్యవహరిస్తే యంగ్​స్టర్స్ నమ్మకం కోల్పోతారని చెబుతున్నారు. ఇలాగైతే మరో వరల్డ్ కప్ కూడా మన చేతి నుంచి జారిపోవడం ఖాయమని అంటున్నారు. మరి.. ప్రయోగాల పేరుతో యంగ్​స్టర్స్​ను పక్కనబెట్టడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మాక్ చికెన్ తింటూ కోహ్లీ పోస్ట్! వెజిటేరియన్ కదా అంటూ కొత్త రచ్చ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి