iDreamPost

మాక్ చికెన్ తింటూ కోహ్లీ పోస్ట్! వెజిటేరియన్ కదా అంటూ కొత్త రచ్చ!

Fans Dilemma Over Virat Kohli Mock Chicken Story: విరాట్ కోహ్లీ వెజిటేరియన్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా మాక్ చికెన్ తింటున్నా అంటూ పోస్ట్ పెట్టడంతో అందరూ షాక్ కి గురవుతున్నారు.

Fans Dilemma Over Virat Kohli Mock Chicken Story: విరాట్ కోహ్లీ వెజిటేరియన్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా మాక్ చికెన్ తింటున్నా అంటూ పోస్ట్ పెట్టడంతో అందరూ షాక్ కి గురవుతున్నారు.

మాక్ చికెన్ తింటూ కోహ్లీ పోస్ట్! వెజిటేరియన్ కదా అంటూ కొత్త రచ్చ!

పరుగుల యంత్రం, కింగ్ కోహ్లీ ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నాడు. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత ఆటకు కాస్త గ్యాప్ తీసుకున్నాడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో టెస్టు మ్యాచుల్లో తిరిగి జట్టుతో కలవనున్నాడు. అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీకి సంబంధించిన విషయం ఒకటి వైరల్ అవుతోంది. అందుకు కారణం కోహ్లీ పెట్టిన ఇన్ స్టాగ్రామ్ స్టోరీనే. తన ఇన్ స్టా స్టోరీలో ఒక ఫుడ్ ఐటమ్ పిక్ పెట్టాడు. దానికి క్యాప్షన్ గా మాక్ చికెన్ టిక్కా అద్భుతంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అందరూ ఇప్పుడు ఏంటి కోహ్లీ చికెన్ తింటున్నాడా? అంటూ అందరూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఉంది. అదేంటో చూద్దాం.

విరాట్ కోహ్లీ గతంలో నాన్ వెజ్ తినేవాడు. కాకపోతే ఆరోగ్య సమస్యల దృష్ట్యా గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ వెజిటేరియన్ గా మారిపోయాడు. తన ఆహారపు అలవాట్లను కూడా అందుకు తగిన విధంగా మార్చుకున్నాడు. ఎలాంటి మాంసాహార పదార్థాలను కూడా తినకుండా చాలా కఠినంగా తన డైట్ ని ఫాలోఅవుతూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ చికెన్ టిక్కా అని స్టోరీ పెట్టగానే అందరూ అదేంటి కోహ్లీ చికెన్ తింటున్నాడు అంటూ కామెంట్స్ మొదలు పెట్టారు. శాఖాహారిగా ఉన్న కోహ్లీ చికెన్ తింటున్నాడు ఏంటి అంటూ ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. విరాట్ కోహ్లీ తిన్నది చికెన్ టిక్కానే. అయితే ఇక్కడ ఒక బిగ్ ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. కోహ్లీ తిన్న చికెన్ టిక్కా అసలు సిసలైన చికెన్ కాదు. కోహ్లీ ఆల్రెడీ తన క్యాప్షన్ లోనే మెన్షన్ చేశాడు. తాను తిన్నతి మాక్ చికెట్ టిక్కా అని. అంటే అది చికెన్ ని పోలిన ఒక పదార్థం మాత్రమే. అది అసలైన చికెన్ కాదు.

ఏంటీ మాక్ చికెన్ టిక్కా?:

ఈ మాక్ చికెన్ టిక్కాను చికెన్ తో తయారు చేయరు. ఈ వంటకాన్ని తయారు చేసేందుకు సోయాని వాడతారు. ఇది రుచిలో మాత్రం అచ్చు చికెన్ టిక్కానే పోలి ఉంటుంది. సోయా వల్లే ఆ వంటకానికి అలాంటి ఒక రుచి వస్తుంది. అందుకే ఈ మాసాంహారాన్ని పోలి ఉండే వంటకాల్లో సోయానే వాడుతూ ఉంటారు. నాన్ వెజ్ తినని వాళ్లు అలాంటి రుచిని ఇచ్చే ఈ మాక్ పదార్థాలను తింటూ ఉంటారు. కోహ్లీ కూడా నాన్ వెజ్ తినడం మానేసిన తర్వాత అడపాదడపా ఈ మాక్ చికెన్ టిక్కాను తింటున్నాడు. చాలా గ్యాప్ తర్వాత కోహ్లీ మళ్లీ మాక్ చికెన్ టిక్కా తిన్నట్లు ఉన్నాడు.. తన ఆనందాన్ని ఈ స్టోరీ రూపంలో వెల్లడించాడు. కానీ, అభిమానులు మాత్రం దానిని అపార్థం చేసుకున్నారు. వారిలో ఒక యూజర్ మాత్రం ఈ గందరగోళానికి క్లారిటీ ఇచ్చాడు. అది చికెన్ కాదని.. దానిని మాక్ చికెన్ అంటారని.. దానిని సోయాతో తయారు చేస్తారు అంటూ కామెంట్ చేశాడు. మరి.. అభిమానులు, నెటిజన్స్ లో నెలకొన్ని గందరగోళానికి క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాం. మరి.. మీరు కూడా విరాట్ కోహ్లీ చికెన్ తిన్నాడనే అనుకున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి