iDreamPost

IND vs SA: సౌతాఫ్రికా ఆలౌట్​లో బౌలర్లకే క్రెడిట్ ఇస్తున్నారు.. ఆ ఇద్దర్నీ మర్చిపోతే ఎలా..?

  • Published Jan 03, 2024 | 5:28 PMUpdated Jan 03, 2024 | 5:28 PM

కేప్​టౌన్ టెస్ట్​లో సౌతాఫ్రికాకు భారత పేసర్లు పట్టపగలే చుక్కలు చూపించారు. ఆ టీమ్​ను 55 రన్స్​కు కుప్పకూల్చారు. అయితే ఈ ఆలౌట్​కు కారణమైన ఇద్దర్నీ అందరూ మర్చిపోతున్నారు.

కేప్​టౌన్ టెస్ట్​లో సౌతాఫ్రికాకు భారత పేసర్లు పట్టపగలే చుక్కలు చూపించారు. ఆ టీమ్​ను 55 రన్స్​కు కుప్పకూల్చారు. అయితే ఈ ఆలౌట్​కు కారణమైన ఇద్దర్నీ అందరూ మర్చిపోతున్నారు.

  • Published Jan 03, 2024 | 5:28 PMUpdated Jan 03, 2024 | 5:28 PM
IND vs SA: సౌతాఫ్రికా ఆలౌట్​లో బౌలర్లకే క్రెడిట్ ఇస్తున్నారు.. ఆ ఇద్దర్నీ మర్చిపోతే ఎలా..?

విదేశాల్లో టెస్టులు గెలవాలంటే టీమ్​లో మంచి బౌలింగ్ యూనిట్ ఉండాలి. బ్యాటింగ్​తో పాటు బౌలింగ్ బలం కూడా తోడైతేనే ఫారెన్​లో టెస్ట్​లు నెగ్గొచ్చు. దీన్ని టీమిండియా చాన్నాళ్లుగా ప్రూవ్ చేస్తూ వస్తోంది. ఎన్నడూ లేనంతగా పటిష్టంగా మారిన భారత పేస్ బౌలింగ్ దళం ఆ స్ట్రెంగ్త్​తోనే ఆస్టేలియాను వారి సొంత గడ్డ మీదే టెస్టుల్లో చిత్తుగా ఓడించింది. ఇంగ్లండ్​లో ఇంగ్లీష్ టీమ్​పై మన జట్టు డామినేషన్ చూపించడానికీ అదే మెయిన్ రీజన్. అయితే సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్​లో మాత్రం ఇందులో ఫెయిలైంది. ఇరు జట్ల మధ్య సెంచూరియన్​లో జరిగిన ఫస్ట్ టెస్ట్​లో మన పేస్ బౌలర్లు విఫలమయ్యారు. కానీ తీవ్ర విమర్శలు, ఒత్తిడి మధ్య రెండో టెస్టులో చెలరేగి ప్రొటీస్​ను ఫస్ట్ ఇన్నింగ్స్​లో 55 రన్స్​కు ఆలౌట్ చేశారు. దీంతో మహ్మద్ సిరాజ్, జస్​ప్రీత్ బుమ్రాను అందరూ పొగుడుతున్నారు. కానీ సఫారీ ఆలౌట్​లో ఇద్దరు ప్లేయర్లు కీలకపాత్ర పోషించారని మర్చిపోతున్నారు.

సౌతాఫ్రికా తక్కువ పరుగులకే కుప్పకూలడంలో ఇద్దరు భారత బ్యాటర్లు కీలక పాత్ర పోషించారు. వాళ్లు మరెవరో కాదు.. యంగ్ క్రికెటర్స్ శుబ్​మన్ గిల్, యశస్వి జైస్వాల్. బ్యాటర్లు అయి ఉండి అపోజిషన్ టీమ్​ను ఆలౌట్ చేయడంలో వీళ్ల రోల్ ఏంటనే కదా మీ సందేహం. గిల్, జైస్వాల్​ ఫీల్డింగ్​లో తడాఖా చూపించారు. ఇద్దరూ కలసి ఫస్ట్ ఇన్నింగ్స్​లో 4 క్యాచులు అందుకున్నారు. జైస్వాల్ ఒక్కడే 3 క్యాచులు పట్టాడు. ఆ మూడు క్యాచులు చాలా క్లిష్టమైనవే. సౌతాఫ్రికా ఇన్నింగ్స్​ టైమ్​లో గిల్, జైస్వాల్​లు అద్భుతమైన స్లిప్ ఫీల్డింగ్​తో అదరగొట్టారు. ఆ ఏరియా నుంచి బాల్ బయటకు పోకుండా గోడ కట్టారనే చెప్పాలి. ముఖ్యంగా జైస్వాల్ తన చేతికి వచ్చిన ప్రతి బాల్​ను అందుకున్నాడు. సిరాజ్, బుమ్రా 140 కిలోమీటర్లకు పైగా వేగంతో వేసిన బంతులు ఎడ్జ్ అయి స్లిప్​లో బుల్లెట్ స్పీడ్​తో వచ్చాయి. అయినా ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకుండా క్యాచులు అందుకున్నాడు జైస్వాల్.

మార్క్​రమ్, బెడింగ్​హమ్, బర్గర్​లను తన క్యాచులతో పెవిలియన్​కు పంపాడు జైస్వాల్. వెరినే క్యాచ్​ను గిల్ అందుకున్నాడు. టెస్టుల్లో స్లిప్ ఫీల్డింగ్​కు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. పేస్ బౌలింగ్​లో దూసుకొచ్చే బాల్స్​ను అందుకోవాలంటే ఎక్స్​పీరియెన్స్ ఉండాలి. కానీ ఈ ఇద్దరు యంగ్​స్టర్స్​ ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకుండా తమ దగ్గరకు వచ్చిన బాల్స్​ను అందుకుంటూ బుమ్రా, సిరాజ్​కు సహకరించారు. అందుకే సఫారీల ఆలౌట్​లో వీళ్లిద్దరికీ భాగస్వామ్యం ఉంది. క్లిష్టమైన క్యాచులు అందుకున్న వీళ్లకు చాలా క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇక, కేప్​టౌన్​ టెస్ట్​లో భారత పేసర్లు ఎక్స్​పెక్టేషన్స్​కు మించి రాణించారు. ముఖ్యంగా సిరాజ్ (6/15) నిప్పులు చెరిగే బంతులతో బంధించి సఫారీ బ్యాటర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు.

జస్​ప్రీత్ బుమ్రా (2/25), ముకేష్ కుమార్ (0/2) కూడా అద్భుతంగా బౌల్ చేయడంతో ప్రత్యర్థి జట్టు 55 పరుగులకే చాప చుట్టేసింది. ప్రొటీస్​ టీమ్​లో మిడిలార్డర్ బ్యాటర్లు డేవిడ్ బెడింగ్​హమ్ (12), వెరినే (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. దీన్ని బట్టే టీమిండియా పేసర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో భారత్​ మీద అపోజిషన్ టీమ్ చేసిన అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం. ఈ శతాబ్దంలో టెస్టుల్లో సౌతాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు. సిరాజ్​తో పాటు మిగిలిన పేసర్లు లైన్ అండ్ లెంగ్త్​లో బాల్స్​ను వేయడం వల్లే సౌతాఫ్రికాకు తక్కువ రన్స్​కు కుప్పకూలింది.

ఇదీ చదవండి: Rohit Sharma: ఎవడ్రా రోహిత్ అన్ ఫిట్ అన్నది.. జడేజానే ఓడించాడు! ఈ వీడియో చూడండి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి