iDreamPost

IND vs SA: టీమిండియాపై ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అతడ్ని తీసుకురావాలంటూ..!

  • Published Jan 01, 2024 | 4:47 PMUpdated Jan 01, 2024 | 4:47 PM

సెంచూరియన్​ టెస్ట్​లో ఓడిపోయి బాధలో ఉన్న టీమిండియా కేప్​టౌన్ వేదకగా జరగనున్న రెండో మ్యాచ్​ కోసం రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో రోహిత్ సేనపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియా గెలవాలంటే అతడ్ని తీసుకురావాలన్నాడు.

సెంచూరియన్​ టెస్ట్​లో ఓడిపోయి బాధలో ఉన్న టీమిండియా కేప్​టౌన్ వేదకగా జరగనున్న రెండో మ్యాచ్​ కోసం రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో రోహిత్ సేనపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియా గెలవాలంటే అతడ్ని తీసుకురావాలన్నాడు.

  • Published Jan 01, 2024 | 4:47 PMUpdated Jan 01, 2024 | 4:47 PM
IND vs SA: టీమిండియాపై ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అతడ్ని తీసుకురావాలంటూ..!

సౌతాఫ్రికాతో రెండో టెస్ట్​ ఆడేందుకు రెడీ అవుతోంది భారత జట్టు. కేప్​టౌన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ బుధవారం మొదలుకానుంది. సఫారీ సిరీస్​ను బాగానే స్టార్ట్ చేసిన టీమిండియా ఇప్పుడు ఆందోళనగా కనిపిస్తోంది. ప్రొటీస్​తో తొలుత జరిగిన టీ20 సిరీస్​ను సమం చేసింది భారత్. ఆ తర్వాత వన్డే సిరీస్​ను కైవసం చేసుకొని టెస్ట్ సిరీస్​కు ముందు ఫుల్ జోష్​లో కనిపించింది. సౌతాఫ్రికా గడ్డపై ఆతిథ్య జట్టును ఓడించి టెస్ట్ సిరీస్ నెగ్గాలనే డ్రీమ్ ఈసారి నెరవేరడం పక్కా అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ అనూహ్యంగా ఫస్ట్ టెస్ట్​లో టీమిండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఏకంగా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది రోహిత్ సేన. దీంతో అటు ప్లేయర్స్​తో పాటు ఇటు అభిమానులు కూడా డీలాపడ్డారు. ఈ తరుణంలో టీమిండియాకు కీలకమైన సూచన చేశాడు మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. రెండో టెస్టులో నెగ్గాలంటే ఒక ప్లేయర్​ను బరిలోకి దింపాల్సిందేనన్నాడు.

చివరి టెస్ట్​లో గెలవాంటే రవీంద్ర జడేజాను భారత్ ఆడించాలన్నాడు పఠాన్. ‘ఒకవేళ జడేజా ఫిట్​గా ఉంటే అతడ్ని టీమ్​లోకి తీసుకోవాలి. తొలి టెస్ట్​లో సెంచూరియన్ పిచ్ మీద రవిచంద్రన్ అశ్విన్ బాగానే బౌలింగ్ చేశాడు. కానీ టీమిండియా జడ్డూ సేవల్ని బాగా మిస్సయింది. బాల్​ను పూర్తి కంట్రోల్​తో వేయడంతో పాటు 7వ నంబర్​లో బ్యాటింగ్​కు దిగి విలువైన పరుగులు చేసే జడేజా లేని లోటు ఆ మ్యాచ్​లో స్పష్టంగా కనిపించింది. కాబట్టి అతడు ఫిట్​గా ఉంటే రెండో టెస్ట్​లో ఆడించాలి’ అని పఠాన్ చెప్పుకొచ్చాడు. మొదటి టెస్ట్​లో ఫెయిలైన యంగ్ పేసర్ ప్రసిద్ధ్​ కృష్ణకు ఇర్ఫాన్ అండగా నిలిచాడు. ఒకవేళ నెట్స్​లో గనుక ప్రసిద్ధ్ కాన్ఫిడెంట్​గా బౌలింగ్ చేస్తే అతడ్ని రెండో మ్యాచ్​లోనూ బరిలోకి దింపాలన్నాడు. అతడు వద్దనుకుంటే మాత్రం మరో స్పీడ్​స్టర్ ముకేష్ కుమార్​కు ఆడే అవకాశం ఇవ్వాలన్నాడు పఠాన్.

రెండో టెస్ట్​లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ అదే బౌలింగ్​ అటాక్​తో ముందుకు వెళ్లాలని అనుకుంటే వెళ్లొచ్చన్నాడు పఠాన్. కానీ మార్పులు చేయాలనుకుంటే మాత్రం ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్​లో ముకేష్ కుమార్​కు ఛాన్స్ ఇవ్వాలని సూచించాడు. ఇక, వెన్ను నొప్పి కారణంగా ఫస్ట్ టెస్ట్​కు దూరంగా ఉన్న జడ్డూ మళ్లీ టీమ్​తో జాయిన్ అయ్యాడు. నెట్స్​లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అయితే అతడి రికవరీ మీద టీమ్ మేనేజ్​మెంట్ ఇంకా అఫీషియల్​గా ఎలాంటి ప్రకటన చేయలేదు. జడేజా ఫిట్​గా ఉన్నాడా? రెండో టెస్ట్​లో ఆడతాడా? అనే దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. కానీ నెట్స్​లో ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేయడం, బౌలింగ్ వేస్తూ కనిపించడాన్ని బట్టి చివరి టెస్ట్​లో ఈ స్టార్ ఆల్​రౌండర్ ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇర్ఫాన్ పఠాన్​తో పాటు చాలా మంది మాజీ క్రికెటర్లు జడ్డూను ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అశ్విన్ స్థానంలో అతడ్ని తీసుకుంటారేమో చూడాలి. మరి.. భారత్ నెగ్గాలంటే జడ్డూను దింపాలంటూ పఠాన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Gautam Gambhir: పాక్ గాలి తీసేసిన గంభీర్.. ఒకవేళ టీమిండియాను ఓడిస్తే అంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి