iDreamPost

IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. జట్టులో భారీ మార్పులు! తుది జట్టు ఇదే!

నిర్ణయాత్మకమైన మూడో టీ20లో సౌతాఫ్రికాపై గెలిచి సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది టీమిండియా. ఈ నేపథ్యంలో జట్టులో భారీ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. మరి మూడో మ్యాచ్ కు సిద్దమైయ్యే తుది జట్టు ఏదో ఇప్పుడు చూద్దాం.

నిర్ణయాత్మకమైన మూడో టీ20లో సౌతాఫ్రికాపై గెలిచి సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది టీమిండియా. ఈ నేపథ్యంలో జట్టులో భారీ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. మరి మూడో మ్యాచ్ కు సిద్దమైయ్యే తుది జట్టు ఏదో ఇప్పుడు చూద్దాం.

IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. జట్టులో భారీ మార్పులు! తుది జట్టు ఇదే!

ఆస్ట్రేలియాపై చూపించిన జోరును సఫారీ గడ్డపై కూడా ప్రదర్శించాలని భావించిన యంగ్ టీమిండియాకు షాక్ తగిలింది. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఇక రెండో మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో బోణీ కొట్టాలనుకున్న భారత జట్టుకు అనూహ్య ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్ లో కూడా వర్షం పడటంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 5 వికెట్ల తేడాతో విజయం సాధించి.. సిరీస్ లో1-0తో ముందంజలో ఉంది ఆతిథ్య సఫారీ టీమ్. ఇక సిరీస్ నిర్ణయాత్మక మూడో మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది టీమిండియా. ఈ నేపథ్యంలో జట్టులో భారీ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. మరి మూడో మ్యాచ్ కు సిద్దమైయ్యే తుది జట్టు ఏదో? ఎవరెవరిని తప్పించనున్నారో ఇప్పుడు పరిశీలిద్దాం.

దక్షిణాఫ్రికా పర్యటనను ఓటమితో ప్రారంభించింది టీమిండియా. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 రద్దు కాగా.. రెండో మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ కారణంగా భారత్ పరాజయం పాలైంది. ఇక చివరి మ్యాచ్ లో విజయం సాధించి.. సిరీస్ ను సమం చేయాలని భావిస్తోంది యువ టీమిండియా. ఈ నేపథ్యంలో విఫలం అవుతున్న ఆటగాళ్లను తప్పించనున్నట్లు తెలుస్తోంది. గత పోరులో ఓటమితో టీమిండియా కాంబినేషన్ పై విమర్శలు వ్యక్తమయ్యాయి. అద్భుత ఫామ్ లో ఉన్న టీ20 నెంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్ ను ఆడించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే శ్రేయస్ అయ్యర్, రుతురాజ్, ఇషాన్ లను పక్కన పెట్టడాన్ని మాజీ ప్లేయర్లు తప్పుబట్టారు.

Huge changes in the team

ఇదిలా ఉండగా.. గత మ్యాచ్ లో గిల్, జైస్వాల్ ఇద్దరూ కూడా డకౌట్ కావడం జట్టును ఆందోళన పరుస్తోంది. తిలక్ వర్మ పర్వాలేదనిపించినా.. ఇషాన్ ను పక్కన పెట్టి మరీ జట్టులోకి తీసుకున్న హిట్టర్ జితేశ్ శర్మ విఫలమయ్యాడు. దీంతో మళ్లీ అతడి ప్లేస్ లో ఇషాన్ ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుల్దీప్ సైతం పెద్దగా ప్రభావం చూపకపోవడంతో.. మూడో టీ20లో భారీగా మార్పులు చేయాలని మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కుల్దీప్, జితేశ్, గిల్ లను పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరి స్థానాల్లో వరుసగా బిష్ణోయ్, ఇషాన్, రుతురాజ్ లను టీమ్ లోకి తీసుకునే ఛాన్స్ లు ఉన్నాయి.

అయితే గిల్, గైక్వాడ్ లను ఆడించాలనుకుంటే మాత్రం జైస్వాల్ బెంచ్ కే పరిమితం అవుతాడు. ఇక తిలక్ వర్మను పక్కన పెట్టి సీనియర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలను కొట్టిపారేయలేం. టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో కాంబినేషన్ పై ఫొకస్ పెట్టిన మేనేజ్ మెంట్.. గెలుపోటముల కంటే ప్లేయర్ల సత్తాను పరీక్షించడానికే ఎక్కువ మెుగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇక పేసర్లలో ఎలాంటి మార్పులు లేనట్లే. మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్ లు పేస్ బౌలింగ్ ను పంచుకోనున్నారు.

టీమిండియా తుది జట్టు (అంచనా):

రుతురాజ్ గైక్వాడ్/గిల్, యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి