iDreamPost

IND vs SA: సౌతాఫ్రికాతో చివరి టెస్ట్.. మూడు మార్పులతో బరిలోకి టీమిండియా!

  • Published Jan 02, 2024 | 5:29 PMUpdated Jan 03, 2024 | 10:31 AM

సౌతాఫ్రికాతో రెండో టెస్ట్​ ఆడేందుకు భారత జట్టు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చివరి మ్యాచ్​లో రోహిత్ సేన కూర్పు ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం..

సౌతాఫ్రికాతో రెండో టెస్ట్​ ఆడేందుకు భారత జట్టు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చివరి మ్యాచ్​లో రోహిత్ సేన కూర్పు ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 02, 2024 | 5:29 PMUpdated Jan 03, 2024 | 10:31 AM
IND vs SA: సౌతాఫ్రికాతో చివరి టెస్ట్.. మూడు మార్పులతో బరిలోకి టీమిండియా!

సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు టీమిండియా రెడీ అవుతోంది. మొదటి మ్యాచ్​లో ఇన్నింగ్స్ తేడాతో ఓడి బాధలో ఉన్న భారత జట్టు.. ఈసారి ఎలాగైనా గెలవాలని కోరుకుంటోంది. రెండో టెస్టులో నెగ్గి, సిరీస్​ను డ్రా చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్​లో సఫారీ పేసర్ల ఛాలెంజ్​ను సమర్థంగా ఎదుర్కొనేందుకు టీమిండియా బ్యాటర్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ తదితర ప్లేయర్స్ ప్రాక్టీస్​లో మునిగిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. టెస్ట్ అరంగేట్రంలోనే అదరగొట్టిన ప్రొటీస్ లెఫ్టార్మ్ స్పీడ్​స్టర్ బర్గర్​కు కళ్లెం వేయడం మీద కోహ్లీ ఫోకస్ పెట్టాడు. అందుకే నెట్స్​లో ఓ బౌలర్ బౌలింగ్​లో ప్రత్యేకంగా సాధన చేశాడు. మిగతా బ్యాటర్లు కూడా ఎక్స్​ట్రా టైమ్ ప్రాక్టీస్ చేశారు. ఈ నేపథ్యంలో రెండో టెస్ట్​కు భారత టీమ్ కాంబినేషన్ ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం..

చివరి టెస్ట్​కు కేప్​టౌన్​లోని న్యూలాండ్స్ గ్రౌండ్ ఆతిథ్యం ఇస్తోంది. ఇది కూడా బ్యాటర్లకు ఛాలెంజ్ విసిరే వికెట్ కావడం గమనార్హం. ఈ పిచ్ మీద బౌలర్లకు ముఖ్యంగా పేసర్లకు మంచి సపోర్ట్ దొరుకుతుంది. టాస్ నెగ్గిన టీమ్ తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువ. పేస్​తో పాటు స్పిన్నర్లకూ న్యూలాండ్స్ వికెట్ నుంచి మద్దతు దొరికే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో రెండో టెస్ట్​లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. వెన్ను నొప్పి కారణంగా ఫస్ట్ మ్యాచ్​కు దూరమైన స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ఆఖరి టెస్ట్​లో బరిలోకి దిగడం ఖాయం. అతడు నెట్స్​లో ప్రాక్టీస్ చేస్తున్న తీరును బట్టి పూర్తిగా రికవర్ అయినట్లు కనిపిస్తోంది. శార్దూల్ ఠాకూర్ స్థానంలో జడ్డూ టీమ్​లోకి రావొచ్చు. మొదటి టెస్ట్​లో బౌలింగ్​లో దారుణంగా ఫెయిలయ్యాడు యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ. వికెట్లు తీయకపోగా ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు.

రెండో మ్యాచ్​లో ప్రసిద్ధ్​ కృష్ణను పక్కన పెట్టడం ఖాయం. అతడి ప్లేసులో వేశ్​ ఖాన్ను టీమ్​లోకి తీసుకురావడం గ్యారెంటీ. ఫస్ట్ టెస్ట్​లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్​లో ఫర్వాలేదనిపించాడు. ఒకే వికెట్ తీసినా రన్స్ బాగా కట్టడి చేశాడు. 6 మెయిడిన్లు వేసి ప్రొటీస్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. కాబట్టి జడ్డూ రూపంలో ఒక స్పిన్నర్ ఉన్నా అశ్విన్​ను కూడా ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లు వద్దనుకుంటే అశ్విన్ ప్లేస్​లో యంగ్ పేసర్ ముకేష్ కుమార్ టీమ్​లోకి వస్తాడు. బ్యాటింగ్ విషయానికొస్తే.. మొదటి టెస్ట్​లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తప్ప మిగతా వాళ్లందరూ ఫెయిల్ అయ్యారు. కానీ కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ప్లానింగ్​ను గమనిస్తే బ్యాటింగ్ యూనిట్​లో ఎలాంటి మార్పులు చేయకుండా.. సేమ్​ కాంబినేషన్​తో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరి.. రెండో టెస్ట్​లో భారత జట్టులో ఇంకేమైనా మార్పులు చేస్తే బాగుంటుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

భారత జట్టు (అంచనా):

రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌, శుబ్​మన్ గిల్‌, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్‌, కేఎల్ రాహుల్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌/ముకేష్‌ కుమార్‌, జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌, అవేశ్‌ ఖాన్‌


ఇదీ చదవండి: David Warner: చివరి మ్యాచ్‌కి ముందు తాను ఎదుర్కొన్న డేంజర్‌ బౌలర్‌ ఎవరో చెప్పిన వార్నర్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి