iDreamPost

IND vs PAK మ్యాచ్​కు ముందు ఫ్యాన్స్​కు షాకిచ్చిన BCCI

  • Author singhj Published - 02:14 PM, Sat - 14 October 23
  • Author singhj Published - 02:14 PM, Sat - 14 October 23
IND vs PAK మ్యాచ్​కు ముందు ఫ్యాన్స్​కు షాకిచ్చిన BCCI

వన్డే వరల్డ్ కప్​-2023లో భాగంగా భారత్, పాకిస్థాన్​ మ్యాచ్​కు అంతా రెడీ అయిపోయింది. మరికొన్ని నిమిషాల్లో చిరకాల ప్రత్యర్థులు గ్రౌండ్​లో కొదమసింహాల్లా తలపడేందుకు సిద్ధమైపోయారు. ఈ మ్యాచ్​ చూసేందుకు ఇరు జట్ల అభిమానులతో పాటు ఇతర టీమ్స్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ బోర్డు స్పెషల్ ప్లాన్స్ చేసిందనేది తెలిసిందే. బాలీవుడ్ స్టార్‌‌ హీరో రణ్​వీర్ సింగ్​తో పాటు సింగర్స్ అరిజిత్ సింగ్, శంకర్ మహదేవన్, నేహా కక్కర్ లాంటి వారితో సెలబ్రేషన్స్​కు ఏర్పాట్లు చేసింది.

భారత్, పాక్​ మ్యాచ్​ మొదలవ్వడానికి ముందు బాలీవుడ్ సెలబ్రిటీలతో మ్యూజిక్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్​ను బీసీసీఐ ఏర్పాట్లు చేయడంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ఇది డబుల్ బొనాంజా అని.. ఫుల్ ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ టైమ్​లో వారికి బీసీసీఐ షాక్ ఇచ్చింది. గ్రౌండ్​లో ప్లాన్ చేసిన ప్రోగ్రామ్స్​ కేవలం స్టేడియానికి వచ్చే ప్రేక్షకుల కోసం మాత్రమేనని.. టీవీలు, ఫోన్లలో చూసే ఆడియెన్స్ కోసం కాదని బాంబు పేల్చింది. దీంతో ఫ్యాన్స్​ భారత క్రికెట్ బోర్డు తీరుపై ఫైర్ అవుతున్నారు.

భారత్-పాక్ మ్యాచ్​కు సెలబ్రేషన్స్ అంటూ అందులో పాల్గొనే వారి ఫొటోలు బయటకు లీక్ చేశారని.. వాళ్లు గ్రౌండ్​లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు కూడా వచ్చాయని నెటిజన్స్ అంటున్నారు. ఇంతగా ఊరించి ఆఖరికి బీసీసీఐ ఉసూరుమనిపించిందని సీరియస్ అవుతున్నారు. బీసీసీఐ, ఐసీసీలు అంతా డబ్బు కోసమే చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. మెగా టోర్నీ ఫస్ట్ మ్యాచ్​కు ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించలేదని.. కానీ భారత్​-పాక్ మ్యాచ్​కు స్పెషల్ అరేంజ్​మెంట్స్ చేసి సొమ్ము చేసుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి.. ప్రతిష్టాత్మక మ్యాచ్​కు ముందు అభిమానులకు బీసీసీఐ ఇలా షాకివ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup: పాకిస్థాన్​పై జోకులు వేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి