iDreamPost

World Cup 2023: ఇండో-కివీస్ ఫైట్​లో గెలిచేది ఆ టీమేనా?

  • Author singhj Published - 12:05 PM, Sun - 22 October 23

వరల్డ్ కప్​లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. ఇండియా-న్యూజిలాండ్​లు తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయిపోయాయి. ఈ రెండు టీమ్స్​ బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

వరల్డ్ కప్​లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. ఇండియా-న్యూజిలాండ్​లు తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయిపోయాయి. ఈ రెండు టీమ్స్​ బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

  • Author singhj Published - 12:05 PM, Sun - 22 October 23
World Cup 2023: ఇండో-కివీస్ ఫైట్​లో గెలిచేది ఆ టీమేనా?

వన్డే వరల్డ్ కప్​-2023లో సమవుజ్జీల పోరుకు అంతా రెడీ అయిపోయింది. ఆ రెండు జట్లూ మెగా టోర్నీలో ఆడిన ప్రతి మ్యాచ్​ గెలిచినవే. అందులో ఒకటి టీమిండియా అయితే.. మరొకటి న్యూజిలాండ్. ఓటమనేదే లేకుండా దూసుకెళ్తున్న ఈ రెండు టీమ్స్ మధ్య రసవత్తర మ్యాచ్​కు ఇంకొన్ని గంటలే మిగిలి ఉంది. ఆడిన నాలుగుకు నాలుగు మ్యాచుల్లోనూ నెగ్గడమే గాక.. ఆయా మ్యాచుల్లో ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి భారత్, కివీస్​. పవర్​ఫుల్​గా, మంచి స్ట్రెంగ్త్​తో కనిపిస్తున్నాయి ఇరు టీమ్స్. ఈ నేపథ్యంలో ఈ ప్రపంచ కప్​లో తొలి ఓటమిని రుచి చూసేదెవరోనని క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మెగా టోర్నీలో ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన టీమ్​ను తొలి మ్యాచ్​లోనే ఢీకొన్న టీమిండియా.. ఆ మ్యాచ్​లో కంగారూలను చిత్తు చేసింది. ఆ తర్వాత ఎదురుపడిన ఆఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్​ను కూడా అలవోకగా ఓడించి సెమీస్ దిశగా దూసుకెళ్తోంది. ఇదే ఊపులో న్యూజిలాండ్​ను కూడా చిత్తు చేయాలని భావిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలిచి భారత్​ను ఓడించాలనే కసి మీద కనిపిస్తోంది. ఈ మ్యాచ్​లో నెగ్గిన టీమ్ వరల్డ్ కప్​లో ఫేవరెట్ నుంచి హాట్ ఫేవరెట్​గా అవతరిస్తుందని చెప్పొచ్చు. పెద్దగా అంచనాలు లేకుండా టోర్నీలో అడుగుపెట్టిన కివీస్ ఆడుతున్న తీరు, విలియమ్సన్ లేకపోయినా వరుసగా విజయాలు సాధించడం అందర్నీ షాక్​కు గురిచేస్తోంది.

భారత్-న్యూజిలాండ్ మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తున్న ధర్మశాల పిచ్​ కివీస్​ ఆడే తీరుకు బాగా సెట్ అవుతుంది. తన ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో జట్టులో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తీసుకొస్తున్న హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్​కు దూరమవ్వడం భారత్​కు ఎదురు దెబ్బే. కాబట్టి రోహిత్ సేనకు సవాల్ తప్పకపోవచ్చు. హిమాలయాల చెంతన ఉన్న ధర్మశాలలో చల్లటి వాతావరణం ఉంటుంది. అక్కడి పరిస్థితులు పేసర్లకు అనుకూలిస్తాయి. స్పిన్నర్లకు కూడా పిచ్ నుంచి సపోర్ట్ దొరికే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్ అంత కష్టమేమీ కాదు. క్రీజులో సెటిలైతే రన్స్ చేయొచ్చు. మొత్తంగా ఇటు బౌలర్లకు, అటు బ్యాటర్లకు అనుకూలించే బ్యాలెన్స్ కలిగిన పిచ్​గా అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

మెగా టోర్నీలో టీమిండియాకు తొలి నలుగురైదురుగు బ్యాటర్లే పని పూర్తి చేస్తూ వచ్చారు. మిడిలార్డర్​కు పెద్దగా బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ భీకర ఫామ్​లో ఉన్నారు. శుబ్​మన్ గిల్ కూడా రిథమ్ అందుకున్నాడు. అవకాశం వచ్చినప్పుడు శ్రేయస్ అయ్యర్ సత్తా చాటుతున్నాడు. అయితే పేస్​కు అనుకూలించే పిచ్​పై బాల్ కాస్త స్వింగ్ అయినా భారత బ్యాటర్లకు సవాల్ తప్పదు. అలాగే మిచెల్ శాంట్నర్ లాంటి క్వాలిటీ స్పిన్నర్​ను మన బ్యాట్స్​మెన్ ఎలా ఎదుర్కొంటారో కూడా కీలకం కానుంది. ఒకవేళ టాపార్డర్ ఫెయిలైతే, మిడిలార్డర్ ఎలా నిలబడుతుందో.. వాళ్లకు లోయరార్డర్ ఎంత మేర సహకరిస్తుందో చూడాలి.

హార్దిక్ పాండ్యా లేడు కాబట్టి రవీంద్ర జడేజా బ్యాటింగ్​లోనూ సత్తా చాటాలి. బౌలింగ్​లో జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్​దీప్ యాదవ్, జడేజాలు అదే జోరును కంటిన్యూ చేస్తే సరిపోతుంది. ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి శార్దూల్ ప్లేస్​లో అవకాశం దక్కొచ్చు. దాన్ని అతడు ఎలా వినియోగించుకుంటాడో చూడాలి. ఐసీసీ టోర్నీల్లో కివీస్​పై భారత్​కు మంచి రికార్డు లేదు. వరల్డ్ కప్​-2019 సెమీస్​లో న్యూజిలాండ్​ మీద టీమిండియా ఓటమిని ఎవరూ మర్చిపోలేరు. వరల్డ్ టెస్ట్ సిరీస్ ఫైనల్-2021లోనూ భారత్​కు కివీస్ చేతిలో ఓటమి తప్పలేదు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్​ప్రీత్ బుమ్రా, కుల్​దీప్ యాదవ్ లాంటి ప్లేయర్లు భీకర ఫామ్​లో ఉండటం, ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత జోష్​లో జట్టు ఉండటం, కివీస్​ కంటే అన్ని విభాగాల్లోనూ మరింత బలంగా ఉండటం, స్వదేశంలో మెగా టోర్నీ జరుగుతుండటం లాంటి విషయాలు టీమిండియాకు కలిసొచ్చే అంశాలు. వరుసగా విజయాలు దక్కుతుండటం, ఒత్తిడి మొత్తాన్ని కెప్టెన్ హిట్​మ్యాన్ తీసుకొని ఇతరుల మీద పడకుండా చూసుకోవడం, సొంత ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్​ చేస్తుండటం మన టీమ్​కు బిగ్ ప్లస్. వీటన్నింటినీ లెక్కలోకి తీసుకుంటే ఇవాళ్టి మ్యాచ్​లో భారత్​ గెలవడం పక్కా. ఎక్స్​పెక్టేషన్స్​కు తగ్గట్లు ఆడితే టీమిండియా అకౌంట్​లో మరో విక్టరీ పడ్డట్లే. మరి.. ఈ మ్యాచ్​లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కివీస్​తో మ్యాచ్​కు ముందు భారత్​కు భారీ షాక్.. ఇద్దరు ప్లేయర్లకు ఇంజ్యురీ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి