iDreamPost

జైస్వాల్​ ఔట్​తో ఇంగ్లాండ్ సెలబ్రేషన్స్​.. ట్విస్ట్ ఇచ్చిన రోహిత్ శర్మ!

  • Published Feb 24, 2024 | 4:42 PMUpdated Feb 24, 2024 | 4:45 PM

రాంచీ టెస్టులో ఇంగ్లాండ్ జట్టుకు అంపైర్ షాక్ ఇచ్చాడు. దీంతో ఆ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సహా ఆటగాళ్లంతా ఇదేంటంటూ నిరాశలో కూరుకుపోయారు.

రాంచీ టెస్టులో ఇంగ్లాండ్ జట్టుకు అంపైర్ షాక్ ఇచ్చాడు. దీంతో ఆ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సహా ఆటగాళ్లంతా ఇదేంటంటూ నిరాశలో కూరుకుపోయారు.

  • Published Feb 24, 2024 | 4:42 PMUpdated Feb 24, 2024 | 4:45 PM
జైస్వాల్​ ఔట్​తో ఇంగ్లాండ్ సెలబ్రేషన్స్​.. ట్విస్ట్ ఇచ్చిన రోహిత్ శర్మ!

రాంచీ టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఇంగ్లాండ్, భారత్ నువ్వానేనా అంటూ తలపడుతుండటంతో మ్యాచ్​లో ఆధిపత్యం చేతులు మారుతూ పోతోంది. రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లండ్.. 353 పరుగులకు ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా (4/67) చెలరేగడంతో ఆ జట్టు 6 పరుగుల వ్యవధిలో చివరి 3 వికెట్లు కోల్పోయింది. సెంచరీతో ఆకట్టుకున్న జో రూట్ (122 నాటౌట్) ఒక ఎండ్​లో అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన టీమిండియాకు మంచి స్టార్ట్ దొరకలేదు. రోహిత్ శర్మ (2) త్వరగా పెవిలియన్ చేరడంతో జట్టు కష్టాల్లో పడింది. అయితే యశస్వి జైస్వాల్ (47 నాటౌట్), శుబ్​మన్ గిల్ (38) టీమ్​ను ఆదుకున్నారు. ఈ క్రమంలో రాబిన్సన్ బౌలింగ్​లో కీపర్​కు జైస్వాల్ క్యాచ్ ఇచ్చాడు. కీపర్ దాన్ని అందుకోవడంతో ఇంగ్లండ్ ప్లేయర్లు సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ వారికి అంపైర్ షాక్ ఇచ్చాడు.

భారత ఇన్నింగ్స్​లో 19వ ఓవర్ వేసేందుకు వచ్చాడు రాబిన్సన్. ఆ ఓవర్ ఆఖరి బంతిని ఎదుర్కోవడంలో తడబడ్డ జైస్వాల్.. కీపర్ బెన్ ఫోక్స్​కు క్యాచ్ ఇచ్చాడు. ఫోక్స్ ఆ బంతిని పట్టుకోవడంతో ప్రత్యర్థి జట్టు సంబురాలు చేసుకుంది. కానీ జైస్వాల్ మాత్రం అక్కడే నిలబడిపోయాడు. తాను ఔట్ అవలేదనే ధీమాతో కనిపించాడు. ఆ టైమ్​లో అంపైర్​ కూడా డౌట్​తో రీప్లే చూశాడు. బాల్ సరిగ్గా అందుకోలేదనే అనుమానంతో క్యాచ్​ను జూమ్ చేయగా అది క్యారీ కాలేదని తేలింది. బాల్ గ్రౌండ్​ను టచ్ అయ్యాకే ఫోక్స్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో బెన్ స్టోక్స్ సహా ఇంగ్లీష్​ ప్లేయర్లు అంతా నిరాశలో కూరుకుపోయారు. ఇలా జరిగిందేంది అంటూ డిజప్పాయింట్ అయ్యారు. సిరీస్​లో సూపర్ ఫామ్​లో ఉన్న జైస్వాల్ దొరికపోయాడని అనుకుంటే ఇలా అయ్యిందేంటని షాకయ్యారు. అయితే భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం రీప్లేకు ముందే అది ఔట్ కాదని సైగ చేశాడు.

డ్రెస్సింగ్ రూమ్​లో కూర్చున్న రోహిత్.. అది ఔట్ ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. బాల్ అసలు క్యారీ కాలేదని.. ఇంగ్లాండ్ ఓవర్ యాక్షన్ చేస్తోందంటూ తన చేతులతో రియాక్షన్ ఇచ్చాడు. ఇంగ్లీష్ టీమ్​తో పాటు రోహిత్ రియాక్షన్ వీడియో ఇప్పుడు నెట్టింట్ తెగ వైరల్ అవుతోంది. ఇక, నాటౌట్​గా తేలడంతో బతికిపోయిన జైస్వాల్ కూల్​గా ఆడుతున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ క్రీజులో ఎంత సేపు నిలబడతాడనే దాని మీదే భారత జట్టు భారీ స్కోరు ఆశలు ఆధారపడతాయి. కఠిన పిచ్​ మీద ఆల్రెడీ పాతుకుపోయాడు కాబట్టి జైస్వాల్ భారీ సెంచరీ బాదితే టీమ్​కు బిగ్ ప్లస్ అవుతుంది. ప్రస్తుతం భారత్ స్కోరు 33 ఓవర్లకు 107/2. జైస్వాల్ (52 నాటౌట్)తో పాటు రజత్ పాటిదార్ (16 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మరి.. జైస్వాల్ క్యాచ్ విషయంలో ఇంగ్లాండ్​కు అంపైర్ షాక్ ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: తండ్రి, సోదరుడ్ని కోల్పోయా.. వాళ్ల వల్లే ఈ పొజిషన్​లో ఉన్నా: ఆకాశ్ దీప్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి