iDreamPost

IND vs ENG: జైస్వాల్​ను హీరో చేయకండి.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!

  • Published Feb 04, 2024 | 12:08 PMUpdated Feb 04, 2024 | 12:08 PM

ఇంగ్లండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. దీంతో అందరూ అతడ్ని మెచ్చుకుంటున్నారు. అతడే టీమిండియా ఫ్యూచర్ అని అంటున్నారు.

ఇంగ్లండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. దీంతో అందరూ అతడ్ని మెచ్చుకుంటున్నారు. అతడే టీమిండియా ఫ్యూచర్ అని అంటున్నారు.

  • Published Feb 04, 2024 | 12:08 PMUpdated Feb 04, 2024 | 12:08 PM
IND vs ENG: జైస్వాల్​ను హీరో చేయకండి.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!

క్రికెట్​లో ఏ టీమ్​లోనైనా మంచి ఓపెనింగ్ జోడీ ఉండటం చాలా ముఖ్యం. ఓపెనర్లు గుడ్ స్టార్ట్స్ అందిస్తే జట్టు భారీ స్కోర్లు చేయడం, బిగ్ టార్గెట్స్ ఛేజ్ చేయడం ఈజీ అవుతుంది. అందుకే మంచి ఓపెనర్ల కోసం టీమ్స్ అన్వేషిస్తుంటాయి. భారత జట్టునూ ఈ సమస్య వేధిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ రూపంలో ఓ సాలిడ్ ఓపెనర్ ఉన్నా అతడికి సరైన పార్ట్​నర్ దొరకడం లేదు. శుబ్​మన్ గిల్ వన్డేల్లో మాత్రం ఓపెనర్​గా అదరగొడుతున్నాడు. దీంతో మిగిలిన ఫార్మాట్లలో హిట్​మ్యాన్​కు జోడీ కోసం టీమ్ మేనేజ్​మెంట్ వెతుకులాట స్టార్ట్ చేసింది. అయితే దీనికి ఫుల్​స్టాప్ పెట్టాడు యశస్వి జైస్వాల్. టీ20లతో పాటు టెస్టుల్లోనూ ఓపెనర్​గా బరిలోకి దిగి అదరగొడుతున్నాడు. తాజాగా ఇంగ్లండ్​పై రెండో టెస్టులో డబుల్ సెంచరీ బాది తన ప్లేస్​ను మరింత పక్కా చేసుకున్నాడు. అందరూ ఫెయిలైన చోట అతడు మాత్రం ద్విశతకంతో చెలరేగాడు. దీంతో జైస్వాల్​ను ఫ్యాన్స్ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. దీనిపై భారత మాజీ ఓపెనర్ గంభీర్ రియాక్ట్ అయ్యాడు. జైస్వాల్​ను హీరోను చేయొద్దన్నాడు.

జైస్వాల్​ను అనవసరంగా హీరోను చేయొద్దని.. అతడ్ని తన ఆట తనను ఆడుకోనివ్వాలని కోరాడు గంభీర్. యశస్వి సాధించిన ఘనతలను ఎక్కువ చేసి చూపించడం వల్ల అతడి మీద ఒత్తిడి పెరుగుతుందని గౌతీ హెచ్చరించాడు. ‘ఇంగ్లండ్​తో రెండో టెస్టులో డబుల్ సెంచరీ బాదిన జైస్వాల్​కు కంగ్రాట్స్. అతడ్ని తన ఆట తనను ఆడుకోనివ్వండి. లేకపోతే అనవసరంగా ఒత్తిడి పెరిగి న్యాచురల్ గేమ్ దెబ్బ తింటుంది. గతంలోనూ ఇలా మీడియా కొందరు ఆటగాళ్ల ఘనతలను చాలా ఎక్కువ చేసి చూపించింది. వారికి ట్యాగ్​లు ఇచ్చి ప్రెజర్ పెంచింది. దీంతో ఎక్స్​పెక్టేషన్స్​ను రీచ్ కాలేక కెరీర్​లు ఇబ్బందుల్లో పడ్డాయి’ అని గంభీర్ గుర్తుచేశాడు. జైస్వాల్​ను హీరో చేయకుండా అలాగే వదిలేస్తే అతడు మరింత స్వేచ్ఛగా తన న్యాచురల్ గేమ్ ఆడతాడని గౌతీ సూచించాడు.

వైజాగ్ టెస్టులో శ్రేయస్ అయ్యర్, శుబ్​మన్ గిల్ ఆడిన తీరు మీదా గంభీర్ స్పందించాడు. గిల్, అయ్యర్ తమ ఇన్నింగ్స్​లను బాగానే స్టార్ట్ చేసినా భారీ స్కోర్లు చేయలేకపోయారని.. వాళ్లు గాడిలో పడేందుకు కొంత టైమ్ పడుతుందని పేర్కొన్నాడు. వాళ్లిద్దరూ క్వాలిటీ బ్యాటర్స్ అని.. అయితే టీమ్​లో సెటిల్ అయ్యేందుకు వారికి కొంచెం సమయం ఇవ్వాలని తెలిపాడు. గిల్, అయ్యర్​లు గతంలోనూ ఇలాగే పుంజుకున్నారని.. అందుకే ఇంకా టీమిండియాకు ఆడుతున్నారని గంభీర్ వివరించాడు. జైస్వాల్​పై గౌతీ చేసిన వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. గంభీర్ చెప్పింది కరెక్ట్ అని.. ఎక్కువ హైప్ ఇస్తే జైస్వాల్ మీద ప్రెజర్ పెరిగే ప్రమాదం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. జైస్వాల్​ను హీరో చేయొద్దంటూ గంభీర్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి