iDreamPost

Yashasvi Jaiswal: జైస్వాల్ సూపర్ సెంచరీ.. దీన్ని చూసైనా నేర్చుకోవాలి!

  • Published Feb 02, 2024 | 1:31 PMUpdated Feb 02, 2024 | 1:44 PM

వైజాగ్ టెస్ట్​లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ బజ్​బాల్​ క్రికెట్​కు తనదైన స్టైల్​లో కౌంటర్ ఇచ్చిపడేశాడు.

వైజాగ్ టెస్ట్​లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ బజ్​బాల్​ క్రికెట్​కు తనదైన స్టైల్​లో కౌంటర్ ఇచ్చిపడేశాడు.

  • Published Feb 02, 2024 | 1:31 PMUpdated Feb 02, 2024 | 1:44 PM
Yashasvi Jaiswal: జైస్వాల్ సూపర్ సెంచరీ.. దీన్ని చూసైనా నేర్చుకోవాలి!

ఇంగ్లండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెలరేగిపోయాడు. వైజాగ్ టెస్టులో ఇంగ్లీష్ టీమ్​కు చుక్కలు చూపిస్తున్నాడు. అపోజిషన్ టీమ్​ బజ్​బాల్​ క్రికెట్​కు యష్​బాల్​ ఫార్ములాతో దిమ్మతిరిగేలా చేశాడు. 151 బంతుల్లో సెంచరీ మార్క్​ను అందుకున్నాడు. భారీ సిక్స్​తో ఈ మైల్​స్టోన్​ను అందుకోవడం విశేషం. ఇది అతడి కెరీర్​లో రెండో సెంచరీ కావడం విశేషం. ఇంగ్లండ్​పై అతడికి ఇది మెయిడిన్ సెంచరీ. కెప్టెన్ రోహిత్ శర్మ (14)తో పాటు ఫస్ట్ డౌన్​లో ఆడిన శుబ్​మన్ గిల్ (34) త్వరగానే ఔటైనా జైస్వాల్ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. మొదట్లో పిచ్ పేస్ బౌలింగ్​కు అనుకూలిస్తుండటంతో నెమ్మదిగా ఆడాడు. సింగిల్స్, డబుల్స్​తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ క్రీజులో నిలదొక్కుకోవడం మీద ఫోకస్ చేశాడు.

వికెట్ నుంచి పేస్​కు మద్దతు లభిస్తుండటంతో ఇంగ్లండ్ వెటరన్ సీమర్ జేమ్స్ అండర్సన్ బాగా బౌలింగ్ చేశాడు. పర్ఫెక్ట్ లెంగ్త్​లో బంతుల్ని విసురుతూ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. మధ్యమధ్యలో స్వింగ్ డెలివరీస్​తోనూ వాళ్లను పరీక్షించాడు. ఈ క్రమంలో రోహిత్ స్పిన్నర్ బషీర్​కు చిక్కగా.. అండర్సన్ బౌలింగ్​లో గిల్ ఔట్ అయ్యాడు. అయినా పట్టుదలతో ఆడిన జైస్వాల్.. ఇన్నింగ్స్​ను ముందుకు తీసుకెళ్లాడు. రోహిత్​తో తొలి వికెట్​కు 40 పరుగులు జోడించిన జైస్వాల్, గిల్​తో రెండో వికెట్​కు 49 పరుగులు జోడించాడు. అనంతరం శ్రేయస్ అయ్యర్ (27) తోడ్పాటు అందించడంతో స్కోరును 150 దాటించాడు.

ఫస్ట్ ఇన్నింగ్స్​లో జైస్వాల్ చాలా బాధ్యతాయుతంగా ఆడాడు. చెత్త బంతుల్ని మాత్రమే బౌండరీకి తరలిస్తూ వికెట్​ను కాపాడుకున్నాడు. అతడి ఇన్నింగ్స్​లో 11 బౌండరీలతో పాటు 2 భారీ సిక్సులు ఉన్నాయి. జైస్వాల్ ఆడుతున్న తీరును సోషల్ మీడియాలో నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. ఇలా ఆడితే అతడికి తిరుగుండదని చెబుతున్నారు. టీమ్​లో ఉన్న మిగతా యంగ్​స్టర్స్ టెస్టుల్లో ఎలా ఆడాలనేది యశస్వీని చూసి నేర్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం భారత్ 52 ఓవర్లలో 3 వికెట్లకు 185 పరుగులతో ఉంది. జైస్వాల్ సెంచరీ తర్వాత అయ్యర్ ఔట్ అయ్యాడు. టీమిండియా భారీ స్కోరు సాధించాలంటే అది జైస్వాల్​తోనే సాధ్యం. అతడు ఈ సెంచరీని డబుల్ సెంచరీగా మలిస్తే రోహిత్ సేనకు తిరుగుండదు. మరి.. జైస్వాల్ సూపర్ సెంచరీపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Rohit Sharma: ఆటగాడిగా, కెప్టెన్‌గా దారుణంగా విఫలం! రోహిత్‌ శర్మకు ఏమైంది?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి