iDreamPost

Shubman Gill: గిల్ సూపర్ సెంచరీ.. ఒక్క ఇన్నింగ్స్​తో అన్ని అవమానాలకు చెక్!

  • Published Feb 04, 2024 | 1:17 PMUpdated Feb 04, 2024 | 1:26 PM

టీమిండియా యంగ్​ బ్యాటర్ శుబ్​మన్ గిల్ అన్ని అనుమానాలు, అవమానాలకు చెక్ పెట్టాడు. తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు.

టీమిండియా యంగ్​ బ్యాటర్ శుబ్​మన్ గిల్ అన్ని అనుమానాలు, అవమానాలకు చెక్ పెట్టాడు. తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు.

  • Published Feb 04, 2024 | 1:17 PMUpdated Feb 04, 2024 | 1:26 PM
Shubman Gill: గిల్ సూపర్ సెంచరీ.. ఒక్క ఇన్నింగ్స్​తో అన్ని అవమానాలకు చెక్!

టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్ మరోమారు సత్తా చాటాడు. తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. ఇంగ్లండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో సూపర్బ్ సెంచరీతో చెలరేగాడు. భారత జట్టు ఫ్యూచర్ స్టార్ తానేనని ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నాడు. టెస్టులకు పనికిరాడు.. అతడ్ని వన్డేలకు మాత్రమే పరిమితం చేయండి అంటూ వచ్చిన విమర్శలకు సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడు. అనవసరంగా కంటిన్యూ చేస్తున్నారు.. టీమ్​లో నుంచి తీసేయండి అనే కామెంట్లకు బ్యాట్​తోనే సమాధానం చెప్పాడు గిల్. వైజాగ్ టెస్టులో రెండో ఇన్నింగ్స్​లో 132 బంతుల్లో సెంచరీ మార్క్​ను అందుకున్నాడు. గిల్ ఇన్నింగ్స్​లో 11 ఫోర్లతో పాటు 2 భారీ సిక్సులు ఉన్నాయి.

టెస్టుల్లో గిల్​కు ఇది మూడో సెంచరీ. స్వదేశంలో ఇది రెండో శతకం కాగా.. మూడో నంబర్​లో బాదిన మొదటి సెంచరీ కావడం గమనార్హం. మిగిలిన బ్యాటర్లు అందరూ ఫెయిలైన చోట గిల్ ఫెంటాస్టిక్ నాక్​తో టీమ్​కు భారీ లీడ్ అందించాడు. ఒక ఎండ్​లో మిగిలిన బ్యాటర్లు అందరూ ఔట్ అవుతున్నా మరో ఎండ్​లో శుబ్​మన్ పాతుకుపోయాడు. ఎక్కువ డాట్స్ బాల్స్ కాకుండా చాలా బాగా స్ట్రయిక్ రొటేట్ చేశాడు. గ్యాప్స్​లోకి బాల్స్​ను తరలిస్తూ.. వీలు కుదిరినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఇంగ్లండ్​ను డిఫెన్స్​లోకి నెట్టాడు. అందుకే ఇది స్పెషల్ ఇన్నింగ్స్​ అని చెప్పొచ్చు.

శుబ్​మన్ గిల్ కూడా ఔట్ అయితే భారత్ మరింత ప్రమాదంలో పడేది. అయితే ఈ ఇన్నింగ్స్​లో అతడికి లక్ కూడా కాస్త కలిసొచ్చింది. శుబ్​మన్ ఇచ్చిన క్యాచుల్ని ఇంగ్లీష్ ఫీల్డర్లు వదిలేయడం, ఎల్బీడబ్ల్యూ నిర్ణయంలో అంపైర్స్ కాల్ కలసిరావడంతో బతికిపోయాడు. ప్రస్తుతం భారత్ 4 వికెట్లకు 203 పరుగులతో ఉంది. గిల్​తో పాటు అక్షర్ పటేల్ (33 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. టీమ్ ఇప్పుడు 346 పరుగుల లీడ్​తో ఉంది. వీళ్లిద్దరూ ఇలాగే ఆడితే ఆధిక్యం సులువుగా 450 దాటుతుంది. మరి.. గిల్ సెంచరీపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: IND vs ENG: టీమిండియాకు గుడ్ న్యూస్.. మూడో టెస్టు కోసం సరైనోడు దిగుతున్నాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి