iDreamPost

IND vs ENG: గిల్ అరుదైన ఘనత.. సచిన్, కోహ్లీ సరసన చోటు!

  • Published Feb 04, 2024 | 4:49 PMUpdated Feb 04, 2024 | 4:49 PM

టీమిండియా యంగ్​ బ్యాటర్ శుబ్​మన్ గిల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఏకంగా లెజెండ్ సచిన్ టెండూల్కర్​తో పాటు విరాట్ కోహ్లీ సరసన చోటు దక్కించుకున్నాడు.

టీమిండియా యంగ్​ బ్యాటర్ శుబ్​మన్ గిల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఏకంగా లెజెండ్ సచిన్ టెండూల్కర్​తో పాటు విరాట్ కోహ్లీ సరసన చోటు దక్కించుకున్నాడు.

  • Published Feb 04, 2024 | 4:49 PMUpdated Feb 04, 2024 | 4:49 PM
IND vs ENG: గిల్ అరుదైన ఘనత.. సచిన్, కోహ్లీ సరసన చోటు!

భారత క్రికెట్​లో అతి తక్కువ టైమ్​లో స్టార్ ప్లేయర్​గా పేరు తెచ్చుకున్న వారిలో శుబ్​మన్ గిల్ ఒకడు. 24 ఏళ్ల ఈ యంగ్ బ్యాటర్ అన్ని ఫార్మాట్లలోనూ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2022-23 సీజన్​లో అతడి బ్యాట్ ఒక రేంజ్​లో గర్జించింది. అందుకే బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్​గా అతడికి పాలీ ఉమ్రిగర్ అవార్డు ఇచ్చి సత్కరించింది బీసీసీఐ. అయితే వన్డేల్లో బాగా ఆడుతున్న గిల్.. టెస్టుల్లో వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. దీంతో అతడ్ని టీమ్​లో నుంచి తీసేయాలనే డిమాండ్లు పెరిగాయి. ఫామ్​లో లేడని, ఎన్ని ఛాన్సులు ఇచ్చినా విఫలమవుతున్నాడని, జట్టులో అవసరమా? అనే ప్రశ్నలు వినిపించాయి. అయితే ఒక్క ఇన్నింగ్స్​తో వీటన్నింటికీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు గిల్. ఇంగ్లండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో సూపర్బ్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ శతకంతో లెజెండ్ సచిన్ టెండూల్కర్​తో పాటు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరసన చోటు దక్కించుకున్నాడు.

విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీ బాదాడు శుబ్​మన్ గిల్. 147 బంతులు ఎదుర్కొన్న యంగ్ బ్యాటర్.. 11 బౌండరీలు, 2 సిక్సుల సాయంతో 104 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (13), యశస్వి జైస్వాల్ (17) తక్కువ స్కోర్లకు వెనుదిరిగిన వేళ.. క్రీజులోకి వచ్చిన శుబ్​మన్ తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. క్రీజులో సెటిల్ అయ్యేందుకు కాస్త టైమ్ తీసుకున్నాడు. ఆ తర్వాత సింగిల్స్, డబుల్స్​తో స్ట్రయిక్ రొటేషన్ చేస్తూ లూజ్ బాల్స్​ను బౌండరీలకు తరలించాడు. శ్రేయస్ అయ్యర్​ (29) ఔటయ్యాక ఇన్నింగ్స్​ను ముందుకు నడిపించే బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నాడు గిల్. అక్షర్ పటేల్ (45)తో కలసి స్కోరును 200 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో 130 బంతుల్లో సెంచరీ మార్క్​ను అందుకున్నాడు. తద్వారా 24 ఏళ్ల వయసులో 10 సెంచరీలు బాదిన మూడో భారత బ్యాటర్​గా నిలిచాడు.

24 ఏళ్ల వయసులో 10 ఇంటర్నేషనల్ సెంచరీలు కొట్టిన ప్లేయర్ల లిస్టులో గిల్ మూడో ప్లేసులో నిలిచాడు. అతడి కంటే ముందు సచిన్, కోహ్లీ ఈ ఘనత అందుకున్నారు. దీంతో గిల్​ను భారత అభిమానులు మెచ్చుకుంటున్నారు. టీమిండియా ఫ్యూచర్ సేఫ్​గా ఉందని.. శుబ్​మన్ జట్టును ముందుండి నడిపిస్తాడని అంటున్నారు. సచిన్, కోహ్లీలు తమ జమానాలో గ్రేట్ బ్యాటర్లుగా పేరు తెచ్చుకున్నారని.. గిల్ కూడా వారి బాటలో నడుస్తున్నాడని చెప్పేందుకు ఈ రికార్డే సాక్ష్యమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గిల్ ఉన్న ఫామ్​, అతడి ఫిట్​నెస్​, మ్యాచ్​ మ్యాచ్​కు ఇంప్రూవ్​మెంట్ అవుతున్న తీరు, అతడి టెంప్రమెంట్ చూస్తుంటే ముచ్చటేస్తోందని చెబుతున్నారు. గిల్ ఇదే తరహాలో తన జోరును కొనసాగించాలని కోరుకుంటున్నారు. మరి.. సచిన్, కోహ్లీ సరసన గిల్ చోటు దక్కించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి