iDreamPost

Shreyas Iyer: అయ్యర్​కు చివరి మూడు టెస్టులకు నో ఛాన్స్.. పక్కన పెట్టడానికి కారణం?

  • Published Feb 10, 2024 | 7:25 PMUpdated Feb 10, 2024 | 7:25 PM

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్​ గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లండ్​తో జరుగుతున్న చివరి మూడు టెస్టులకు ప్రకటించిన స్క్వాడ్​లో అయ్యర్​కు చోటు కల్పించలేదు.

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్​ గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లండ్​తో జరుగుతున్న చివరి మూడు టెస్టులకు ప్రకటించిన స్క్వాడ్​లో అయ్యర్​కు చోటు కల్పించలేదు.

  • Published Feb 10, 2024 | 7:25 PMUpdated Feb 10, 2024 | 7:25 PM
Shreyas Iyer: అయ్యర్​కు చివరి మూడు టెస్టులకు నో ఛాన్స్.. పక్కన పెట్టడానికి కారణం?

ఇంగ్లండ్​తో రెండు టెస్టులు ఆడేసిన టీమిండియా.. మూడో మ్యాచ్​కు రెడీ అవుతోంది. రాజ్​కోట్ అతిథ్యం ఇవ్వనున్న మూడో టెస్టుకు ముందు గ్యాప్ దొరకడంతో మన ప్లేయర్లు అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. విశ్రాంతి తీసుకొని వచ్చి మూడో మ్యాచ్​లో బజ్​బాల్ బెండు తీసేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. అయితే సిరీస్​లోని మిగిలిన మూడు టెస్టులకు ఇప్పటిదాకా సెలక్టర్లు టీమ్​ను ప్రకటించకపోవడంతో అందరూ దాని కోసం ఆసక్తిగా ఎదురు చూడసాగారు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ కమ్​బ్యాక్ ఇస్తారా? లేదా? అనే దాని కోసం వెయిట్ చేశారు. ఎట్టకేలకు ఇవాళ టీమ్​ను ప్రకటించిన సెలక్టర్లు జడ్డూ, కేఎల్​ను స్క్వాడ్​లో చేర్చారు. పర్సనల్ రీజన్స్ వల్ల సిరీస్ మొత్తానికి కోహ్లీ దూరమయ్యాడు. అయితే అనూహ్యంగా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్​కు టీమ్​లో చోటు దక్కలేదు.

వైజాగ్​లో జరిగిన రెండో టెస్టు టైమ్​లో వెన్ను నొప్పి తిరగబెట్టడంతో అయ్యర్ కొంత ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడు మిగిలిన సిరీస్​లో ఆడటం అనుమానంగా మారింది. అనుకున్నట్లే సెలక్టర్లు ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కలేదు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. శ్రేయస్ ప్రస్తుతం ఫిట్​గా ఉన్నాడట. మ్యాచ్​లో ఆడేందుకు అతడు సిద్ధంగా ఉన్నాడట. కానీ అతడ్ని కావాలనే తప్పించారని వినికిడి. ఇంజ్యురీ తర్వాత టెస్ట్ టీమ్​లోకి రీఎంట్రీ ఇచ్చిన అయ్యర్ స్కోర్లు 4, 12, 0, 26, 31, 6, 0, 4 నాటౌట్, 35, 13, 27, 29గా ఉన్నాయి. చివరగా 2022లో బంగ్లాదేశ్​తో జరిగిన టెస్ట్ మ్యాచ్​లో అతడు హాఫ్ సెంచరీ బాదాడు. ఆ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో 87 పరుగులు చేసిన అయ్యర్.. రెండో ఇన్నింగ్స్​లో 29 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు.

Not an injury.. They put it aside!

బంగ్లా సిరీస్ తర్వాత ఇప్పటిదాకా అయ్యర్ బ్యాట్ నుంచి కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా రాలేదు. దీంతో ఇంగ్లండ్ సిరీస్​కు ముందు రంజీల్లో ఆడాల్సిందిగా అతడ్ని ఆదేశించింది టీమిండియా మేనేజ్​మెంట్. దీంతో రంజీ ట్రోఫీ-2024లో భాగంగా ఆంధ్రతో జరిగిన మ్యాచ్​లో బరిలోకి దిగాడీ ముంబైకర్. ఆ మ్యాచ్​లో 48 పరుగులు చేయడంతో పాటు 145కు పైగా ఓవర్లు ఫీల్డింగ్ కూడా చేశాడు. దీంతో ఇంగ్లీష్ టీమ్​తో సిరీస్​కు ఫుల్​గా ప్రిపేర్ అయినట్లు కనిపించాడు. కానీ గ్రౌండ్​లో దిగాక మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. మొదటి రెండు టెస్టుల్లో కలిపి 104 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ క్రమంలో తాజాగా ప్రకటించిన భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు.

గాయం కారణంగానే అయ్యర్​ను తీసుకోలేదని చాలా మంది అనుకున్నారు. కానీ పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేని కారణంగా అతడ్ని సెలక్టర్లు పక్కన పెట్టారని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ‘ఇంజ్యురీనా? ఛాన్సే లేదు. బెన్ స్టోక్స్​ను అయ్యర్ రనౌట్ చేసిన తీరు గుర్తుంది కదా! అతడు కంప్లీట్​గా ఫిట్​గా ఉన్నాడు. అయితే బ్యాటర్​గా మాత్రం టీమ్​కు ఏమాత్రం ఉపయోగపడటం లేదు’ అని ఓ స్పోర్ట్స్ వెబ్​సైట్​తో మాట్లాడుతూ ఒక బీసీసీఐ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. టీమ్ మేనేజ్​మెంట్ అతడు రన్స్ చేయాలని కోరుకుంటోందని.. కానీ అలా జరగడం లేదని ఆ ఆఫీసర్ తెలిపారు. అందుకు తగ్గట్లే టీమ్ ప్రకటన సమయంలో కోహ్లీ, జడ్డూ, రాహుల్ గురించి ప్రస్తావించిన బీసీసీఐ.. అయ్యర్ దూరం కావడానికి గల కారణాలను మాత్రం చెప్పలేదు. మరి.. అయ్యర్​ను సెలక్ట్ చేయకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి