iDreamPost

Sarfaraz Khan: అఫీషియల్‌: టీమిండియాలోకి సర్ఫరాజ్‌! అతడితో పాటు మరో ఇద్దరు యంగ్​స్టర్స్..

  • Published Jan 29, 2024 | 5:07 PMUpdated Jan 29, 2024 | 5:10 PM

ఎన్నాళ్లుగానో ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్​ ఖాన్​ డ్రీమ్ ఎట్టకేలకు తీరింది. డొమెస్టిక్ క్రికెట్​లో దుమ్మురేపుతున్న ఈ యంగ్ బ్యాటర్​కు గోల్డెన్ ఛాన్స్ దక్కింది.

ఎన్నాళ్లుగానో ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్​ ఖాన్​ డ్రీమ్ ఎట్టకేలకు తీరింది. డొమెస్టిక్ క్రికెట్​లో దుమ్మురేపుతున్న ఈ యంగ్ బ్యాటర్​కు గోల్డెన్ ఛాన్స్ దక్కింది.

  • Published Jan 29, 2024 | 5:07 PMUpdated Jan 29, 2024 | 5:10 PM
Sarfaraz Khan: అఫీషియల్‌: టీమిండియాలోకి సర్ఫరాజ్‌! అతడితో పాటు మరో ఇద్దరు యంగ్​స్టర్స్..

ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్​తో జరిగిన తొలి టెస్ట్​లో ఓటమితో టీమిండియా డీలా పడింది. ఈజీగా నెగ్గుతారనుకుంటే మ్యాచ్​ను అప్పనంగా ఇంగ్లీష్ టీమ్ చేతుల్లో పెట్టారంటూ భారత ప్లేయర్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు. మొదిటి రెండ్రోజులు మ్యాచ్​ మీద పట్టు సాధించి ఆ తర్వాత అనూహ్యంగా వదిలేయడం, ప్రత్యర్థి కౌంటర్​ అటాక్​కు తలొగ్గడంతో అభిమానులు కూడా సీరియస్ అవుతున్నారు. ఇదేం ఆటతీరు.. అపోజిషన్ టీమ్​కు తగ్గట్లు అటాకింగ్ మోడ్​లో ఆడకుండా అటు బౌలింగ్​, ఫీల్డింగ్​తో పాటు ఇటు బ్యాటింగ్​లోనూ డిఫెన్సివ్ అప్రోచ్​తో ఓటమిని మూటగట్టుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో రెండో టెస్టులో భారత్ ఎలా ఆడుతుందోననేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో టీమిండియాకు షాక్ తగిలింది. రెండో మ్యాచ్​కు స్టార్ ప్లేయర్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు.

జడేజా, రాహుల్​ రెండో టెస్టులో ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది. వారి ప్లేసులో ముగ్గురు యంగ్​స్టర్స్​ను టీమ్​లోకి తీసుకుంది. డొమెస్టిక్ క్రికెట్​లో బ్యాట్​తో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ ఖాన్​తో పాటు సౌరభ్ కుమార్, స్పిన్ ఆల్​రౌండర్ వాషింగ్టన్ సుందర్​ను జట్టులోకి తీసుకున్నామని బీసీసీఐ వెల్లడించింది. ఇది సర్ఫరాజ్​కు సూపర్బ్ న్యూస్ అనే చెప్పాలి. దేశవాళ్లీల్లో ఎంత అద్భుతంగా ఆడుతున్నా ప్లేస్ దక్కకపోవడం.. ఒక్క అవకాశం ఇస్తే సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్న అతడికి ఇది బంపరాఫర్. ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మంచి ఫామ్​లో ఉన్న జడ్డూ, రాహుల్ మిస్సవడం బాధాకరమని.. అయితే సర్ఫరాజ్ ఖాన్ లాంటి ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాడికి అవకాశం దక్కడం గొప్ప విషయమని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రెండో టెస్టులో సర్ఫరాజ్ ఎంట్రీ ఇవ్వనుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి