iDreamPost

IND vs ENG: భారత టీమ్ విజయాల వెనుక అదృశ్య శక్తి.. ఈ వ్యక్తి గురించి తెలుసా?

  • Published Feb 19, 2024 | 4:01 PMUpdated Feb 19, 2024 | 4:01 PM

భారత జట్టు వరుసగా సాధిస్తున్న అద్భుతమైన విజయాల వెనుక ఓ కనిపించని శక్తి ఉంది. ఆ పవర్ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

భారత జట్టు వరుసగా సాధిస్తున్న అద్భుతమైన విజయాల వెనుక ఓ కనిపించని శక్తి ఉంది. ఆ పవర్ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Feb 19, 2024 | 4:01 PMUpdated Feb 19, 2024 | 4:01 PM
IND vs ENG: భారత టీమ్ విజయాల వెనుక అదృశ్య శక్తి.. ఈ వ్యక్తి గురించి తెలుసా?

భారత క్రికెట్ జట్టు ఇటీవల వరుస విజయాలతో దూసుకెళ్తోంది. గతేడాది ఆసియా కప్ నుంచి మొదలుకొని ఆ తర్వాత ఆస్ట్రేలియా వన్డే సిరీస్, వన్డే వరల్డ్ కప్-2023, ఆసీస్​తో టీ20 సిరీస్.. అలాగే సౌతాఫ్రికా టూర్, రీసెంట్​గా ఆఫ్ఘానిస్థాన్​తో సిరీస్ వరకు మన టీమ్ పట్టిందల్లా బంగారమే అయింది. ఒక్క ప్రపంచ కప్ ఫైనల్ ఓటమిని మినహాయిస్తే మిగిలిన ఏ సిరీస్​లోనూ, టోర్నీలోనూ భారత్​కు ఎదురే లేదు. ప్రస్తుతం ఇంగ్లండ్​తో జరుగుతున్న టెస్టు సిరీస్​లోనూ రోహిత్ సేన ఫుల్ డామినేషన్ చూపిస్తోంది. ఐదు టెస్టుల ఈ సిరీస్​లో మన టీమ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇలా గత కొంత కాలంగా భారత్ సాధిస్తున్న విజయాల్లో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్​ది కీలక పాత్ర అని చెప్పొచ్చు. అయితే జట్టును వెనుక ఉండి నడిపిస్తున్నాడో అన్​సంగ్ హీరో. ఆ వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియాకు చాలా మంది అన్​సంగ్ హీరోలు ఉన్నారు. అందులో మొదటగా రాజీవ్ కుమార్ గురించి చెప్పుకోవాలి. అతడ్ని అందరూ రాజీవ్ భాయ్ అని పిలుస్తారు. ఆయన మన జట్టుకు మజిల్ డాక్టర్​గా సేవలు అందిస్తున్నారు. నెట్స్​లో ప్రాక్టీస్ చేస్తున్న టైమ్​లో గానీ లేదా మ్యాచ్ ఆడుతున్నప్పుడు గానీ ప్లేయర్లు గాయపడితే వారికి ట్రీట్​మెంట్ అందించి ఫిట్​గా ఉంచడం ఆయన పని. బౌలర్లు, బ్యాటర్లకు కండరాలు త్వరగా పట్టేస్తుంటాయి. ఎంత ఫిట్​గా ఉన్న ఆటగాడికైనా ఎక్కువ సేపు బౌలింగ్ వేస్తే లేదా క్రీజులో అధిక సమయం గడిపితే కండరాలు పట్టేస్తాయి. అలాంటప్పుడు మ్యాచ్​లో కంటిన్యూ అవడం కష్టం. ఈ టైమ్​లో రంగంలోకి దిగుతారు రాజీవ్. సపోర్ట్​ స్టాఫ్​తో కలసి ఆటగాళ్లకు ట్రీట్​మెంట్ అందిస్తారు. మజిల్స్​ను ఫ్రీ చేసి ప్లేయర్లను మళ్లీ గ్రౌండ్​లోకి దింపుతారు. అతడి కృషి వల్లే భారత ఫాస్ట్ బౌలర్లు, బ్యాటర్లు వేగంగా కోలుకొని మైదానంలో తమ ఆటతీరుతో అదరగొడుతున్నారు. కానీ ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇలా భారత జట్టు కోసం అహర్నిషలు కృషి చేస్తున్నా రాజీవ్​లా వెలుగులోకి రాని మరికొంత మంది అన్​సంగ్ హీరోలు ఉన్నారు.

టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ గురించి చాలా మందికి తెలుసు. కానీ సోహమ్ దేశాయ్, ఎస్ రజినీకాంత్, హరి ప్రసాద్ మోహన్, రిషికేష్​ ఉపాధ్యాయ, అరుణ్ కనడే, రాఘవేంద్ర ద్విగి, నువాన్ సెనివిరత్నే గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. వీరిలో సోహామ్ దేశాయ్ స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్​గా ఉన్నారు. ఆటగాళ్ల ఇంజ్యురీలు, ఫిట్​నెస్ మొదలైనవి ఈయన పర్యవేక్షిస్తారు. గాయాల బారిన పడిన భారత క్రికెటర్లు తిరిగి టీమ్​లోకి వచ్చే వరకు వాళ్ల రీహాబిలిటేషన్​ను ఎస్ రజినీకాంత్ చూసుకుంటారు. ప్రతి మ్యాచ్​ వీడియోలను, డేటాను అనాలసిస్ చేసే బాధ్యతలను హరి ప్రసాద్ నిర్వర్తిస్తున్నారు. మన జట్టుకు ఈయనే వీడియో అండ్ డేటా అనలిస్ట్​.

భారత టీమ్​కు లాజిస్టిక్స్​ మేనేజర్​గా ఉన్నారు రిషికేష్ ఉపాధ్యాయ. ప్రయాణ టికెట్లు, సామాగ్రి, యూనిఫామ్స్​తో పాటు క్రికెటర్ల ఫ్యామిలీస్​కు కావాల్సిన ఏర్పాట్లను ఈయనే దగ్గర ఉండి చూసుకుంటారు. ఆటగాళ్ల ఫిట్​నెస్​ను చూసుకోవడానికి అనురన్ కనడే రూపంలో మరో వ్యక్తి టీమ్​తో జర్నీ చేస్తున్నారు. ఇక, బ్యాటర్లకు ప్రాక్టీస్ కోసం త్రోడౌన్ ఎక్స్​పర్ట్​గా ఉండి సేవలు అందిస్తున్నారు రాఘవేంద్ర ద్విగి. మన టీమ్​తో శ్రీలంకకు చెందిన ఒక వ్యక్తి కూడా ట్రావెల్ చేస్తున్నారు. ఆయనే నువాన్ సెనివిరత్నే. స్పిన్నర్ అయిన నువాన్.. భారత బ్యాటర్లకు లెఫ్టార్మ్ స్పిన్​ను ఎదుర్కొనే సలహాలు, సూచనలు అందిస్తున్నారు. మరి.. భారత్ విజయాల వెనుక దాగిన అన్​సంగ్ హీరోల గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Rohit Sharma: దాదా, ధోని, కోహ్లీ రికార్డ్స్‌ గల్లంతు! టెస్ట్‌ కెప్టెన్‌గా రోహిత్‌ కొత్త చరిత్ర..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి