iDreamPost

వీడియో: కుల్దీప్ స్పిన్ మ్యాజిక్​.. బిత్తరపోయిన ఇంగ్లండ్ బ్యాటర్!

  • Published Mar 07, 2024 | 1:54 PMUpdated Mar 07, 2024 | 3:12 PM

ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్​కు చుక్కలు చూపిస్తున్నాడు మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్. తన స్పిన్ మ్యాజిక్​తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్నాడు.

ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్​కు చుక్కలు చూపిస్తున్నాడు మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్. తన స్పిన్ మ్యాజిక్​తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్నాడు.

  • Published Mar 07, 2024 | 1:54 PMUpdated Mar 07, 2024 | 3:12 PM
వీడియో: కుల్దీప్ స్పిన్ మ్యాజిక్​.. బిత్తరపోయిన ఇంగ్లండ్ బ్యాటర్!

ధర్మశాల ఆతిథ్యం ఇస్తున్న ఆఖరి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లతో ఆడుకుంటున్నాడు కుల్దీప్ యాదవ్. ఈ మణికట్టు మాంత్రికుడు తన స్పిన్ వేరియేషన్స్​తో ప్రత్యర్థి జట్టును వణికిస్తున్నాడు. అతడి దెబ్బకు క్రీజులో నిలబడాలంటే బ్యాట్స్​మెన్ భయపడుతున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్​లో ఇప్పటిదాకా ఇంగ్లీష్ టీమ్ 4 వికెట్లు కోల్పోగా.. ఆ నాలుగూ కుల్దీప్​కే దక్కాయి. దీన్ని బట్టే అతడి బౌలింగ్​ ఏ రేంజ్​లో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన అన్ని వికెట్ల కంటే జాక్ క్రాలీ (79)ని అతడు ఔట్ చేసిన తీరు సూపర్బ్ అనే చెప్పాలి. స్పిన్ అంటే ఇది అనే లాంటి ఓ ఫెంటాస్టిక్ బాల్​తో క్రీజులో పాతుకుపోయిన క్రాలీని వెనక్కి పంపాడు కుల్దీప్.

కుల్దీప్ వేసిన బాల్ ఆఫ్ స్టంప్​కు దూరంగా పడింది. దీంతో దాన్ని భారీ షాట్ కొడదామనుకున్నాడు క్రాలీ. కానీ పడిన వెంటనే గిర్రున తిరిగిన బాల్ అతడి బ్యాట్​ను దాటుకొని లోపలకు టర్న్ అయి లెగ్ స్టంప్​ను గిరాటేసింది. అప్పటికే కుల్దీప్ బౌలింగ్​లో ఒకసారి ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించున్నాడు క్రాలీ. అతడి బౌలింగ్​లో క్రాలీ బ్యాట్​కు తగిలి ఎడ్జ్ అయిన బంతిని సర్ఫరాజ్​ ఖాన్ క్యాచ్ పట్టేశాడు. కానీ అతడు ఎంత మొత్తుకున్నా కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఎవరూ రివ్యూ తీసుకోవడానికి సపోర్ట్ చేయలేదు. అయితే రీప్లేలో క్రాలీ క్లియర్​ ఔట్ అని తేలింది. దీంతో సర్ఫరాజ్ నిరాశతో ఎటూ పాలుపోక మౌనంగా ఉండిపోయాడు. అయితే ఈసారి మాత్రం అతడ్ని వదల్లేదు కుల్దీప్. ఏకంగా క్లీన్ బౌల్డ్ చేసి పడేశాడు. షాట్ కొట్టడం కాదు.. బాల్​ను టచ్ కూడా చేయలేక కుల్దీప్ స్పిన్ వలలో పడి బిత్తరపోయాడు క్రాలీ. అసలు తాను ఎలా ఔట్ అయ్యాను, బాల్​ను ఎలా మిస్సయ్యానో తెలియక షాకయ్యాడు.

క్రాలీ వికెట్ తీసిన కుల్దీప్.. లంచ్ తర్వాత జానీ బెయిర్​స్టో (29)ను పెవిలియన్​కు పంపాడు. ఒకవైపు పరుగులు రాకపోవడం, మరోవైపు వరుస విరామాల్లో వికెట్లు పడటంతో ఇంగ్లండ్​ పీకల్లోతు కష్టాల్లో పడింది. బాల్ టర్న్​తో పాటు బౌన్స్​ కూడా అవుతుండటంతో స్పిన్నర్లను ముఖ్యంగా కుల్దీప్​ను ఫేస్ చేయాలంటేనే వాళ్లు భయపడుతున్నారు. ఇక, క్రాలీ వికెట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ బాల్ ఏకంగా 10.9 డిగ్రీలు టర్న్ అయింది. దీన్ని చూసిన ఫ్యాన్స్.. ఇది భయ్యా స్పిన్ అంటే అని అంటున్నారు. భలే తిరిగింది బాల్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. క్రాలీని కుల్దీప్ ఔట్ చేసిన తీరుపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఓలీ పోప్‌ ఫన్నీ ఔట్‌.. అంతా ధృవ్‌ జురెల్‌ మాయా! చెప్పి మరీ..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి