iDreamPost

Jasprit Bumrah: బ్యాటింగ్​తో ఇంగ్లండ్‌ను భయపెట్టిన బుమ్రా! ముగిసిందనుకుంటే.. మొదలుపెట్టాడు!

  • Published Feb 16, 2024 | 4:00 PMUpdated Feb 16, 2024 | 4:00 PM

రాజ్​కోట్ టెస్టులో ఇంగ్లండ్​ జట్టును భారత పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా భయపెట్టాడు. అయితే ఎప్పటిలా బాల్​తో కాదు.. ఈసారి బ్యాట్​తో వణికించాడు.

రాజ్​కోట్ టెస్టులో ఇంగ్లండ్​ జట్టును భారత పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా భయపెట్టాడు. అయితే ఎప్పటిలా బాల్​తో కాదు.. ఈసారి బ్యాట్​తో వణికించాడు.

  • Published Feb 16, 2024 | 4:00 PMUpdated Feb 16, 2024 | 4:00 PM
Jasprit Bumrah: బ్యాటింగ్​తో ఇంగ్లండ్‌ను భయపెట్టిన బుమ్రా! ముగిసిందనుకుంటే.. మొదలుపెట్టాడు!

భారత్​ను త్వరగా ఆలౌట్ చేద్దామనుకున్న ఇంగ్లండ్ ఆశ నెరవేరలేదు. లోయరార్డర్ ఆటగాళ్లు పట్టుదలతో ఆడటంతో రాజ్​కోట్ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమిండియా 445 పరుగుల భారీ స్కోరు సాధించింది. రెండో రోజు ఆరంభంలోనే కుల్దీప్ యాదవ్ (4), రవీంద్ర జడేజా (112) ఔట్ అవడంతో భారత్​కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అప్పటికి స్కోరు 331/7. ఆ టైమ్​లో మరో వికెట్ పడితే మన జట్టు తక్కువ స్కోరుకే కుప్పుకూలేది. కానీ కొత్త కుర్రాడు ధృవ్ జురెల్ (46), సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (37) మంచి పార్ట్​నర్​షిప్​తో జట్టును ఆదుకున్నారు. వీళ్లు 8వ వికెట్​కు 77 పరుగులు జోచించారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఔట్ అయినా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా పోరాడటం ఆపలేదు.

భారత ఇన్నింగ్స్ ముగిసిందనుకున్న ఇంగ్లండ్​ను మెరుపు బ్యాటింగ్​తో భయపెట్టాడు బుమ్రా. మహ్మద్ సిరాజ్ (3) ఒక ఎండ్​లో బంతుల్ని డిఫెన్స్ చేస్తూ అతడికి చక్కటి సహకారం అందించాడు. జస్​ప్రీత్ 3 ఫోర్లు, ఒక భారీ సిక్స్​తో 26 పరుగులు చేశాడు. వీళ్లిద్దరూ 10వ వికెట్​కు 30 పరుగులు జోడించారు. అందులో బుమ్రా బ్యాట్ నుంచే 26 పరుగులు వచ్చాయి. మంచి బంతుల్ని సాలిడ్ డిఫెన్స్​తో నిలువరించిన అతడు.. చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించాడు. మామూలుగా బాల్​తో ప్రత్యర్థి జట్లను వణికించే బుమ్రా.. ఈ మ్యాచ్​లో తన బ్యాట్ తడాఖా చూపించాడు.

బుమ్రా-సిరాజ్ నెలకొల్పింది చిన్న పార్ట్​నర్​షిప్ కావొచ్చు.. కానీ ఈ 30 నుంచి 40 పరుగులే ఆధిక్యం సాధించడంలో, మ్యాచ్​ను గెలుచుకోవడంలోనూ ఎంతో కీలకపాత్ర పోషిస్తాయి. ఆఖర్లో టెయిలెండర్ల నుంచి ఇన్ని పరుగులు వస్తాయిని అటు భారత టీమ్ మేనేజ్​మెంట్.. ఇటు ఇంగ్లండ్ జట్టు గానీ ఊహించలేదు. బుమ్రా వల్ల భారత్ 450 పరుగులకు దగ్గరగా రాగలిగింది. ఇది మెంటల్​గా మనకు బూస్ట్ ఇస్తే.. స్టోక్స్ సేనకు భారీ స్కోరు అనే ఒత్తిడిని కలిగిస్తుంది. అయితే, ఇంగ్లండ్​పై చెలరేగడం బుమ్రాకు ఇదే తొలిసారి కాదు. గతంలో వాళ్ల సొంతగడ్డపై జరిగిన ఓ టెస్ట్​లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్​లో ఒకే ఓవర్​లో ఏకంగా 35 రన్స్ రాబట్టాడు. మళ్లీ అదే టీమ్​పై బ్యాట్​తో చెలరేగాడు. మరి.. బుమ్రా బ్యాటింగ్​పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs ENG వీడియో: సర్ఫరాజ్ ఫ్యామిలీని కలసిన రోహిత్.. నౌషద్ ఖాన్ ఎమోషనల్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి