iDreamPost

IND vs ENG: బుమ్రాను వదలమంటున్న ఇంగ్లండ్ కోచ్.. లెక్క సరిచేస్తామంటూ వార్నింగ్!

  • Published Feb 08, 2024 | 4:56 PMUpdated Feb 08, 2024 | 4:56 PM

టీమిండియా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా ఇప్పుడు భీకర ఫామ్​లో ఉన్నాడు. అవతలి ఉన్నది ఎంతటి బ్యాటర్ అయినా సరే.. బుమ్రా బుల్లెట్ బంతులకు తలొగ్గాల్సిందే అనేలా సిచ్యువేషన్ ఉంది.

టీమిండియా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా ఇప్పుడు భీకర ఫామ్​లో ఉన్నాడు. అవతలి ఉన్నది ఎంతటి బ్యాటర్ అయినా సరే.. బుమ్రా బుల్లెట్ బంతులకు తలొగ్గాల్సిందే అనేలా సిచ్యువేషన్ ఉంది.

  • Published Feb 08, 2024 | 4:56 PMUpdated Feb 08, 2024 | 4:56 PM
IND vs ENG: బుమ్రాను వదలమంటున్న ఇంగ్లండ్ కోచ్.. లెక్క సరిచేస్తామంటూ వార్నింగ్!

బజ్​బాల్​ అంటూ భయపెట్టిన ఇంగ్లండ్​.. ఇప్పుడు భారత్​ను చూసి వణుకుపోతోంది. ముఖ్యంగా ఓ టీమిండియా స్టార్​ను చూసి గడగడలాడుతోంది. అతడితో ఎందుకు రా బాబు అనుకుంటోంది. రోహిత్ సేనపై నెగ్గాలంటే అతడి గండాన్ని దాటాలని.. అందుకోసం స్పెషల్ ప్లాన్స్ కూడా తయారు చేస్తోంది. అతడే పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా. ఇంగ్లీష్ టీమ్​కు కొరకరాని కొయ్యలా మారాడు బుమ్రా. వైజాగ్​ ఆతిథ్యం ఇచ్చిన రెండో టెస్టులో 9 వికెట్లతో ఇంగ్లండ్ ఓటమిని శాసించాడు. అతడు బౌలింగ్​కు వచ్చిన ప్రతి స్పెల్​లోనూ వికెట్లు పడ్డాయి. తొలి మ్యాచ్​లో సెంచరీతో మెరిసిన ఓలీ పాప్​ను బుల్లెట్ లాంటి యార్కర్​తో క్లీన్ ​బౌల్డ్ చేసిన తీరును ఎవరూ మర్చిపోలేరు. ఇంగ్లీష్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్​ను రెండు ఇన్నింగ్స్​ల్లోనూ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో అతడ్ని చూస్తేనే ఆ జట్టు బ్యాటర్లు వణుకుతున్నారు. ఈ తరుణంలో ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బుమ్రాను వదలబోమన్నాడు.

జస్​ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం అంత ఈజీ కాదన్నాడు మెకల్లమ్. అందుకు తమ బ్యాటర్లు మరింత సిద్ధం కావాల్సి ఉంటుందని చెప్పాడు. ‘ఒక బౌలర్​ను ఫేస్ చేయాలంటే అతడిపై లోతుగా రీసెర్చ్ చేయాలి. అతడు ఎలా బౌలింగ్ చేస్తున్నాడు? ఎలాంటి బంతులు వేస్తున్నాడు? అనేది పుస్తకాల్లోనూ, వీడియోల్లోనూ చూస్తే సరిపోదు. బుమ్రా బౌలింగ్​ను ఎలా ఆడాలనేది మాట్లాడుకున్నంత మాత్రాన అయిపోయేది కాదు. అందుకే కఠిన సాధన చేయాలి. మా ప్లేయర్లకు ఈ విషయంపై క్లారిటీ ఉంది. వాళ్లు నా కంటే చాలా బెటర్​గా ఉన్నారు. బుమ్రాను ఫేస్ చేయడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. రాబోయే మ్యాచుల్లో అతడి బౌలింగ్ వ్యూహాలను తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని మెకల్లమ్ చెప్పుకొచ్చాడు. ఈసారి లెక్క సరిచేస్తామంటూ అతడు వార్నింగ్ ఇచ్చాడు.

బుమ్రా బౌలింగ్​పై మెకల్లమ్ ప్రశంసల జల్లులు కూడా కురిపించాడు. అతడు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. ముఖ్యంగా రెండో టెస్టులో అతడి బౌలింగ్ ప్రదర్శన సూపర్ అన్నాడు. బాల్ స్వింగ్ అయితే అతడు చాలా డేంజరస్​గా మారతాడని మెకల్లమ్ పేర్కొన్నాడు. అయితే గత ఏడాదిన్నర కాలంలో తాము బెస్ట్ బౌలింగ్ యూనిట్స్​ను ఎదుర్కొన్నామని గుర్తుచేశాడు. మంచి బౌలర్లకు సరైన కౌంటర్ ఇచ్చేందుకు ఎల్లప్పుడూ తాము రెడీగా ఉంటామని స్పష్టం చేశాడు ఇంగ్లండ్ హెడ్ కోచ్. రెండో టెస్ట్ తర్వాత టైమ్ దొరకడంతో తమ ఆటగాళ్లు రిలాక్స్ అయ్యేందుకు అబుదాబికి వెళ్లారని తెలిపాడు. అక్కడ కుటుంబ సభ్యులతో గడుపుతూనే.. ప్రాక్టీస్​ను కూడా కంటిన్యూ చేస్తున్నామని వివరించాడు. మరి.. బుమ్రాను వదలమంటూ మెకల్లమ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి