iDreamPost
android-app
ios-app

Mayapetika OTT: 11 నెలల తర్వాత OTT లోకి పాయల్ రాజ్‌పుత్ క్రేజీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published May 16, 2024 | 11:40 AMUpdated May 16, 2024 | 11:40 AM

థియేటర్ లో రిలీజ్ అయిన కొద్దీ రోజులకే కొన్ని సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి వచ్చేస్తూ ఉంటాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రం చాలా ఆలస్యంగా ఓటీటీ కి ఎంట్రీ ఇస్తాయి. ఇప్పుడు పాయల్ నటించిన ఓ చిత్రం కూడా ఇలానే ఆలస్యంగా ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తుంది.

థియేటర్ లో రిలీజ్ అయిన కొద్దీ రోజులకే కొన్ని సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి వచ్చేస్తూ ఉంటాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రం చాలా ఆలస్యంగా ఓటీటీ కి ఎంట్రీ ఇస్తాయి. ఇప్పుడు పాయల్ నటించిన ఓ చిత్రం కూడా ఇలానే ఆలస్యంగా ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తుంది.

  • Published May 16, 2024 | 11:40 AMUpdated May 16, 2024 | 11:40 AM
Mayapetika OTT:  11 నెలల తర్వాత OTT లోకి పాయల్ రాజ్‌పుత్ క్రేజీ థ్రిల్లర్..  స్ట్రీమింగ్ ఎక్కడంటే!

కొత్త సినిమా అయినా పాత సినిమా అయినా ఆ సినిమా గురించి ఫ్రెష్ గా బజ్ నడుస్తుంది అంటే చాలు.. దానిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని మూవీ లవర్స్ అంతా కూడా ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం రిలీజ్ అయినా సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీ లలో సందడి చేస్తున్నాయి. పైగా ఆయా సినిమాలకు అప్పుడు లభించని ఆదరణ ఇప్పుడు లభించడం విశేషం. ఇక కొన్ని సినిమాలైతే ఒకేసారి రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ అవ్వడమో లేక కొన్ని నెలల తర్వాత మరొక ఓటీటీ లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఈ కోవకు చెందిందే. ఏకంగా 11 నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా మరేదో కాదు ఆర్ ఎక్స్100 సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన పాయల్ రాజ్ పుత్, బేబీ సినిమాలో నటించిన విరాజ్ అశ్విన్ జంటగా నటించిన సినిమా “మాయ పేటిక”. ఈ సినిమాలో వీరితో పాటు.. సునీల్, హిమజ, యాంకర్ శ్యామల, సిమ్రత్ కౌర్, పృథ్వీరాజ్, శ్రీనివాసరెడ్డి, రజత్ రాఘవ లాంటి వారంతా కూడా ముఖ్య పాత్ర పోషించారు. కాగా ఈ సినిమాకు రమేష్ రాపర్తి దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాను గత ఏడాది జూన్ లో థియేటర్స్ లో రిలీజ్ చేశారు. కానీ అనుకున్న విధంగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఆ తర్వాత ఈ సినిమా ఓటీటీ ఊసు కూడా ఎక్కడ వినిపించలేదు కానీ గత కొంతకాలంగా మాత్రం సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి సెర్చ్ చేసేస్తున్నారు మూవీ లవర్స్. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో మే 16 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. కాబట్టి ఈ సినిమాను చూడాలనుకునే వారు వెంటనే చూసేయండి.

ఇక మాయ పేటిక సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా అన్నిటికంటే కూడా కాస్త డిఫ్ఫరెంట్ గా ఉంటుంది. నిజానికి ఈ సినిమా ఆరు చిన్న కథలను కలిపి ఉంటుంది. ఈ సినిమాలో పాయల్ కు ఒకరు సెల్ ఫోన్ ను గిఫ్ట్ గా ఇస్తారు. ఆ మొబైల్ ఆ ఆరు పాత్రల చేతులు మారుతుంది. ఆ తర్వాత వారి జీవితాలు ఎలా మారాయి.. ముఖ్యంగా ఓ కార్పొరేటర్ జీవితాన్ని ఈ మొబైల్ ఎలా మార్చేసింది.. వాళ్ళ జీవితాలను ఎలా ఎలా తారుమారు అయ్యాయి. ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. అయితే ఈ సినిమా ఆల్రడీ ఆహా ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇప్పుడు ఈటీవీ విన్ లో కూడా ఈ సినిమాను తీసుకుని వచ్చారు మేకర్స్. మరి ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక.. వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి