iDreamPost

India vs Australia: గెలిచారు సరే.. ప్రయోగాల మాటేంటి? టీమ్ మేనేజ్​మెంట్​కు ఎందుకంత భయం?

  • Author singhj Published - 04:25 PM, Mon - 4 December 23

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్​ను భారత్ చేజిక్కించుకుంది. కానీ ఈ సిరీస్​లో ఎన్నో ఆన్సర్స్ లేని క్వశ్చన్స్​ను వదిలేసింది భారత్.

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్​ను భారత్ చేజిక్కించుకుంది. కానీ ఈ సిరీస్​లో ఎన్నో ఆన్సర్స్ లేని క్వశ్చన్స్​ను వదిలేసింది భారత్.

  • Author singhj Published - 04:25 PM, Mon - 4 December 23
India vs Australia: గెలిచారు సరే.. ప్రయోగాల మాటేంటి? టీమ్ మేనేజ్​మెంట్​కు ఎందుకంత భయం?

వరల్డ్ కప్​ ఫైనల్లో ఓటమితో బాధలో ఉన్న అభిమానులకు ఊరట కలిగిస్తూ ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్​ను చేజిక్కించుకుంది భారత్. ఈ సిరీస్​ను 4-1 తేడాతో సొంతం చేసుకుంది టీమిండియా. ఆఖరి మ్యాచ్​లో విజయం కష్టమే అనుకున్నా.. బ్యాటింగ్​లో శ్రేయస్ అయ్యర్, బౌలింగ్​లో అర్ష్​దీప్ సింగ్ చెలరేగి గెలిపించారు. ఈ విజయంతో సౌతాఫ్రికా టూర్​కు మరింత కాన్ఫిడెంట్​గా వెళ్లనుంది మన టీమ్. ప్రపంచ కప్ ముగిసిన నాల్రోజుల్లోనే నిర్వహించిన ఆసీస్​ సిరీస్​లో భారత్​కు ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయి. కెప్టెన్సీ దగ్గర నుంచి అనేక విషయాలు మన టీమ్​కు కలిసొచ్చాయి. టీ20 వరల్డ్ కప్​ ప్రిపరేషన్స్​లో ఉన్న భారత్​కు ఈ సిరీస్ పెద్ద ప్లస్ అనే చెప్పాలి.

కంగారూలతో టీ20 సిరీస్​లో ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా జైస్వాల్ మెరుపు ఆరంభాలు అందిస్తూ సత్తా చాటాడు. రుతురాజ్ ఒక మ్యాచ్​లో సెంచరీ బాది తన టాలెంట్​ను మరోమారు ప్రూవ్ చేసుకున్నాడు. ఫ్యూచర్ తమదేనని ఈ యంగ్ ఓపెనింగ్ జోడీ భరోసా ఇచ్చింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్​, తిలక్ వర్మ కూడా ఫామ్ చాటుకున్నారు. ముఖ్యంగా ఇషాన్ అయితే బెరుకు, భయం లేకుండా బ్యాటింగ్ చేశాడు. ఆఖరి టీ20లో టాపార్డర్ పెవిలియన్ చేరిన టైమ్​లో అయ్యర్ పట్టుదలతో బ్యాటింగ్ చేయడం అతడి మెచ్యూరిటీ ఏంటో చూపిస్తోంది. సూర్య అటు బ్యాటింగ్​లో అదరగొట్టడంతో పాటు ఇటు కెప్టెన్సీలోనూ తన మార్క్ చూపించాడు.

బౌలర్లకు అవసరమైన సలహాలు ఇస్తూ.. సిచ్యువేషన్​కు తగ్గట్లు ఫీల్డింగ్, బౌలింగ్ ఛేంజెస్ చేస్తూ కెప్టెన్​గా సూర్య ఆకట్టుకున్నాడు. పేసర్లు ముకేశ్ కుమార్, అర్ష్​దీప్ సింగ్, అవేష్ ఖాన్, దీపక్ చాహర్ రాణించారు. ముఖ్యంగా ముకేశ్ అవసరమైన ప్రతిసారి బ్రేక్ త్రూలు ఇచ్చాడు. స్పిన్నర్లు రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తమ బౌలింగ్​తో అదరగొట్టారు. బిష్ణోయ్ పవర్ ప్లేలో వికెట్లు తీస్తూ అపోజిషన్ టీమ్​ను ఒత్తిడిలోకి నెట్టాడు. అక్షర్ వికెట్లు తీస్తూనే బ్యాట్​తోనూ విలువైన కాంట్రిబ్యూషన్ అందించాడు. ఇలా ఈ సిరీస్​ భారత్​కు చాలా విధాలుగా మంచే చేసింది. సిరీస్ గెలిచారు.. కానీ ప్రయోగాలు చేయడంలో మాత్రం మన టీమ్ వెనుకబడింది.

సిక్త్ బౌలర్ ఎక్కడ?

ఆసీస్​తో టీ20 సిరీస్​ను నాలుగో మ్యాచ్​లోనే సొంతం చేసుకుంది టీమిండియా. అయినా ఆఖరి మ్యాచ్​లో పెద్దగా ప్రయోగాలు చేయలేదు. సిక్త్ బౌలింగ్ ఆప్షన్​ను ఏ మ్యాచ్​లోనూ వినియోగించుకోలేదు. ఐదుగురు మెయిన్ బౌలర్లు.. ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాటర్ల ఫార్ములానే వాడారు. ఇదే ఆప్షన్ ఐసీసీ టోర్నీల్లో మనల్ని చాలాసార్లు ఇబ్బంది పెట్టింది. ఇప్పుడైనా ప్రయోగాలు చేసి పరిష్కారం కనిపెడతారా అంటే మళ్లీ కథ మొదటికే వచ్చింది. కెప్టెన్ సూర్య, కోచ్ లక్ష్మణ్ సేఫ్ గేమ్ ఆడారు. ఇలాంటప్పుడు సిరీస్​లు పెట్టడం ఎందుకు? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. సిక్త్ బౌలింగ్ ఆప్షన్ వాడుకోలేదు.. అదే టైమ్​లో హార్దిక్ పాండ్యాకు బ్యాకప్​గా పేస్ బౌలింగ్ ఆల్​రౌండర్​ను కూడా ఈ సిరీస్​లో ప్రయోగించలేదు.

ఆప్షన్స్​ ఉన్నా వాడుకోలేదు!

శివమ్ దూబే రూపంలో ఆప్షన్ కళ్ల ముందే ఉన్నా అతడ్ని బెంచ్​కే పరిమితం చేశారు. దీంతో టీమ్ మేనేజ్​మెంట్​కు ఎందుకంత భయం? అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకవేళ ప్రయోగాలు చేసి ఓడినా లాంగ్ టర్మ్​లో మంచి ఫలితాలు వచ్చేవి కదా అని సీనియర్ క్రికెటర్స్ అంటున్నారు. అటు ఆసీస్ మాత్రం అన్ని రకాలుగా బౌలింగ్, బ్యాటింగ్, ఆల్​రౌండర్స్ విషయంలో ప్రయోగాలు చేసింది. ఈ సిరీస్ ఓడినా ఒరిగేదేం లేదనే ధీమాతో అటాకింగ్ గేమ్ ఆడింది. కానీ భారత్ మాత్రం ఎంతసేపు గెలుపు తప్ప ప్రయోగాలపై ఫోకస్ పెట్టలేదు. సేఫ్​ స్ట్రాటజీతో సిరీస్ అయితే నెగ్గారు కానీ సమాధానం లేని ఎన్నో ప్రశ్నల్ని అలాగే వదిలేశారు. మరి.. పెద్దగా ప్రయోగాలు చేయకుండానే ఆసీస్​తో సిరీస్​ను భారత్ ముగించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs AUS: అలా బౌలింగ్ చేయడానికి సూర్యనే కారణం.. అతడు చెప్పిన ఆ మాటతోనే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి