iDreamPost

Shivam Dube: దూబేపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రైనా.. ధోని చూస్తే పరిస్థితి ఏంటంటూ..!

  • Published Jan 12, 2024 | 11:13 AMUpdated Jan 12, 2024 | 11:13 AM

ఆఫ్ఘానిస్థాన్​తో జరిగిన తొలి టీ20లో శివమ్ దూబే దుమ్మరేపాడు. తన ఆల్​రౌండర్ ఎబిలిటీస్​తో టీమ్​కు విక్టరీని అందించాడు. అలాంటి దూబేపై మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఆఫ్ఘానిస్థాన్​తో జరిగిన తొలి టీ20లో శివమ్ దూబే దుమ్మరేపాడు. తన ఆల్​రౌండర్ ఎబిలిటీస్​తో టీమ్​కు విక్టరీని అందించాడు. అలాంటి దూబేపై మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

  • Published Jan 12, 2024 | 11:13 AMUpdated Jan 12, 2024 | 11:13 AM
Shivam Dube: దూబేపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రైనా.. ధోని చూస్తే పరిస్థితి ఏంటంటూ..!

ఆఫ్ఘానిస్థాన్​తో మూడు టీ20ల సిరీస్​ను టీమిండియా సూపర్బ్​గా స్టార్ట్ చేసింది. ఈ రెండు టీమ్స్ మధ్య మొహాలీ వేదికగా గురువారం రాత్రి జరిగిన తొలి టీ20లో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన భారత కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్​కు దిగిన ఆఫ్ఘాన్ ఓవర్లన్నీ ఆడి 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ముకేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లతో ఆకట్టుకున్నారు. బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్​పై పర్యాటక జట్టు విసిరిన టార్గెట్​ను టీమిండియా 17.3 ఓవర్లలో ఛేజ్ చేసేసింది. శివమ్ దూబె (60 నాటౌట్), జితేష్ శర్మ (31) రాణించడంతో ఈజీగా గెలుపు తీరాలకు చేరుకుంది. అయితే మ్యాచ్​ తర్వాత ఆల్​రౌండర్ దూబేతో మాజీ క్రికెటర్ సురేష్ రైనా కాసేపు మాట్లాడాడు. ఈ సందర్భంగా రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సీఎస్​కే కెప్టెన్ ధోని ఇది చూస్తే పరిస్థితి ఏంటన్నాడు.

భారత్-ఆఫ్ఘాన్​ మధ్య జరిగిన తొలి టీ20లో కామెంటేటర్​గా వ్యవహరించాడు రైనా. మ్యాచ్ ముగిసిన తర్వాత దూబేతో పాటు కుల్దీప్ యాదవ్, రింకూ సింగ్​తో కలసి ముచ్చటిస్తూ, సెల్ఫీలు దిగుతూ కనిపించాడు. ఈ క్రమంలో దూబేతో చిట్​చాట్ సందర్భంగా అతడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ టీ20లో 2 ఓవర్లు వేసిన దూబె 9 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. కీలక సమయంలో ప్రత్యర్థి జట్టు కెప్టెన్ ఇబ్రహీం జాద్రాన్ (25)ను ఔట్ చేశాడతను. ఈ విషయాన్ని చిట్​చాట్ సందర్భంగా ప్రస్తావనకు తీసుకొచ్చాడు రైనా. ‘ఇవాళ మ్యాచ్​లో నీ బౌలింగ్​ను గనుక ధోని భాయ్ చూస్తే వచ్చే ఐపీఎల్ సీజన్​లో నీకు 3 ఓవర్లు ఇవ్వడం ఖాయం’ అని రైనా అన్నాడు. దీనికి దూబె స్పందిస్తూ.. ‘రైనా భాయ్ చెప్పింది వింటున్నారా మాహీ భాయ్’ అని చెప్పాడు. దీంతో ఇద్దరూ నవ్వుల్లో మునిగిపోయారు.

If Dhoni sees this, that's it

ఇక, బ్యాటింగ్ ఆల్​రౌండర్​గా పేరు తెచ్చుకున్న శివమ్ దూబేకు భారత జట్టులో అంతగా అవకాశాలు రావడం లేదు. అతడ్ని ఎక్కువగా బెంచ్​కే పరిమితం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా టీ20 సిరీస్​తో పాటు సౌతాఫ్రికా టూర్​లోనూ ఈ పొడగరి ప్లేయర్​ను పక్కన పెట్టారు. దీంతో ఆఫ్ఘాన్​ సిరీస్​లోనూ ఆడించడం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా తొలి టీ20లోనే దూబేను బరిలోకి దింపాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అతడి నమ్మకం వృథా కాలేదు. బౌలింగ్​లో కీలక వికెట్​తో బ్రేక్ త్రూ అందించిన దూబె.. బ్యాట్​తోనూ చెలరేగిపోయాడు. 40 బంతుల్లో 60 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. ఆఖరి వరకు పట్టుదలతో బ్యాటింగ్ చేసి విన్నింగ్ షాట్​తో మ్యాచ్​ను ఫినిష్ చేశాడు. ఈ నేపథ్యంలో రైనా అతడ్ని మెచ్చుకున్నాడు. ఈ మ్యాచ్​లో అతడి బౌలింగ్​ను గనుక ధోని చూస్తే ఇక అంతేనని.. సీఎస్​కే తరఫున ఐపీఎల్​లో ఆడినప్పుడు 3 ఓవర్లు ఇవ్వడం పక్కా అన్నాడు. మరి.. రైనా చెప్పినట్లు ఐపీఎల్​లో దూబేకు ధోని బౌలింగ్ చేసే ఛాన్స్​ ఇస్తాడని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: టీమ్‌లోకి తీసుకోవడమే దండగ అన్నారు! అతనే గెలిపించాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి