iDreamPost

భారత్ ఆ విషయంలో చైనాను దాటేస్తుంది..!!

భారత్ ఆ విషయంలో చైనాను దాటేస్తుంది..!!

ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏదంటే.. వెంటనే గుర్తుకొచ్చే పేరు చైనా. ఆ తరువాతి స్థానంలో ఉంది మన భారత్. అయితే 2023 నాటికి ఈ గణంకాలు మారతాయని చెప్తున్నాయి తాజా నివేదికలు.

2023 నాటికి చైనాను దాటి ఇండియా అగ్రస్థానంలో నిలుస్తుందని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. 2022 నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా 8 బిలియన్లకు చేరుతుందని అంచనా వేసింది. 1950 నుంచి ప్రపంచ జనాభా అత్యంత తక్కువ వేగంతో పెరుగుతోందట. ఈ లెక్కన చూస్తే 2030 లో 8.5 బిలియన్లు, 2050 లో 9.7 బిలియన్లకు చేరుతందని చెప్తోంది.

2.3 బిలియన్ల జనాభాతో, ప్రపంచ జనాభాలో 29 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తూ.. ప్రపంచంలోని రెండు అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాలుగా తూర్పు, ఆగ్నేయ ఆసియా నిలిచాయి. ఐక్యరాజ్యసమితి ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం, చైనాలోని 1.426 బిలియన్లతో పోలిస్తే.. 2022 లో భారతదేశ జనాభా 1.412 బిలియన్లుగా ఉంది. ఈ సంఖ్య పెరిగి 2023 నాటికి జనాభా విషయంలో చైనాను అధిగమిస్తుందని తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి